Surya Grahan 2024: ఈ నెల 8న తొలి సూర్యగ్రహణం.. ఆరోగ్యంగా, ఆర్ధికంగా ఈ 7 రాశుల వారు జాగ్రత్తగా ఉండాల్సిందే..

భారత కాలమానం ప్రకారం రాత్రి 9:12 గంటలకు సూర్య గ్రహణం ప్రారంభమవగా, తెల్లవారుజామున 2:22 గంటలకు విడుదల కానుంది. ఈ సూర్య గ్రహణం మీన రాశి స్వాతి నక్షత్రంలో ఏర్పడుతుంది. ఈ సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు. అందువల్ల భారతదేశంలోని ఏ ప్రాంతంలో నివసించే ప్రజలపైన ఈ గ్రహణం ఎటువంటి ఫలితాలను ఇవ్వదు. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దీని ప్రభావం కొన్ని రాశుల మీద కనిపిస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యగ్రహణం ఈ 7 రాశులను ప్రభావితం చేస్తుంది.

Surya Grahan 2024: ఈ నెల 8న తొలి సూర్యగ్రహణం.. ఆరోగ్యంగా, ఆర్ధికంగా ఈ 7 రాశుల వారు జాగ్రత్తగా ఉండాల్సిందే..
Surya Grahanam 2024
Follow us
Surya Kala

|

Updated on: Apr 04, 2024 | 7:10 AM

8 ఏప్రిల్ 2024 సోమవతి అమావాస్య రోజున సంభవించే సూర్య గ్రహణం భారతదేశంలో కనిపించదు. కనుక ఈ గ్రహణం సూత కాలం ప్రభావం భారతదేశంలో చూపదు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ గ్రహణం ఉత్తర అమెరికా, మధ్య అమెరికా, గ్రీన్లాండ్, ఐస్లాండ్, అజోర్స్, దక్షిణ పసిఫిక్ మహాసముద్రం, ఉత్తర అట్లాంటిక్ మహా సముద్రంలో కనిపిస్తుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 9:12 గంటలకు గ్రహణం ప్రారంభమవగా, తెల్లవారుజామున 2:22 గంటలకు విడుదల కానుంది.

ఈ గ్రహణం మీన రాశి స్వాతి నక్షత్రంలో ఏర్పడుతుంది. ఈ సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు. అందువల్ల భారతదేశంలోని ఏ ప్రాంతంలో నివసించే ప్రజలపైన ఈ గ్రహణం ఎటువంటి ఫలితాలను ఇవ్వదు. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దీని ప్రభావం కొన్ని రాశుల మీద కనిపిస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యగ్రహణం ఈ 7 రాశులను ప్రభావితం చేస్తుంది. ఆ రాశులు ఏమిటో చూద్దాం..

మేషరాశి: ఈ రాశికి చెందిన వ్యక్తులపై సూర్య గ్రహణ ప్రభావం అధికంగా ఉంటుంది. ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు. ధనం నష్టపోతారు. కోపం ఎక్కువగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

సింహరాశి: ఈ రాశికి చెందిన వ్యక్తులు అంటు వ్యాధుల ప్రభావంతో ఇబ్బంది పడవచ్చు. భయం,  చంచలతను కూడా అనుభవించవచ్చు.

కన్యా రాశి: ఈ రాశి వారు తమ భార్య ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడంతోపాటు వారి వ్యాపార వ్యవహారాలను కూడా నిశితంగా గమనించాలి. లేకుంటే నష్టాలు సంభవించవచ్చు.

తుల రాశి: ఈ రాశి వారు ప్రమాదం బారిన పడి గాయ పడే అవకాశం ఉంది. వాహనం వేగాన్ని నియంత్రించండి.

వృశ్చిక రాశి: ఈ రాశికి చెందిన వ్యక్తులపై సూర్యగ్రహణం ప్రభావం అధికంగా ఉంటుంది. అదృష్టం కూడా దురదృష్టంగా మారి చేపట్టిన పనుల్లో అడ్డంకులను సృష్టిస్తుంది. చేస్తున్న పని చెడిపోవచ్చు.

కుంభ రాశి: కుంభ రాశి వారు ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. అనవసర ఖర్చులతో ధనం వృధా అవుతుంది.

మీన రాశి: ఈ రాశిలో గ్రహణం ఏర్పడనుంది. కనుక మీన రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఎక్కడా పెట్టుబడి పెట్టకూడదు. లేకుంటే ధన నష్టం సంభవించవచ్చు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు