Maharaja Yoga: అనుకూల స్థితిలో మూడు శుభ గ్రహాలు.. ఈ రాశుల వారికి మహారాజ యోగం..!

ప్రస్తుతం గురువు, బుధుడు, శుక్రుడు వంటి శుభ గ్రహాల అనుకూలతల కారణంగా ఆరు రాశుల వారిలో జనాకర్షణ బాగా పెరగబోతోంది. ఈ విధంగా జనాకర్షణ పెరగడం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అనుకూలతలతో పాటు, ఆదాయ వృద్ధికి, ఆర్థికాభివృద్ధికి కూడా అవకాశముంటుంది. వీరు ఎక్కడ ఉన్నా, ఎందరిలో ఉన్నా ఆ వైబ్రేషన్స్ కనిపిస్తుంటాయి. జ్యోతిషశాస్త్రంలో దీనిని మహారాజ యోగంగా అభివర్ణించారు.

Maharaja Yoga: అనుకూల స్థితిలో మూడు శుభ గ్రహాలు.. ఈ రాశుల వారికి మహారాజ యోగం..!
Maharaja Yoga 2024
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: Apr 03, 2024 | 6:37 PM

ప్రస్తుతం గురువు, బుధుడు, శుక్రుడు వంటి శుభ గ్రహాల అనుకూలతల కారణంగా ఆరు రాశుల వారిలో జనాకర్షణ బాగా పెరగబోతోంది. ఈ విధంగా జనాకర్షణ పెరగడం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అనుకూలతలతో పాటు, ఆదాయ వృద్ధికి, ఆర్థికాభివృద్ధికి కూడా అవకాశముంటుంది. మేషం, మిథునం, సింహం, తుల, ధనుస్సు, మకర రాశులకు ఈ అనుకూలతలు బాగా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ రాశివారు ఎక్కడ ఉన్నా, ఎందరిలో ఉన్నా ఆ వైబ్రేషన్స్ కనిపిస్తుంటాయి. జ్యోతిషశాస్త్రంలో దీనిని మహారాజ యోగంగా అభివర్ణించారు. దాదాపు మూడు నెలల పాటు ఈ రాశుల వారి ప్రభ వెలిగిపోతుంది.

  1. మేషం: సాధారణంగా చురుకుగా, చైతన్యవంతంగా ఉంటే ఈ రాశివారు ఈ మూడు నెలల కాలంలో అనేక ఘన విజయాలు సాధిస్తారు. ఈ రాశికి అధిపతి కుజుడు అయినందువల్ల ఈ రాశివారిలో పోరాట పటిమ, పట్టుదల, యాంబిషన్ కాస్తంత ఎక్కువగా వ్యక్తమవుతుంటాయి. వీరు ఇతరులకు స్ఫూర్తి దాయకంగా నిలుస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో వీరి శక్తి సామర్థ్యాలు కొత్త పుంతలు తొక్కుతాయి. పదోన్నతులు సంపాదించడం, ఆర్థికంగా అందలాలు ఎక్కడం వంటివి తప్పకుండా జరుగుతాయి.
  2. మిథునం: సహజసిద్ధంగానే అనేక ప్రతిభా పాటవాలు కలిగి ఉండే ఈ రాశికి బుధుడు అధిపతి అయినందు వల్ల వీరు ఎక్కడికి వెళ్లినా, ఏ పని చేసినా తమ ప్రతిభనే కాక, తమ ప్రత్యేకతను కూడా నిరూపించుకుంటారు. కమ్యూనికేషన్, వాక్ చాతుర్యం, హాస్యస్ఫూర్తికి మారుపేరైన ఈ రాశివారు ఏ వృత్తిలో ఉన్నా, ఏ ఉద్యోగం చేస్తున్నా అందరికంటే ముందుగా పురోభివృద్ధి చెందడం, అందలాలు ఎక్కడం జరుగుతుంది. ధన సంపాదనలో కూడా వీరు అగ్రస్థానానికి చేరడం జరుగుతుంది.
  3. సింహం: ఈ రాశికి రవి అధిపతి అయినందువల్ల వీరిలో అనుక్షణం చైతన్యం, చురుకుదనం వెల్లి విరుస్తుంటాయి. సహజ నాయకత్వ లక్షణాల వల్ల ఎందరిలో ఉన్నా వీరి ప్రత్యేకత కనిపిస్తుంటుంది. వృత్తి, ఉద్యోగాల్లోనే కాకుండా, ఆర్థికంగా కూడా వీరు అందరి కంటే ముందుండే అవకాశం ఉంది. వీరిలోని శక్తి సామర్థ్యాలు బాగా వెలుగులోకి వచ్చి అన్ని విధాలుగానూ అందలాలు ఎక్కడం జరుగుతుంది.
  4. తుల: ఎవరినైనా తేలికగా ఆకట్టుకోవడంలో, లౌక్యంగా వ్యవహరించడంలో, మాట చాతుర్యంలో ఈ రాశి వారిని మించినవారుండరు. వీరు ఎక్కడున్నా, ఏ రంగంలో ఉన్నా వీరి ప్రభావం కంపన ప్రకం పనలు సృష్టిస్తుంటుంది. ప్రశాంతంగా, నిబ్బరంగా, మృదువుగా సమస్యలను పరిష్కరించడంలో ఘటికులయినందువల్ల వీరు వృత్తి, ఉద్యోగాల్లో అతి తేలికగా, అతి త్వరగా వృద్ధిలోకి వచ్చే అవకాశముంటుంది. అతి సులువుగా డబ్బు సంపాదించి బాగా సుఖపడడం జరుగుతుంది.
  5. ధనుస్సు: ఈ రాశివారికి సాహసాలు చేయడమన్నా, రిస్కు తీసుకోవడమన్నా చాలా ఇష్టం. ఈ రాశినాథుడైన గురువు యాంబిషన్ కు ప్రతిరూపం. ఈ రాశివారు ఏ రంగంలో ఉన్నా ఆ రంగం వీరి వల్ల ప్రసిద్ధి చెందుతుంది. అదృష్టానికి, త్వరగా విస్తరించడానికి గురువు ఎంతగానో తోడ్పడతాడు. ఎప్పుడు చూసినా ఉత్సాహంగా, చైతన్యవంతులుగా కనిపిస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో పదోన్నతులు సాధించడానికి, ఆదాయపరంగా కూడా అందలాలు ఎక్కడానికి కృషి చేసి సఫలీకృతులవుతారు.
  6. మకరం: పట్టుదలకు, గట్టి ప్రయత్నానికి, అధిక శ్రమకు ప్రతి రూపాలైన మకర రాశివారు తాము అనుకున్నది సాధించే వరకూ దేనినీ విడిచిపెట్టరు. ఈ రాశివారిలో సృజనాత్మకత ఎక్కువగా ఉంటుంది. ఎవరికీ ఇబ్బంది కలిగించకుండానే వృత్తి, ఉద్యోగాల్లో పైకి రావడానికి, ఆర్థికంగా ముందంజ వేయడానికి ప్రయత్నిస్తారు. ఈ రాశివారిలో పురోగతితత్వం, దూరదృష్టి ఎక్కువ. వీరిలోని ఈ సానుకూల దృక్పథం వల్ల వీరు అతి తక్కువ కాలంలో అన్ని విధాలా అభివృద్ధిలోకి వచ్చే అవకాశం ఉంది.