Money Astrology: మీన రాశిలో శుక్ర, రాహువు అరుదైన కలయిక.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధన లాభం
ప్రస్తుతం తనకు ఉచ్ఛ రాశి అయిన మీన రాశిలో సంచారం ప్రారంభించిన శుక్రుడు తన శిష్యుడైన రాహువుతో కలవడం వల్ల విపరీతమైన ధనాభివృద్ధి కలుగుతుంది. ఆకస్మిక ధన లాభంతో పాటు, మనసులోని కొన్ని తీరని కోరికలు తీరడానికి కూడా అవకాశముంది. మీన రాశిలో శుక్ర, రాహువులు కలవడమనేది చాలా అరుదుగా జరుగుతుంది.
ప్రస్తుతం తనకు ఉచ్ఛ రాశి అయిన మీన రాశిలో సంచారం ప్రారంభించిన శుక్రుడు తన శిష్యుడైన రాహువుతో కలవడం వల్ల విపరీతమైన ధనాభివృద్ధి కలుగుతుంది. ఆకస్మిక ధన లాభంతో పాటు, మనసులోని కొన్ని తీరని కోరికలు తీరడానికి కూడా అవకాశముంది. మీన రాశిలో శుక్ర, రాహువులు కలవడమనేది చాలా అరుదుగా జరుగుతుంది. ఈ రెండు గ్రహాలు కలిసినప్పుడు తమకు అనుకూలమైన రాశుల వారిని ఏదో రూపేణ భాగ్యవంతుల్ని చేయడం జరుగుతుంది. ప్రస్తుతం ఈ రెండు గ్రహాల శుభ ఫలితాలకు అనుకూలంగా ఉన్న రాశులు వృషభం, మిథునం, కన్య, తుల, మకరం, కుంభం.
- వృషభం: ఈ రాశినాథుడైన శుక్రుడు లాభ స్థానంలో ఉచ్ఛ స్థితిలో ఉండడంతో పాటు రాహువుతో కలవడం వల్ల అనేక విధాలుగా ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. శ్రమకు తగ్గ ప్రతిఫలం తప్పకుండా ఉంటుంది. కుటుంబ వాతావరణం సుఖ సంతోషాలతో వెల్లి విరుస్తుంది. ప్రేమ జీవితం కొత్త పుంతలు తొక్కుతుంది. ఆదాయం బాగా పెరుగుతుంది. ఆదాయాన్ని పెంచుకోవడానికి కొత్త మార్గాలను అన్వేషిస్తారు. వైవాహిక జీవితంలో ఎటువంటి సమస్యలున్నా తొలగిపోతాయి.
- మిథునం: ఈ రాశివారికి దశమ స్థానంలో శుక్ర రాహువుల సంచారం వల్ల ఎటువంటి ఉద్యోగ ప్రయత్నమైనా సఫలం అవుతుంది. కొత్త ఉద్యోగానికి ఆఫర్లు రావడంతో పాటు, ఉద్యోగులకు కూడా అవకాశాలు బాగా పెరుగుతాయి. ధన ప్రవాహం పెరుగుతుంది. పనులు, వ్యవహారాల్లో ఎటువంటి ఆటం కాలున్నా తొలగిపోతాయి. శారీరక సౌఖ్యాలు పెరుగుతాయి. దాంపత్య జీవితం శుభ శోభనంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. ఉద్యోగాల్లో పదోన్నతులు లభిస్తాయి.
- కన్య: ఈ రాశివారు ఈ రెండు గ్రహాల యుతి వల్ల అత్యధికంగా ప్రయోజనం పొందుతారు. ఉద్యోగాల్లో పదోన్నతులు పొందుతారు. సొంతగా కంపెనీ పెట్టడానికి కూడా అవకాశాలు లభిస్తాయి. లాభదా యకమైన ఒప్పందాలను కుదర్చుకుంటారు. ఆర్థికంగా అతి వేగంగా పురోగతి చెందుతారు. జీవి తం పూర్తిగా శృంగార సంబంధమైన వ్యవహారాలతో నిండిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో అవకాశాలు పెరిగి, భారీగా ధన లాభాలు పొందుతారు. ఉద్యోగాల్లో ఊహించని విజయాలు చేకూరుతాయి.
- తుల: ఈ రాశి అధిపతి అయిన శుక్రుడు ఉచ్ఛపట్టడం, ఈ గ్రహంతో రాహువు కలవడం వల్ల ఆకస్మిక ధన లాభానికి, మహా భాగ్య యోగానికి అవకాశముంటుంది. వృత్తి, వ్యాపారాల్లో ఘన విజయాలు సాధిస్తారు. షేర్లు, ఆర్థిక లావాదేవీలు, వడ్డీ వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ వంటి అంశాలలో భారీగా లాభాలు పొందుతారు. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ఎటువంటి ప్రయత్నాలు తలపెట్టినా విజ యాలు సాధిస్తారు. చిన్న వయసులోనే సంపాదించడం, లాభాలు గడించడం ప్రారంభం అవుతుంది.
- మకరం: ఈ రాశివారికి ఉద్యోగ స్థానాధిపతి శుక్రుడు ఉచ్ఛపట్టడం, పైగా రాహువుతో కలవడం వల్ల ఒక విధమైన విపరీత రాజయోగం కూడా ఏర్పడింది. ఆదాయం బాగా పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి చక్కబడుతుంది. ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. శృంగార జీవి తం సుఖ సంతోషాలతో సాగిపోతుంది. జీవిత భాగస్వామితో విహార యాత్రకు వెళ్లే అవకాశ ముంది. కెరీర్ పరంగా అన్నీ శుభ వార్తలే వినడం, శుభ పరిణామాలు చోటు చేసుకోవడం జరుగుతుంది.
- కుంభం: ఈ రాశివారికి ధన స్థానంలో శుక్ర, రాహువుల సంచారం వల్ల అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించి ఆర్థిక లాభాలు అందుకుంటారు. ఏ పని తలపెట్టినా, ఏ ప్రయత్నం చేపట్టినా విజయాలు సాధిస్తారు. ఒకటి రెండు శుభ పరిణామాలు సంభ విస్తాయి. ఉద్యోగ జీవితం పదోన్నతులు, భారీ జీతభత్యాలతో పురోభివృద్ధి చెందుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. లాభదాయక పరిచయాలు పెరుగుతాయి. మనసులోని కోరికలు నెరవేరుతాయి.