Zodiac Signs: ఈ నాలుగు రాశులవారికి ఈ ఏడాది బాగా కలిసొస్తుంది.. పెట్టుబడులకు మంచి కాలం
ఇవి కూడా మంచి రాసుల్లో సంచారం చేస్తున్నాయి. అందువల్ల కొత్తగా వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టదలుచుకున్నవారు రెండు మూడు నెలల్లో గట్టి నిర్ణయం తీసుకుని ప్రారంభిస్తే అతి వేగంగా ఈ రంగంలో స్థిరపడటానికి, వృద్ధి చెందటానికి అవకాశం ఉంది.
కొత్తగా వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడానికి 2023 కంటే మంచి సంవత్సరం ఇప్పట్లో ఉండక పోవచ్చు. జీవన కారకుడైన శని స్వక్షేత్రంలో బలంగా ఉండటం, ధన కారకుడైన గురువు కూడా స్వక్షేత్రంలో స్థిరంగా ఉండటం కొత్త వ్యాపారాలకు అనువైన కాలమని చెప్పవచ్చు. ఇవే కాకుండా శుక్ర, బుధ గ్రహాలు కూడా వ్యాపారానికి దోహదం చేస్తాయి. ఇవి కూడా మంచి రాసుల్లో సంచారం చేస్తున్నాయి. అందువల్ల కొత్తగా వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టదలుచుకున్నవారు రెండు మూడు నెలల్లో గట్టి నిర్ణయం తీసుకుని ప్రారంభిస్తే అతి వేగంగా ఈ రంగంలో స్థిరపడటానికి, వృద్ధి చెందటానికి అవకాశం ఉంది.
ముఖ్యంగా వృషభం, కర్కాటకం, తుల, మకర రాశి వారికి వ్యాపార పరంగా ఈ ఏడాది బాగా కలిసి వస్తుంది. కొద్దిపాటి పెట్టుబడి తో వీరు అత్యధికంగా లాభాలు అర్థించడానికి అవకాశం ఉంది. వ్యాపారంలోనే కాకుండా షేర్లు, స్టాక్ మార్కెట్లలో కూడా వీరు పెట్టుబడులు పెట్టడం చాలా మంచిది. వీరు తప్పకుండా పురోగతి సాధించి ఆర్థికంగా స్థిరపడటానికి, అనూహ్యంగా అభివృద్ధి చెందటానికి అవకాశం ఉంది. నక్షత్రాలలో కూడా భరణి, రోహిణి, పుష్యమి, స్వాతి, పూర్వాషాడ, శతభిషం నక్షత్రాల వారు వ్యాపార పరంగా ముందుకు దూసుకుపోయే సూచనలు ఉన్నాయి. వీరి అదృష్ట కాలం కనీసం మూడేళ్లు తిరుగులేకుండా కొనసాగడం జరుగుతుంది.
వృషభ రాశి
ఆర్థిక విషయాలకు సంబంధించినంత వరకు ఈ రాశి వారు ఎంతో ముందు చూపుతో వ్యవహరిస్తారు. వీరికి సంపాదన మీద ప్రేమ ఎక్కువ. ఒక పథకం ప్రకారం ఆర్థిక వ్యవహారాలను నిర్వహించడంలో వీరిని మించినవారు ఉండకపోవచ్చు. వీరిలో ఉన్న ఈ లక్షణాలే వ్యాపారానికి పెట్టుబడులు అవుతాయి. బాగా రిస్క్ తో కూడిన వ్యాపారాలు వీరికి బాగా కలిసి వస్తాయి. బంగారం, టెక్స్టైల్, రియల్ ఎస్టేట్ తదితర వ్యాపారాలు వీరికి బాగా కలిసి వస్తాయి. షేర్లు, జూదాలు, బెట్టింగులు వంటి వ్యాపారాలలో కూడా వీరు ఆశించిన స్థాయిలో అభివృద్ధి సాధిస్తారు. మారుబేరాలు, బ్రోకరేజ్, కమిషన్ ఏజెన్సీలు వగైరాలు వీరికి కనకవర్షం కురిపిస్తాయి. వ్యాపారంలో అడుగుపెట్టడానికి వీరికి ఫిబ్రవరితో సమయం ప్రారంభం అయిపోయింది.
కర్కాటక రాశి
సాధారణంగా కర్కాటక రాశి వారు సిమెంట్, లిక్కర్, ఇనుము, ఆరోగ్యం, విద్య, లీగల్ వంటి వ్యాపారాల్లో అద్భుతంగా రాణిస్తారు. వీరిలో చొరవ ఎక్కువగా ఉంటుంది. ఎంత శ్రమకైనా వెనుకాడరు. దేనినైనా ఆర్గనైజ్ చేయగలరు. ఈ లక్షణాల వల్ల ఈ రాశి వారు వ్యాపార రంగంలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి సాధించడానికి అవకాశం ఉంటుంది. వీరికి ఈ ఏడాది గురు, శుక్ర గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నాయి. భాగస్వామ్య వ్యాపారంలో దూసుకుపోయే సూచనలు ఉన్నాయి. వీరు ఒంటరిగా కన్నా జంటగా వ్యాపారం ప్రారంభించడం వల్ల మెరుగైన ఫలితాలు అనుభవానికి వస్తాయి.
తులా రాశి
ఈ రాశి వారు స్వభావసిద్ధంగా వ్యాపారం పట్ల ఆసక్తి ఉన్నవారు అవుతారు. సాధారణంగా వీరిలో కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఎక్కువగా ఉంటాయి. అందరినీ కలుపుకొని పోయే తత్వం వీరిది. వీరు కూడా భాగస్వామ్య వ్యాపారంలో బాగా రాణిస్తారు. డబ్బు సంపాదించడంలో వీరికి తెలిసినన్ని మెలకువలు మరే రాశి వారికి తెలియదనడంలో అతిశయోక్తి ఏమీ లేదు. ఈ లక్షణాల కారణంగా వీరు ఏ వ్యాపారంలో అయినా అతి వేగంగా, అతి తేలికగా అభివృద్ధి సాధిస్తారు. బార్లు, హోటళ్లు, దుస్తులు, అలంకార వస్తువులు, ఆభరణాలు వంటి వ్యాపారాలు వీరికి బాగా కలిసి వస్తాయి. ముఖ్యంగా మహిళలకు సంబంధించిన వస్తువుల వ్యాపారంలో వీరు బాగా రాణిస్తారు. వీరికి ఈ ఏడాది ప్రారంభం నుంచి అద్భుతమైన కాలం మొదలైంది. వీరు ఈ అనుకూల సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం చాలా మంచిది.
మకర రాశి
ఈ రాశి వారికి ఓర్పు సహనాలు ఎక్కువ. ఎంతటి శ్రమనైనా ఓర్చుకుంటారు. మంచి ప్లానింగ్ ఉంటుంది. డబ్బును దుబారా చేయరు. కొద్దిగా పిసినారి తత్వం కూడా ఉంటుంది. అందువల్ల వ్యాపారంలో వీరు అతి తేలికగా, అతి త్వరగా రాణించడానికి అవకాశం ఉంటుంది. వీరికి ఈ ఏడాది గురువు, శని, శుక్ర గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల, వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి వీలుంటుంది. వీరు లిక్కర్, రియల్ ఎస్టేట్, గ్రంథ ప్రచురణ, మీడియా, రెస్టారెంట్ లు వంటి వ్యాపారాల్లో అనూహ్యమైన అభివృద్ధిని సాధించే అవకాశం ఉంది. గత జనవరి ద్వితీయార్థం నుంచి వీరికి సమయం అనుకూలంగా ఉంది. కొద్దిపాటి పెట్టుబడి తో వీరు ఒకటి రెండు సంవత్సరాలలో అపర కుబేరులు అయ్యే సూచనలు ఉన్నాయి. వీరికి ఈ ఏడాది స్పెక్యులేషన్ కూడా బాగా లభిస్తుంది. షేర్ల వ్యాపారంలో కూడా వీరు విపరీతంగా లాభాలు గడిస్తారు.