AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: ఆ రాశుల వారికి శుభకాలం.. ఈ రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?

Today Horoscope: చాలామంది జీవితంలో ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలతో ఇబ్బందుల్లో పడుతుంటారు. అందుకే కొత్త పనులను మొదలు పెట్టాలన్నా, శుభకార్యాలు చేపట్టాలన్నా కొందరు తమ జాతకాలు, రాశిఫలాలను (Horoscope) అనుసరిస్తుంటారు.

Horoscope Today: ఆ రాశుల వారికి శుభకాలం.. ఈ రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
Horoscope Today
Srinivas Chekkilla
|

Updated on: May 28, 2022 | 6:30 AM

Share

Today Horoscope: చాలామంది జీవితంలో ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలతో ఇబ్బందుల్లో పడుతుంటారు. అందుకే కొత్త పనులను మొదలు పెట్టాలన్నా, శుభకార్యాలు చేపట్టాలన్నా కొందరు తమ జాతకాలు, రాశిఫలాలను (Horoscope) అనుసరిస్తుంటారు. ఈ క్రమంలో శనివారం (మే 28న ) రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

మేషం: ఈ రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు కనిపిస్తాయి. చేపట్టే పనుల్లో ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి.

వృషభం: ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఒక శుభవార్త ఆత్మవిశ్వాసాన్ని పెంచేలా చేస్తుంది. సమాజంలో తగిన గుర్తింపు లభిస్తుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.

మిథునం: ఈ రాశి వారు లక్ష్యాలను చేరుకునేందుకు ఎక్కువగా కష్టపడాలి. పలు సేవా, విందు కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగాల్లో మంచి ఫలితాలు ఉన్నాయి. ఒక శుభవార్త ధైర్యాన్ని నింపుతుంది.

కార్కాటకం: చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. భవిష్యత్తు కోసం చేసే వ్యూహాలు చేస్తారు. శుభ కార్యక్రమాలలో కుటుంబసభ్యులతో కలిసి పాల్గొంటారు. ఒక సంఘటన బాధ కలిగిస్తుంది.

సింహం: ఈ రాశి వారికి ఆశించిన ఫలితాలు వస్తాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. కీలక సమయాలలో సరైన నిర్ణయాలు తీసుకొని అందరినీ ఆకట్టుకుంటారు. ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు.

కన్య: ప్రారంభించిన పనులలో ప్రతికూల పరిస్థితులు కనిపిస్తాయి. అయినప్పటికీ పట్టుదలతో వాటిని పూర్తిచేస్తారు. కుటుంబ సభ్యుల మాటకు విలువ ఇవ్వడం మంచిది.

తుల: ఈ రాశి వారు చేపట్టిన పనుల్లో శ్రమ పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయభేదాలు వచ్చే అవకాశముంది. ఒక సంఘటన బాధ కలిగిస్తుంది.

వృశ్చికం: ఈ రాశి వారికి శుభకాలం. ఎప్పటినుంచో పూర్తికాని పనులు ఈ రోజు పూర్తవుతాయి. కుటుంబంలో సందడి వాతావరణం నెలకొంటుంది. ఖర్చులు పెరుగుతాయి.

ధనుస్సు: సమాజంలో మంచి గౌరవం ఏర్పడుతుంది. మనస్సును ప్రశాంతత లభిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.

మకరం: కీలక వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. అందరి ప్రశంసలు అందుకుంటారు. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు.

కుంభం: శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. సమయానికి ఆర్థిక సాయం చేసేవారు ముందుకొస్తారు. స్నేహితులతో సంతోషంగా గడుపుతారు. అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

మీనం: కీలక వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. దూర ప్రయాణాలు చేస్తారు. వ్యాపారాలు కలిసి వస్తాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది.

Follow Us
అయ్యో ఎంత ఘోరం.. భార్య, ఇద్దరు కుమార్తెలను చంపి.. భర్త సూసైడ్!
అయ్యో ఎంత ఘోరం.. భార్య, ఇద్దరు కుమార్తెలను చంపి.. భర్త సూసైడ్!
మహిళ మృతదేహాన్ని తరలిస్తూ ఈ అంబులెన్స్ డ్రైవర్ ఏం చేశాడో తెలుసా..
మహిళ మృతదేహాన్ని తరలిస్తూ ఈ అంబులెన్స్ డ్రైవర్ ఏం చేశాడో తెలుసా..
కుక్క ఆచూకీ చెబితే రూ.10 వేల రివార్డ్!
కుక్క ఆచూకీ చెబితే రూ.10 వేల రివార్డ్!
మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా..? ఈ పని చేయకపోతే ఇబ్బందే..
మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా..? ఈ పని చేయకపోతే ఇబ్బందే..
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. గెజిటెడ్ అధికారులకు కొత్త నిబంధనలు..
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. గెజిటెడ్ అధికారులకు కొత్త నిబంధనలు..
ఎత్తుకు పైఎత్తు వేసి శత్రువును గెలవాలి.. కాకి – పాము కథ
ఎత్తుకు పైఎత్తు వేసి శత్రువును గెలవాలి.. కాకి – పాము కథ
10 నిమిషాల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్ డెలివరీ.. ఈ ఒక్క పనితో..
10 నిమిషాల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్ డెలివరీ.. ఈ ఒక్క పనితో..
ఈమె పాడి పరిశ్రమలో విజయం సాధించిన తీరు చాలామందికి ఆదర్శం
ఈమె పాడి పరిశ్రమలో విజయం సాధించిన తీరు చాలామందికి ఆదర్శం
ఏపీలో FNCC నిర్మాణానికి లైన్‌ క్లియర్.. త్వరలోనే అధికారిక జీవో!
ఏపీలో FNCC నిర్మాణానికి లైన్‌ క్లియర్.. త్వరలోనే అధికారిక జీవో!
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో మరో కీలక పరిణామం..
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో మరో కీలక పరిణామం..