Weekly Horoscope: వార ఫలాలు.. ఈ వారంలో ఏ రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసా..?

Weekly Horoscope: ఈరోజులో కొత్తపనిని మొదలు పెట్టాలన్నా , శుభకార్యాలు మొదలు పెట్టాలన్నా జాతకాలు, రాశిఫలాల ఆధారంగా చేసేవారు చాలామంది..

Weekly Horoscope: వార ఫలాలు.. ఈ వారంలో ఏ రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసా..?
Weekly Horoscope

Weekly Horoscope: ఈరోజులో కొత్తపనిని మొదలు పెట్టాలన్నా , శుభకార్యాలు మొదలు పెట్టాలన్నా జాతకాలు, రాశిఫలాల ఆధారంగా చేసేవారు చాలామంది ఉన్నారు. జాతకాలను విశ్వసిస్తూ పనిని మొదలుపెట్టే ముందు కొంతమంది తమ జాతకం ఎలా ఉంది అంటూ.. తమ దినఫలాలపై దృష్టి సారిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఈ వారంలో కొన్ని రాశుల వారికి మంచి జరుగుతుంటే.. కొన్ని రాశులకు వారికి కొన్ని ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. అక్టోబర్ 10 నుంచి అక్టోబర్‌ 16 వరకు ఏ రాశివారికి ఎలా ఉందో చూద్దాం.

మేష రాశి:

ఈ వారంలో ఉద్యోగులకు స్థానచలనం ఉండే అవకాశం ఉంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఎట్టి పరిస్థితుల్లో దైవారాధన మరవద్దు. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు వింటారు. ఇతరులకు బాకీ రూపంలో ఇచ్చిన డబ్బులు తిరిగి మీకు ఇచ్చేస్తారు.

వృషభ రాశి:

ఈ రాశివారు ఈ వారంలో చేపట్టే పనులలో శ్రద్ద వహించాలి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. లాభాలు వచ్చే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. కొపాన్ని అదుపులో పెట్టుకోవడం మంచిది. ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది. ఇబ్బందులు ఎదురైనా కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు.

మిథున రాశి:

ఉద్యోగులకు మంచి అవకాశాలు ఉంటాయి. ఒక ముఖ్యమైన పనిని పూర్తి చేయగలుగుతారు. బాధ్యతలు పెరుగుతాయి. ఆదాయం మెరుగు పడుతుంది. పెండింగ్‌లో ఉన్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగిన కొద్ది మానసిక ఒత్తిడి ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలు పూర్తవుతుంటాయి. ఎలాంటి ఆటంకాలు ఉండవు. మీ కుటుంబంలోని ఒకరికి దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది.

కర్కాటక రాశి:

అనుకున్న పనులు సకాలంలో జరుగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త ఆదాయ మార్గాలు మీ ముందుకు వస్తాయి. ఉన్నత విద్య కోసం దూర ప్రాంతాలకు వెళ్తారు. బంధుమిత్రుల నుంచి సహాయం అందుకుంటారు. వ్యాపార రంగాలలో ఆదాయం సమకూరుతుంది.

సింహ రాశి:

ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు వింటారు. ఉరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కొన్ని సమయాలలో ఆర్థిక, అనారోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంది. కొందరు మిమ్మల్ని అపార్థం చేసుకుఏనే అవకాశం ఉంది. కొత్త ఆదాయ మార్గాలకు ప్రయత్నాలు చేస్తారు. కొత్త స్నేహితులు పరిచయమవుతారు. రియల్ ఎస్టేట్ వారికి మంచి ఆదాయం వస్తుంది. రాజకీయాలు, సామాజిక సేవా రంగాల వారికి సమయం అనుకూలంగా ఉంటుంది.

కన్య రాశి:

ఈ రాశివారికి ఈ వారంలో ముఖ్యమైన పనులు పూర్తి కాకపోవడంతో కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఉద్యోగంలో మరింతగా బాధ్యతలు పెరుగుతాయి. ఆర్థికంగా బాగానే ఉంటుంది. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. అనవసర ఖర్చులతో కష్టాలు పడే అవకాశం ఉంది. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఇరుగుపొరుగుతో వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోకపోవడం మంచిది.

తుల రాశి:

ఉద్యోగంలో అనేక మార్పలు చోటు చేసుకునే అవకాశం ఉంది. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. వ్యాపారాలు ముందుకు సాగుతాయి. అనవసరమైన ఖర్చులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరినీ నమ్మి ఆర్ధిక బాధ్యతలు అప్పగించవద్దు. కొందరు మిమ్మల్ని మోసగించే అవకాశం ఉంది. కొద్దిగా ఆదాయం పెరగడంతో కొన్ని ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. చిన్న వ్యాపారులకు శ్రమ ఎక్కువగా ఉంటుంఇ.

వృశ్చిక రాశి:

ఈ రాశివారికి ఈ వారంలో అన్ని కూడా అనుకూలంగా ఉంటాయి. ఆర్థికంగా పుంజుకుంటారు. అనుకున్నది జరిగిపోతుంది. ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కుతారు. శుభ కార్యలయాల్లో పాల్గొంటారు. ఇతరుల నుంచి సహాయ సహకారాలు అందుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వృత్తి, ఇతర వ్యాపారులకు మంచి అవకాశాలు లభిస్తాయి.

ధనుస్సు రాశి:

ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. ఈ వారంలో అనుకూలమైన మార్పులు జరుగుతాయి. ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. పెళ్లి వ్యవహారాలు విజయవంతం అవుతాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి. ఖర్చులు పెరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. సమాజంలో పలుకుబడి కలిగినవారితో పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి ఉద్యోగాల్లో విపరీతంగా ఒత్తిడి పెరుగు తుంది. ఇష్టం లేని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.

మకర రాశి:

కొత్త పరిచయాలు ఏర్పడతాయి. కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. మీరు చేపట్టే పనులు నెరవేరకపోవడంతో కొంత అసంతృప్తిగా ఉంటారు. రాజకీయాల్లో రాణించే అవకాశం ఉంది. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఆర్థికంగా మంచి లాభాలు పొందుతారు. వ్యాపారాలలో ముందుకు సాగుతారు. బాధ్యతలు పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. అనవసరమైన విషయాలలో దూరంగా ఉండటం మంచిది.

కుంభ రాశి:

ఈ వారం చాలా వరకు ఒడిదుడుకులు లేకుండా గడిచిపోతుంది. ఆరోగ్యం కుదుట పడటమే కాకుండా ఆదాయం పెరుగుతుంది. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంటుంది. సమాజంలో మంచి పేరు సంపాదించుకుంటారు. ఈ ఉద్యోగంలో పని ఒత్తిడి పెరిగినప్పటికీ లక్ష్యాలు, బాధ్యతలు పూర్తి చేస్తారు. అనవసర పరిచయాలకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపారుల ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. వివాదాలలో తలదూర్చకపోవడం మంచిది.

మీన రాశి:

ఉద్యోగంలో కొన్ని ఆటంకాలను అధిగమిస్తారు. వ్యాపారాలు నిలకడగా ఉంటాయి. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్త లు వింటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సామాజిక కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. ఆరోగ్యం జాగ్రత్త. వృత్తి నిపుణులకు, రియల్ ఎస్టేట్ వారికి బాగుంటుంది. ఎవరితోనూ వాద వివాదాలకు దిగకపోవడం మంచిది. ఖర్చుల విషయాలలో జాగ్రత్తగా ఉండాలి.

ఇవీ కూడా చదవండి:

Brahmotsavam: ముత్యాల పందిరిలో ఊరేగిన మలయప్ప స్వామి.. భక్తులకు సకల సౌభాగ్య సిద్ధినిస్తుందని నమ్మకం

Snapana Tirumanjanam: భక్తులకు కనువిందు చేసిన శ్రీవారి స్నప‌న తిరుమంజ‌నం వేడుక‌.. తామరపువ్వులు మండపం

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Telugu