Zodiac Signs: అనుకూలంగా కీలక గ్రహాల సంచారం.. ఆ రాశుల వారికి డిసెంబరు నెలలో శుభ ఫలితాలు..!

వివిధ గ్రహాల సంచారాన్ని దృష్టిలో పెట్టుకుని ఆలోచించినప్పుడు కొన్ని రాశుల వారికి మాత్రమే గ్రహాల అనుకూలతలున్నట్టు అర్థమవుతుంది. మేషం, వృషభం, మిథునం, సింహం, తుల, ధనుస్సు రాశుల వారికి గ్రహ సంచారం పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉంది. ఇతర రాశులకు మిశ్రమంగా ఉంది. ఈ ఆరు రాశులకు గ్రహాలు చాలావరకు అనుకూలంగా ఉన్నందువల్ల, సాధారణంగా ధన, ధాన్యాలకు లోటుండదు.

Zodiac Signs: అనుకూలంగా కీలక గ్రహాల సంచారం.. ఆ రాశుల వారికి డిసెంబరు నెలలో శుభ ఫలితాలు..!
December Horoscope
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Dec 04, 2023 | 6:15 PM

వివిధ గ్రహాల సంచారాన్ని దృష్టిలో పెట్టుకుని ఆలోచించినప్పుడు కొన్ని రాశుల వారికి మాత్రమే గ్రహాల అనుకూలతలున్నట్టు అర్థమవుతుంది. మేషం, వృషభం, మిథునం, సింహం, తుల, ధనుస్సు రాశుల వారికి గ్రహ సంచారం పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉంది. ఇతర రాశులకు మిశ్రమంగా ఉంది. ఈ ఆరు రాశులకు గ్రహాలు చాలావరకు అనుకూలంగా ఉన్నందువల్ల, సాధారణంగా ధన, ధాన్యాలకు లోటుండదు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆదాయాలు, రాబడులు అంచనాలకు మించి పెరిగే అవకాశం ఉంటుంది. అధికార యోగం పట్టడం జరుగుతుంది. కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది. నిరుద్యోగులకు ఆఫర్లు అందివస్తాయి. పెళ్లి సంబంధాలు కుదురుతాయి. ఈ ఆరు రాశుల వారి జీవితాల్లో డిసెంబర్ నెలలో ఇవన్నీ గానీ, ఇందులో కొన్ని గానీ తప్పకుండా జరిగే అవకాశం ఉంటుంది.

  1. మేషం: ఈ రాశిలో గురువు ఉండడం, లాభస్థానంలో శనీశ్వరుడు, భాగ్య స్థానంలో బుధుడు, సప్తమ కేంద్రంలో శుక్రుడు సంచారం చేస్తుండడంతో పాటు రాశ్యధిపతి కుజుడు స్వస్థానంలో ఉండడం అనేవి తప్పకుండా రాజయోగం కలిగించడం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో అధికార యోగం పట్టవచ్చు. నిరుద్యోగులకు మంచి సంస్థలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఉద్యోగంమారా లనుకునే వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. ప్రేమ వ్యవహారాల్లో ఘన విజయం సాధిస్తారు.
  2. వృషభం: ఈ రాశివారికి రాశ్యధిపతి శుక్రుడు స్వస్థానంలో ఉండడం, కుజుడు స్వస్థానంలో ఉండడం, రాహువు లాభస్థానంలో సంచారం చేయడం అనేవి బాగా అనుకూల పరిస్థితులను సృష్టిస్తాయి. ఏ ప్రయత్నమైనా సత్ఫలితాలనిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో మీ మాటకు, చేతకు తిరుగుండదు. వ్యాపారాలు మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగిపోతాయి. ఆర్థిక ప్రయత్నాలు, అదనపు ఆదాయ ప్రయత్నాలు విజయాలనిస్తాయి. జీవిత భాగస్వామితో సఖ్యత, సయోధ్య ఏర్పడతాయి.
  3. మిథునం: ఈ రాశివారికి లాభంలో గురువు, భాగ్యస్థానంలో శనీశ్వరుడు, పంచమంలో శుక్రుడు, సప్తమంలో రాశ్యధిపతి బుధుడు జీవితంలో అద్భుతాలను సృష్టించడం జరుగుతుంది. జీవితం సానుకూల మలుపులు తిరిగే విధంగా కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఏ ప్రయత్నమైనా ఫలిస్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. మనసులోని కోరికలు నెరవేరు తాయి. గృహ, వాహన సౌకర్యాలు అమరే అవకాశం ఉంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది.
  4. సింహం: ఈ రాశివారికి సప్తమంలో శనీశ్వరుడు, భాగ్య స్థానంలో గురువు, చతుర్థంలో రవి, కుజులు, పంచ మంలో బుధుడు అనేక యోగాలను కల్పించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు అవుతాయి. ప్రతిభా పాటవాలు బాగా వెలుగులోకి వస్తాయి. మంచి గుర్తింపు లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాభవం, ప్రాధాన్యం పెరుగు తాయి. తప్పకుండా అధికార యోగం పడుతుంది. పిల్లల నుంచి ఊహించని శుభవార్తలు అందుతాయి.
  5. తుల: ఈ రాశివారికి దాదాపు ప్రతి గ్రహమూ అనుకూలంగా ఉన్నందువల్ల పట్టిందల్లా బంగారం అవు తుందని చెప్పవచ్చు. ప్రతి పనీ, ప్రతి ప్రయత్నమూ విజయవంతం అయ్యే అవకాశం ఉంది. ఆస్తి కలిసి రావడం, ఆస్తి విలువ పెరగడం వంటివి జరగవచ్చు. వృత్తి, ఉద్యోగాల్లో మీ ప్రాభవం బాగా పెరుగుతుంది. ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా అంది వస్తాయి. గృహ, వాహన సౌకర్యాలు వృద్ధి చెందుతాయి. అన్ని రకాలుగానూ జీవితాన్ని బాగా ఎంజాయ్ చేయడం జరుగుతుంది.
  6. ధనుస్సు: ఈ రాశివారికి కూడా దాదాపు అన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల తప్పకుండా విపరీత రాజయోగం పడుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో అధికారాలను అనుభవిస్తారు. ఏదైనా సంస్థకు అధిపతి అయ్యే అవకాశం కూడా ఉంది. ప్రతి ప్రయత్నమూ సఫలం అవుతుంది. అప్రయత్నంగా కూడా విజయాలు సాధిస్తారు. కుటుంబ, వ్యక్తిగత సమస్యలు వాటంతటవే పరిష్కారం అవుతాయి. ఆక స్మిక ధన లాభానికి అవకాశం ఉంది. అనారోగ్యం నుంచి ఆశించినంతగా ఉపశమనం లభిస్తుంది.