మేష రాశిలో శుక్రుడు.. ఈ నెలంతా ఆ రాశుల మహిళలే అదృష్టవంతులు!
Lucky Zodiac Signs: మేష రాశిలో శుక్రుని సంచారం కొన్ని రాశుల స్త్రీలకు అదృష్టాన్ని తెస్తుంది. మేషం, మిథునం, కర్కాటకం, సింహం, ధనుస్సు, మకర రాశుల స్త్రీలు ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆర్థికంగా మంచి ఫలితాలు పొందుతారు. సంతాన యోగం, ఆస్తి లాభాలు కూడా కలుగుతాయి. విదేశాలకు వెళ్లే అవకాశం కూడా ఉంది. ఈ రాశులవారికి ఈ నెల అనుకూలంగా ఉంటుంది.

Women Lucky Zodiac Signs In June
మహిళా పక్షపాతి అయిన శుక్రుడు ఈ నెల 28 వరకూ మేష రాశిలో సంచారం చేయడం జరుగుతోంది. ఈ సంచారం వల్ల కొన్ని రాశులకు చెందిన మహిళలు ప్రేమల్లో, పెళ్లి ప్రయత్నాల్లో విజయం సాధించే అవకాశం ఉంది. కెరీర్ పరంగా శుభ యోగాలు పొందడం కూడా జరుగుతుంది. మేషం, మిథునం, కర్కాటకం, సింహం, ధనుస్సు, మకర రాశులకు చెందిన మహిళలు బాగా పురోగతి చెందుతాయి. వారి కలలు, కోరికలు, ఆశలు చాలావరకు నెరవేరుతాయి. ఉద్యోగపరంగా, ఆర్థికంగా స్థిరపడే అవకాశం కూడా ఉంటుంది. సంతాన యోగం పట్టే సూచనలున్నాయి.
- మేషం: ఈ రాశికి చెందిన మహిళలు ప్రేమ వ్యవహారాల్లో తప్పకుండా విజయాలు సాధిస్తారు. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం లేదా పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. ఉద్యోగంలో ఈ రాశి మహిళలు తమ సత్తాను నిరూపించుకుంటారు. తమ నైపుణ్యాలను బాగా మెరుగుపరచుకుంటారు. విదేశాల్లో చదువుల కోసం, ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న యువతులు తప్పకుండా శుభవార్తలు వింటారు. ఈ రాశివారికి గత మే 26 నుంచి అనుకూల సమయం ప్రారంభమైంది.
- మిథునం: ఈ రాశికి లాభ స్థానంలో శుక్ర సంచారం వల్ల ఈ రాశి మహిళలు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఉద్యోగంలో అధికార యోగం పడుతుంది. అధికారులు ప్రత్యేక బాధ్యతలను అప్పగించి ప్రోత్సహిస్తారు. ఏదైనా ఒక సంస్థలో అత్యున్నత స్థాయికి ఎదిగే అవకాశం ఉంది. యువతులు ఉన్నత విద్య కోసం లేదా ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. అతి తక్కువ ప్రయత్నంతో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఈ రాశి గృహిణులకు తప్పకుండా సంతాన ప్రాప్తి కలుగుతుంది.
- కర్కాటకం: ఈ రాశికి దశమ స్థానంలో శుక్ర సంచారం వల్ల ఉద్యోగినులు వృత్తి, ఉద్యోగాల్లో రికార్డులు సృష్టిస్తారు. ప్రతిష్ఠాత్మక సంస్థలో పని చేసే అవకాశం లభిస్తుంది. ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్లే అవకాశం కలుగుతుంది. ఉన్నతాధికారి స్థాయిలో ఉన్న వ్యక్తితో ప్రేమలో పడడం లేదా పెళ్లి కావడం జరుగుతుంది. ఈ రాశి మహిళలు పెట్టే పెట్టుబడులకు, చేసే మదుపులకు అంచనాలకు మించిన లాభాలు కలుగుతాయి. దంపతుల మధ్య అపార్థాలు, సమస్యలు తొలగిపోయి అన్యోన్యత పెరుగుతుంది.
- సింహం: ఈ రాశికి దశమాధిపతి అయిన శుక్రుడు భాగ్య స్థానంలో సంచారం చేయడం వల్ల ఈ రాశి మహిళలు ఉద్యోగంలో తప్పకుండా ఉన్నత పదవులు అందుకుంటారు. వీరి సమర్థతకు, ప్రతిభకు మంచి గుర్తింపు లభిస్తుంది. వీరి వృత్తి జీవితంలో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. విదేశీ సంపాదనను అనుభవించే యోగం పట్టే అవకాశం ఉంది. వీరు విదేశాల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నించడం మంచిది. సంతాన భాగ్యం కలుగుతుంది. ఆదాయానికి లోటుండని పరిస్థితి ఏర్పడుతుంది.
- ధనుస్సు: ఈ రాశికి పంచమ స్థానంలో శుక్ర సంచారం వల్ల ఈ రాశి మహిళలు ఉన్నత వర్గాలకు చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం, అందులో విజయం సాధించడం జరుగుతుంది. వీరికి తప్పకుండా మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఉద్యోగంలో ఉన్నత పదవులు లభిస్తాయి. ఉద్యోగినులకు ఉన్నత విద్య, సరికొత్త నైపుణ్యాలు లభిస్తాయి. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభాలనిస్తాయి. జీవిత భాగ స్వామితో అన్యోన్యత పెరుగుతుంది. సంతాన యోగానికి అవకాశం ఉంది. ఆరోగ్య భాగ్యం కలుగుతుంది.
- మకరం: ఈ రాశికి చతుర్థ స్థానంలో శుక్ర సంచారం వల్ల తల్లితండ్రుల నుంచి ఈ రాశి మహిళలకు ఆస్తిపాస్తులు లభిస్తాయి. కెరీర్ పరంగా బ్యాంక్ బ్యాలెన్స్ బాగా వృద్ధి చెందుతుంది. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి విశేషంగా లాభిస్తాయి. సంతాన యోగానికి బాగా అవకాశం ఉంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. ప్రేమ వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగంలో వీరి సమర్థతకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.



