Ugadi 2024 Astrology: ఉగాది తర్వాత ఈ రాశుల వారికి వద్దన్నా డబ్బే.. మహా భాగ్య యోగం పట్టనుంది..!

ఉగాది రోజున, అంటే ఈ నెల 9వ తేదీన బుధ గ్రహం మళ్లీ మీన రాశిలోకి ప్రవేశిస్తోంది. ఉగాది తర్వాత, అంటే ఏప్రిల్ 15న రవి తన ఉచ్ఛరాశి అయిన మేషంలోకి ప్రవేశిస్తున్నాడు. ఇక చంద్రుడు ఏప్రిల్ 9 తర్వాత మేషంలో గురువుతో కలిసి గజకేసరి యోగాన్ని సృష్టిస్తున్నాడు. ఈ గ్రహ సంచారం కొన్ని రాశుల వారికి అనేక రకాలుగా అదృష్టాన్ని పండించబోతోంది.

Ugadi 2024 Astrology: ఉగాది తర్వాత ఈ రాశుల వారికి వద్దన్నా డబ్బే.. మహా భాగ్య యోగం పట్టనుంది..!
Maha Bhagya Yoga 2024
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: TV9 Telugu

Updated on: Apr 05, 2024 | 6:00 PM

ఉగాది రోజున, అంటే ఈ నెల 9వ తేదీన బుధ గ్రహం మళ్లీ మీన రాశిలోకి ప్రవేశిస్తోంది. ఉగాది తర్వాత, అంటే ఏప్రిల్ 15న రవి తన ఉచ్ఛరాశి అయిన మేషంలోకి ప్రవేశిస్తున్నాడు. ఇక చంద్రుడు ఏప్రిల్ 9 తర్వాత మేషంలో గురువుతో కలిసి గజకేసరి యోగాన్ని సృష్టిస్తున్నాడు. ఈ గ్రహ సంచారం కొన్ని రాశుల వారికి అనేక రకాలుగా అదృష్టాన్ని పండించబోతోంది. ముఖ్యంగా, మేషం, మిథునం, కర్కాటకం, సింహం, తుల, ధనూ రాశుల వారికి మహాభాగ్య యోగం పట్టే అవకాశం కనిపిస్తోంది. ఈ రాశుల వారికి అన్ని విధాలుగానూ ఆదాయం పెరిగే అవకాశం ఉండడమే కాకుండా, అప్రయత్న ధన ప్రాప్తి సూచనలు కూడా ఉన్నాయి.

  1. మేషం: ఈ రాశికి ఉగాది నుంచి మహా యోగం పట్టబోతోంది. ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడు తుంది. అన్ని మార్గాల నుంచి ఆదాయం లభించే అవకాశం ఉంది. దీనికి తోడు ఉగాది తర్వాత గజకేసరి యోగం కూడా ఏర్పడడంతో వృత్తి, ఉద్యోగాల్లో ప్రాభవం బాగా పెరుగుతుంది. ఆకస్మిక ధన లాభంతో పాటు అప్రయత్న ధన ప్రాప్తికి కూడా అవకాశముంది. అనేక విషయాల్లో శుభ వార్తలు వినడం, వ్యక్తిగతంగా, కుటుంబపరంగా శుభ పరిణామాలు చోటు చేసుకోవడం జరుగుతుంది.
  2. మిథునం: ఈ రాశివారికి ఉగాది నుంచి భాగ్య, ఉద్యోగ, లాభాలు పటిష్ఠంగా ఉండబోతున్నందువల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఇబ్బడిముబ్బడిగా రాబడి పెరగడం, ధన లాభం కలగడం వంటివి జరుగుతాయి. ప్రతి రంగంలోనూ, ప్రతి అంశంలోనూ పురోగతి ఉంటుంది. జీవిత భాగస్వామికి ధన యోగం పట్టడంతో పాటు పిల్లలు బాగా వృద్ధిలోకి రావడం జరుగుతుంది. విదేశీ సొమ్మును అనుభవించే యోగం కూడా ఉంది. ఆశించిన స్థాయిలో శుభ పరిణామాలు సంభవిస్తాయి.
  3. కర్కాటకం: ఈ రాశివారికి సూర్య గ్రహణ ప్రభావం తొమ్మిది, పది స్థానాల మీద పడుతోంది. వృత్తి, ఉద్యోగాల్లో ఉన్న సమస్యలన్నీ పరిష్కారం కావడంతో పాటు, ఉన్నత స్థానాలకు చేరుకోవడం జరుగుతుంది. నిరుద్యోగులకు విదేశాల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. విదేశీ సొమ్మును అనుభవించే యోగం ఉంది. ఏ పని తలపెట్టినా, ఏ ప్రయత్నం చేపట్టినా తప్పకుండా విజయాలు మీ సొంత మవుతాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది.
  4. సింహం: ఈ రాశినాథుడైన రవి ఉగాది తర్వాత ఉచ్ఛపడుతుండడం వల్ల, ఈ లోపల మిత్ర క్షేత్రమైన మీన రాశిలో సంచారం చేస్తున్నందువల్ల అటు వృత్తి, ఉద్యోగాలపరంగానే కాకుండా ఇటు సామాజికంగా కూడా ప్రాభవం బాగా పెరుగుతుంది. ఈ రాశివారు ఉగాది తర్వాత తప్పకుండా ఉన్నత స్థానాలను అధిరోహిస్తారు. ఆర్థికంగా కూడా బంధుమిత్రుల కంటే ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశముంది. ప్రయాణాల వల్ల పరిచయాలు పెరగడంతో పాటు ఆర్థికంగా కూడా బాగా కలిసి వస్తుంది.
  5. తుల: ఈ రాశివారికి గ్రహణం వల్ల ఏ రంగంలో ఉన్నా లాభాలు పెరగడానికి, రాబడి వృద్ధి చెందడానికి అవకాశముంది. ఉద్యోగంలో జీతభత్యాలు, అదనపు రాబడి రూపేణా ఆదాయం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాల రూపేణా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగడంతో పాటు పెట్టుబడులు పెంచడా నికి, విస్తరించడానికి అవకాశం కలుగుతుంది. అనేక శుభవార్తలు వింటారు. ఆస్తిపాస్తులు కలిసి వచ్చే అవకాశముంది. కుటుంబపరంగా ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.
  6. ధనుస్సు: ఈ రాశివారికి ఉగాది రోజున బుధుడు చతుర్థ స్థానంలోకి మళ్లీ ప్రవేశించడం, రవి రాశ్యధిపతి గురువుతో మేష రాశిలో యుతి చెందడం, మేషరాశిలో గజకేసరి యోగం ఏర్పడడం వగైరా మార్పులన్నీ యోగదాయకమవుతాయి. అనేక రకాలుగా అదృష్టం పడుతుంది. అనేక మార్గాల్లో సంపాదన పెరుగుతుంది. కీర్తి ప్రతిష్ఠలు బాగా వృద్ధి చెందుతాయి. విదేశాల్లో ఉద్యోగరీత్యా స్థిరపడే అవకాశముంది. ఏ రంగానికి చెందినవారైనా తిరుగులేని పురోగతి సాధిస్తారు. అనేక విజయాలు వరిస్తాయి.

తెలుగోడి దెబ్బ.. సౌతాఫ్రికా అబ్బా..బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు..
తెలుగోడి దెబ్బ.. సౌతాఫ్రికా అబ్బా..బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు..
అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. తెరుచుకున్న శబరిమల ఆలయం
అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. తెరుచుకున్న శబరిమల ఆలయం
పార్లమెంటులోనే బిల్లు చింపేసి ఎంపీ డ్యాన్స్
పార్లమెంటులోనే బిల్లు చింపేసి ఎంపీ డ్యాన్స్
ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా