Horoscope Today: ఆ రాశి వారికి ఆదాయానికి లోటుండదు..12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు

దిన ఫలాలు (ఏప్రిల్ 4, 2024): మేష రాశి వారు ఈ రోజు తక్కువ శ్రమతో ఎక్కువ ప్రతిఫలం సంపాదించడం జరుగుతుంది. గ్రహాల ప్రతికూలతల వల్ల వృషభ రాశి వారికి కొద్దిగా శారీరక శ్రమ, మానసిక శ్రమ తప్పకపోవచ్చు. మిథున రాశి వారికి కుటుంబ జీవితం, దాంపత్య జీవితం హ్యాపీగా సాగిపోతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today: ఆ రాశి వారికి ఆదాయానికి లోటుండదు..12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు
Horoscope Today 04th April 2024
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Apr 04, 2024 | 5:01 AM

దిన ఫలాలు (ఏప్రిల్ 4, 2024): మేష రాశి వారు ఈ రోజు తక్కువ శ్రమతో ఎక్కువ ప్రతిఫలం సంపాదించడం జరుగుతుంది. గ్రహాల ప్రతికూలతల వల్ల వృషభ రాశి వారికి కొద్దిగా శారీరక శ్రమ, మానసిక శ్రమ తప్పకపోవచ్చు. మిథున రాశి వారికి కుటుంబ జీవితం, దాంపత్య జీవితం హ్యాపీగా సాగిపోతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

రోజంతా అనుకూలంగా గడిచిపోతుంది. గురు, శనుల బలం పెరిగినందువల్ల వృత్తి, ఉద్యోగాల్లో ఆదాయానికేమీ లోటుండదు. తక్కువ శ్రమతో ఎక్కువ ప్రతిఫలం సంపాదించడం జరుగుతుంది. వ్యాపారాల్లో కూడా గతంలో కంటే లాభాలు పెరుగుతాయి. కొద్దిగా జాగ్రత్తలు తీసుకునే పక్షంలో వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఇల్లు కొనడానికి ఆలోచనలు సాగిస్తారు. ఆరోగ్యం సవ్యంగా సాగిపోతుంది. పెళ్లి ప్రయత్నాలు, ఉద్యోగ ప్రయత్నాల్లో ఆశించిన శుభవార్తలు వింటారు.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

గ్రహాల ప్రతికూలతల వల్ల కొద్దిగా శారీరక శ్రమ, మానసిక శ్రమ తప్పకపోవచ్చు. ఆదాయానికి లోటుండదు కానీ, ఖర్చులు పెరిగి ఇబ్బంది పడతారు. చేతిలో డబ్బు నిలవదు. బంధుమిత్రుల నుంచి కూడా ఆర్థిక సహాయం కోసం ఒత్తిడి ఉంటుంది. అదనపు ఆదాయం కోసం చేసే ప్రయ త్నాలు చాలావరకు ఫలిస్తాయి. ఉద్యోగ జీవితంలో అటు అధికారులు, ఇటు సహోద్యోగులు బాగా ఉపయోగించుకుంటారు. వ్యాపారాలు లాభాలపరంగా నిలకడగా ఉంటాయి. ధన యోగం పడుతుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

శుభ గ్రహాల బలం అనుకూలంగా ఉన్నందువల్ల ఉద్యోగ సిర్థత్వం, ఆర్థిక స్థిరత్వం లభించే అవకాశముంది. వృత్తి, ఉద్యోగాలు ఆశాజనకంగా సాగిపోతాయి. వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కు తాయి. వృత్తి, వ్యాపారాల్లోనే కాకుండా ఉద్యోగంలో సైతం కొత్త ఆలోచనలు ప్రవేశపెడతారు. మీ ఆలోచనలు అధికారులకు నచ్చుతాయి. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందే అవకాశముంది. కుటుంబ జీవితం, దాంపత్య జీవితం హ్యాపీగా సాగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

గతంలో చేసిన ప్రయత్నాలు, తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు సత్ఫలితాలనివ్వడం ప్రారంభి స్తాయి. ఆహార, విహారాల్లో కొద్దిపాటి జాగ్రత్తలను పాటించడం మంచిది. స్వల్ప అనారోగ్యానికి అవ కాశముంది. ఆదాయానికి లోటుండదు. అనేక మార్గాల్లో ఆదాయం కలిసి వస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో రాబడి పెరుగుతుంది. వ్యాపారాలు సానుకూలంగా సాగిపోతాయి. నిరుద్యోగులకు ఏదో ఒక ఆఫర్ అందుతూనే ఉంటుంది. ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తారు. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఇంటా బయటా అనుకూల పరిస్థితులుంటాయి. మీ మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరిగే అవకాశముంది. వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా, సామరస్యంగా సాగి పోతాయి. ఉద్యోగంలో అధికారులకు అండగా ఉంటారు. వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభి స్తుంది. జీవిత భాగస్వామి సహకారంతో కుటుంబ వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ఉంటాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆశించిన శుభవార్త వింటారు.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

అనుకోకుండా ఆస్తి వివాదం ఒకటి పరిష్కారానికి చేరుకుంటుంది. ఆదాయానికి లోటుండదు. అయితే, అనవసర ఖర్చులు పెరిగి ఇబ్బందులు పడతారు. ఎవరికీ ఎటువంటి వాగ్దానమూ చేయ కపోవడం మంచిది. రావలసిన సొమ్మును రాబట్టుకోవడం మీద, సొంత పనుల మీద దృష్టి పెట్టా ల్సిన అవసరం ఉంది. వృత్తి, ఉద్యోగాలపరంగా శుభవార్తలు వింటారు. కుటుంబంలో శుభ పరిణా మాలు చోటు చేసుకుంటాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కొందరు మిత్రులకు సహాయం చేస్తారు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

శుభ గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ముఖ్యమైన ప్రయత్నాలన్నీ నెరవేరుతాయి. ఆర్థికంగా బాగా లాభం చేకూరుతుంది. ఒకటి రెండు ధనయోగాలు పడతాయి. ఆస్తి సంబంధమైన శుభ వార్త వింటారు. వృత్తి, ఉద్యోగాల్లో మీ ప్రాభవం, ప్రాధాన్యం పెరుగుతాయి. వ్యాపారాల్లో పోటీ దార్ల ఒత్తిడి తగ్గి, లాభాలు పెరుగుతాయి. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. కుటుంబ జీవితం హాయిగా, ఆనందంగా గడిచిపోతుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. ఒకటి రెండు శుభవార్తలు వింటారు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

అర్ధాష్టమ శని వల్ల చిన్నా చితకా సమస్యలుండే అవకాశముంది. అయితే, ఇతర గ్రహాలన్నీ బాగా అనుకూలంగా ఉన్నందువల్ల రోజంతా ఉత్సాహంగానే గడిచిపోతుంది. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది. ఆదాయం బాగా పెరుగుతుంది. ఖర్చుల్ని తగ్గించుకుని, పొదుపు పాటిస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో మీ ప్రాధాన్యానికి తిరుగుండదు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. చిన్ననాటి స్నేహితులతో బాగా ఎంజాయ్ చేస్తారు. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందుతుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ధన యోగాలు పడతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధిస్తారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. పెళ్లి ప్రయత్నాలు చాలావరకు సఫలం అవుతాయి. మిత్రుల వల్ల కొద్దిగా డబ్బు నష్టపోయే అవకాశముంది. వృత్తి, ఉద్యోగాల్లో శుభ పరి ణామాలు చోటు చేసుకుంటాయి. అధికారులతో సంబంధాలు సానుకూలంగా ఉంటాయి. వ్యాపారాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతాయి. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో పని భారం బాగా పెరుగుతుంది. వ్యాపా రాల్లో శ్రమాధిక్యత ఉంటుంది కానీ, లాభాలకు లోటుండదు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. అవసరానికి చేతికి డబ్బు అందుతుంది. ముఖ్యంగా రావలసిన డబ్బు అందుతుంది. తొందరపడి ఎవరికీ మాట ఇవ్వకపోవడం మంచిది. నిరుద్యోగులు శుభవార్త వినే అవకాశం ఉంది. మంచి కుటుంబంలో పెళ్లి సంబంధం ఖాయమవుతుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో శ్రమ ఎక్కువ, ప్రతిఫలం తక్కువగా ఉంటుంది. ఆర్థికంగా కూడా కొద్దిగా ఒడిదుడుకులుంటాయి. ఇతరుల బాధ్యతలను తలకెత్తుకోవడం వల్ల ఇబ్బంది పడతారు. ఆధ్యా త్మిక చింతన పెరుగుతుంది. ఆలయాల సందర్శనతో పాటు దైవ కార్యాల్లో ఎక్కువగా పాల్గొం టారు. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు అంది వస్తాయి. పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. బంధువులతో కలిసి శుభ కార్యంలో పాల్గొంటారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

వృత్తి, వ్యాపారాలకు సంబంధించి సమయం బాగా అనుకూలంగా ఉంది. రాబడి బాగా పెరుగు తుంది. సానుకూల వాతావరణం నెలకొంటుంది. ఉద్యోగ జీవితంలో కూడా గౌరవాభిమానాలు పెరు గుతాయి. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. జీవిత భాగస్వామికి కెరీర్ పరంగా శుభ వార్తలు అందు తాయి. నిరుద్యోగులకు కోరుకున్న ఉద్యోగం లభించే అవకాశం ఉంది. సంపన్న కుటుంబంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే