Solar Eclipse: ఈ రాశుల వారికి సూర్య గ్రహణంతో యోగం.. ఆకస్మిక ధన లాభం పక్కా..!
ఈ నెల 8వ తేదీన, అమావాస్య రోజున రవి, చంద్రులతో రాహు కేతువులు కలవడం వల్ల సూర్యగ్రహణం ఏర్పడుతుంది. జ్యోతిషశాస్త్రం ప్రకారం గ్రహణ ప్రభావం జాతకుల మీద 7వ తేదీ నుంచే ప్రారంభమై దాదాపు 40రోజుల పాటు కొనసాగుతుంది. ఈ గ్రహణం మీన, కన్యా రాశుల్లో పడుతున్నందువల్ల మేషం, వృషభం, మిథునం, తుల, మకర రాశుల వారికి ఇది బాగా అనుకూల ఫలితాలనిస్తుంది.
ఈ నెల 8వ తేదీన, అమావాస్య రోజున రవి, చంద్రులతో రాహు కేతువులు కలవడం వల్ల సూర్యగ్రహణం ఏర్పడుతుంది. జ్యోతిషశాస్త్రం ప్రకారం గ్రహణ ప్రభావం జాతకుల మీద 7వ తేదీ నుంచే ప్రారంభమై దాదాపు 40రోజుల పాటు కొనసాగుతుంది. ఈ గ్రహణం మీన, కన్యా రాశుల్లో పడుతున్నందువల్ల మేషం, వృషభం, మిథునం, తుల, మకర రాశుల వారికి ఇది బాగా అనుకూల ఫలితాలనిస్తుంది. ఓ నెలా పది రోజుల పాటు వీరికి యోగదాయకంగా గడిచిపోతుంది. ఆకస్మిక ధన లాభం, ఆకస్మిక అధికార యోగం, విదేశీ ప్రయాణాలు, విదేశీ ఉద్యోగాలు, తీర్థ యాత్రలు, విహార యాత్రలు వంటివి చోటు చేసుకుంటాయి. మిగిలిన రాశుల వారికి సామాన్య ఫలితాలు అనుభవానికి వస్తాయి.
- మేషం: ఈ రాశివారికి ఈ గ్రహణం వల్ల ప్రతిభా పాటవాలు, శక్తి సామర్థ్యాలు బాగా వెలుగులోకి వస్తాయి. సర్వత్రా మంచి గుర్తింపు లభిస్తుంది. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు, చేసే ఆలోచనలు తప్ప కుండా సత్ఫలితాలనిస్తాయి. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. నిరుద్యోగులకు విదే శాల్లో కానీ, బాగా దూర ప్రాంతంలో గానీ ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది. ఉద్యోగులకు ఇష్ట మైన ప్రాంతాలకు స్థాన చలనానికి అవకాశముంది. అనారోగ్యానికి తగిన పరిష్కారం లభిస్తుంది.
- వృషభం: ఈ రాశివారిని గ్రహణం అకస్మాత్తుగా అందలాలకు తీసుకు వెడుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో అనుకో కుండా ప్రమోషన్లు లభించడం, జీతభత్యాలు పెరగడం వంటివి చోటు చేసుకుంటాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశముంది. నిరుద్యోగులకు ఆశించిన కంపెనీలో ఉద్యోగం లభించే సూచనలు న్నాయి. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి, పెట్టుబ డులు పెట్టడానికి, వ్యాపారాలు విస్తరించడానికి అవకాశముంది. ఆశించిన శుభవార్తలు అందుతాయి.
- మిథునం: ఈ రాశివారికి 7వ తేదీ తర్వాత ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. దీని వల్ల ప్రాధాన్యం పెరుగుతుంది. మంచి ఉద్యోగంలోకి మారడానికి కూడా అవకాశముంది. కొత్త ఉద్యో గంలో అధికారం చేపట్టే అవకాశముంటుంది. అనేక మార్గాల్లో ఆదాయం బాగా పెరుగుతుంది. ఆర్థికంగా అనూహ్యమైన పురోగతి సాధిస్తారు. వ్యాపారాలు లాభాల బాట పడతాయి. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. అనారోగ్యానికి తగిన చికిత్స లభిస్తుంది.
- తుల: ఈ రాశివారికి ఈ గ్రహణం నిజంగా ఓ అదృష్టమనే చెప్పాలి. దాదాపు నెల రోజుల పాటు వీరు ఆడింది ఆట పాడింది పాట అన్నట్టుగా ఉంటుంది. ధన యోగాలు, అధికార యోగాలు పడతాయి. రావలసిన డబ్బు చేతికి అంది ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడి అంచ నాలకు మించి పెరుగుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్ రావడంతో పాటు జీతభత్యాలు బాగా పెరిగే అవకాశం ఉంది. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. పలుకుబడి బాగా వృద్ధి చెందుతుంది.
- మకరం: ఈ రాశివారికి అనేక విధాలుగా కలిసి వస్తుంది. ప్రతి ప్రయత్నమూ విజయవంతం అవుతుంది. ఈ రాశికి తృతీయ స్థానంలో సూర్యగ్రహణం ఏర్పడడం వల్ల మహా భాగ్యయోగం ఏర్పడుతుంది. అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. సహాయ కార్యక్రమాల్లోనూ, సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొంటారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. బంధుమిత్రుల నుంచి ఆదరణ పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు లాభదాయకంగా మారుతాయి. పదోన్నతికి అవకాశాలున్నాయి.