Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు ఉద్యోగ యోగం.. 12 రాశుల వారికి రాశిఫలాలు
Today Horoscope in Telugu (జూన్ 4, 2025): మేష రాశి వారు వ్యాపారాల్లో పెట్టుబడులకు తగ్గ లాభాలు పొందుతారు. ఆదాయానికి లోటుండదు. వృషభ రాశి వారికి ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, అనుకోని ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. మిథున రాశి వారి కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే...

దిన ఫలాలు (జూన్ 4, 2025): మేష రాశి వారు వ్యాపారాల్లో పెట్టుబడులకు తగ్గ లాభాలు పొందే అవకాశముంది. వృషభ రాశి వారికి ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, అనుకోని ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. అలాగే మిథున రాశి వారి కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోయే అవకాశముంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే…
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
సమయం బాగా అనుకూలంగా ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీ సమర్థతకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాల్లో మీ పెట్టుబడులకు తగ్గ లాభాలు పొందుతారు. ఆదాయానికి లోటుండదు. ముఖ్యమైన పనులన్నీ లాభసాటిగా పూర్తవుతాయి. ఒకరిద్దరు బంధుమిత్రులకు ఆర్థికంగా సహాయం చేయడం జరుగుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కుటుంబంలో ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. ఆస్తి వివాదం ఒకటి సానుకూలపడుతుంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ముఖ్యమైన పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, అనుకోని ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. ఉద్యోగ జీవితంలో ఒత్తిడి, శ్రమ బాగా తగ్గే అవకాశం ఉంది. సహచరులతో ఉద్యోగ బాధ్యతలను, లక్ష్యాలను పంచుకోవడం జరుగుతుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. వ్యక్తిగత సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. ప్రస్తుతానికి ఆర్థికంగా ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు. అదనపు ఆదాయ ప్రయత్నాల కలిసి వస్తాయి.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
వృత్తి, ఉద్యోగాలలో ఆశించిన పురోగతి ఉంటుంది. వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలు గడిస్తారు. ఏ ప్రయత్నం చేపట్టినా కలిసి వస్తుంది. ఇంటా బయటా పని భారం ఎక్కువగా ఉండడం, బరువు బాధ్యతలు పెరగడం వంటివి చోటు చేసుకుంటాయి. మీరు అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. సొంత ఇంటి ప్రయత్నాలు సానుకూలపడతాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఉద్యోగంలో అధికారుల నుంచి బాగా ఒత్తిడి ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉన్నా ఫలితం ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఆశించిన ఫలితం అందుతుంది. ముఖ్యమైన పనులు, వ్యవహారాల్ని పూర్తి చేస్తారు. ప్రయాణాల వల్ల లాభాలు కలుగుతాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. ఆశించిన పెళ్లి సంబంధం కుదురుతుంది. పిల్లలతో కొద్దిగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఆర్థిక లావాదేవీలకు, సహాయాలకు వీలైనంత దూరంగా ఉండడం మంచిది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
వృత్తి, ఉద్యోగాల్లో అధికారులు అత్యధిక ప్రాధాన్యం ఇస్తారు. మీ సలహాలు, సూచనలు సంస్థకు లాభం కలిగిస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. వ్యాపారాల్లో లాభాలు దాదాపు రెట్టింపవుతాయి. ఆదాయంలో పెరుగుదల ఉంటుంది కానీ, వృథా ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాల్ని పట్టుదలగా పూర్తి చేస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో అదనపు లాభాలు అందుకుంటారు. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధిస్తారు. వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. నిరుద్యోగులకు కొత్త ఆఫర్లు అందుతాయి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందే అవకాశం ఉంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం మీద తగినంత శ్రద్ధ పెట్టడం మంచిది. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఆర్థిక వ్యవహారాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. బాగా సన్నిహితుల వల్ల కొద్దిగా నష్ట పోయే అవకాశం ఉంది. ముఖ్యమైన ప్రయత్నాలు సఫలం అవుతాయి. వృత్తి, ఉద్యోగాలు ఉత్సా హంగా సాగిపోతాయి. వ్యాపారాలలో అంచనాలకు మించిన లాభాలు కనిపిస్తాయి. నిరుద్యోగులకు ఒకటి రెండు శుభవార్తలు అందుతాయి. వ్యక్తిగత సమస్యల ఒత్తిడి బాగా తగ్గుతుంది. బంధువుల నుంచి ఆశించిన శుభవార్త వింటారు. ఇష్టమైన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
వృత్తి ఉద్యోగాల్లో డిమాండ్ పెరుగుతుంది. వ్యాపారాలు సాదా సీదాగా సాగుతాయి. ముఖ్యమైన వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. మంచి పరిచయాలు కలుగుతాయి. ఆదాయం బాగానే ఉన్నప్పటికీ, కుటుంబ ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది. ఆర్థికపరంగా ఇతరులకు మాట ఇవ్వకపోవడం శ్రేయస్కరం. ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. గృహ, వాహన ప్రయత్నాలకు అవకాశం ఉంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఉద్యోగపరంగా ఒకటి రెండు శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. ముఖ్యమైన వ్యవహారాలు, పనులు తేలికగా పూర్తవుతాయి. ఆర్థిక సమస్యల నుంచి బాగానే గట్టెక్కుతారు. మితిమీరిన ఔదార్యంతో ఇతరులకు సహాయం చేస్తారు. అనవసర ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. పెళ్లి ప్రయత్నాల్లో బంధువుల నుంచి ఆశించిన శుభవార్త వింటారు. స్నేహితులతో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
ఆర్థిక విషయాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. వృత్తి, ఉద్యోగాలు సాఫీగా సాగిపోతాయి. వ్యాపారాల్లో కొద్దిగా లాభాలు పొందుతారు. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలకు సంబంధించి శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ప్రముఖులతో మంచి పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
వృత్తి, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. అధికారులకు, సహోద్యోగులకు బాగా ఉపయోగ పడతారు. ఏ ప్రయత్నం చేపట్టినా విజయవంతం అవుతుంది. వ్యాపారాల్లో శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా పూర్తవుతాయి. వ్యక్తిగత సమస్యలు కొద్దిగా పరిష్కారమవుతాయి. కుటుంబ సమస్యలపై ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. సహోద్యోగులతో బాధ్యతలను పంచుకోవాల్సి వస్తుంది. ఇంటా బయటా బాగా ఒత్తిడి, శ్రమ తప్పకపోవచ్చు. ఆర్థిక వ్యవహారాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడం మంచిది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలకు, కార్యకలాపాలకు లోటుండదు. కొద్ది ప్రయత్నంతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఆరోగ్యం పరవాలేదు. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు ఫలించకపోవచ్చు. పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు.



