AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maha Yoga: మీన రాశిలో శని, శుక్రులు.. ఆ రాశుల వారికి మహా యోగాలు పట్టబోతున్నాయ్..!

Telugu Astrology: శని, శుక్రుల యుతి వలన వృషభం, మిథునంతో పాటు మరికొన్ని రాశుల వారికి మహా యోగాలు పట్టబోతున్నాయి. ఉద్యోగంలో పదోన్నతులు, ఆర్థిక లాభాలు, విదేశ ప్రయాణాలు, వివాహ యోగాలు వంటి శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంది. శుక్రుని ఉచ్ఛ స్థితితో పాటు శని-శుక్రుల యుతి కారణంగా ఈ యోగాలు పట్టబోతున్నాయి.

Maha Yoga: మీన రాశిలో శని, శుక్రులు.. ఆ రాశుల వారికి మహా యోగాలు పట్టబోతున్నాయ్..!
Maha Yoga
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: May 10, 2025 | 8:06 PM

ఈ నెల 18న రాహువు మీన రాశిని వదిలిపెట్టి కుంభ రాశిలో ప్రవేశించడంతో మీన రాశిలో శని, శుక్రులు మాత్రమే సంచారం చేయడం జరుగుతుంది. ఇవి రెండూ మిత్ర గ్రహాలు కావడం ఒక విశేషం కాగా, ఇందులో శుక్రుడు ఉచ్ఛ స్థితిలో ఉండడం మరో విశేషం. ఈ రెండు గ్రహాల యుతి ఈ నెల 31 వరకు కొనసాగుతుంది. ఈ కలయిక వల్ల వృషభం, మిథునం, కర్కాటకం, కన్య, తుల, మకర రాశివారికి అనేక విధాలుగా అదృష్ట యోగాలు కలుగుతాయి. ఆర్థిక యోగాలు, రాజయోగాలకు బాగా అవకాశం ఉంది.

  1. వృషభం: రాశ్యధిపతి శుక్రుడు లాభ స్థానంలో ఉచ్ఛపట్టడం, ఈ రాశికి అత్యంత శుభుడైన శని ఆ శుక్రుడితో కలిసి ఉండడం వల్ల ఉద్యోగ జీవితం గణనీయంగా మెరుగుపడుతుంది. ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. జీతభత్యాలు భారీగా పెరుగుతాయి. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి వీలు కలుగుతుంది. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి కుదురుతుంది. ఆరోగ్యం మెరుగు పడుతుంది.
  2. మిథునం: ఈ రాశికి దశమ స్థానంలో శని, శుక్రులు కలవడం అనేక విధాలుగా శుభ యోగాలను కలిగి స్తుంది. ఈ రాశివారికి వృత్తి, ఉద్యోగాలపరంగా రాజయోగాలు కలుగుతాయి. ఈ రాశివారికి ఉద్యోగంలో ఉన్నత పదవులు లభిస్తాయి. వృత్తి, ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. సమాజంలోని అత్యంత ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. మనసులోని ముఖ్యమైన కోరికలు చాలావరకు నెరవేరుతాయి.
  3. కర్కాటకం: ఈ రాశివారికి నవమ స్థానంలో శని, శుక్రుల కలయిక వల్ల అనేక రకాలుగా అదృష్టాలు కలిగే అవకాశం ఉంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. తండ్రి వైపు నుంచి ఆస్తి కలిసి వస్తుంది. నిరుద్యోగులకు విదేశాల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాల్లో కూడా విదేశీ సంబంధం కుదురుతుంది. ఆస్తి సమస్యలు పరిష్కారమై విలువైన ఆస్తి లభిస్తుంది. కొద్ది ప్రయత్నంతో సొంత ఇంటి కల నెరవేరుతుంది. కుటుంబ, వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి.
  4. కన్య: ఈ రాశికి సప్తమ స్థానంలో శని, శుక్రులు యుతి చెందడం వల్ల రాజకీయంగానే కాక, సామాజికంగా కూడా ప్రాబల్యం పెరుగుతుంది. ఒకటికి రెండుసార్లు ధన యోగాలు కలుగుతాయి. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం లేదా పెళ్లి కావడం జరుగుతుంది. వృత్తి, వ్యాపా రాలు కొత్త పుంతలు తొక్కుతాయి. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి విశేషంగా లాభిస్తాయి. ఉద్యోగంలో తప్పకుండా అందలాలు ఎక్కుతారు. ఒక కంపెనీకి అధిపతి అయ్యే అవకాశం కూడా కలుగుతుంది.
  5. తుల: రాశ్యధిపతి శుక్రుడు ఉచ్ఛ పట్టడంతో పాటు, ఈ రాశికి అత్యంత శుభుడైన శనీశ్వరుడితో కలిసి నందువల్ల ఈ రాశివారు ఏ రంగంలో ఉన్న దశ తిరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో తప్పకుండా రాజ యోగాలు కలుగుతాయి. వ్యాపారాల్లో లాభాలు అంచనాల్ని మించుతాయి. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా అందుతాయి. ఉన్నత స్థాయి కుటుంబంతో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. దాంపత్య జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది. ఊహించని ఆస్తి లాభం కలుగుతుంది.
  6. మకరం: రాశినాథుడు శని తృతీయ స్థానంలో ఉచ్ఛ శుక్రుడితో కలిసి ఉండడం వల్ల ఉద్యోగంలో ఉన్నత పదవులు లభించే అవకాశం ఉంది. రాజపూజ్యాలు పెరుగుతాయి. ప్రభుత్వం నుంచి గుర్తింపు లభిస్తుంది. ఏ ప్రయత్నమైనా విజయవంతం అవుతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి. దాంపత్య జీవితం మరింత అన్యోన్యంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు బాగా పెరుగుతాయి. తండ్రి వైపు నుంచి విలువైన ఆస్తి సంక్రమిస్తుంది.

గుల్జార్‌ హౌస్‌ అగ్నిప్రమాదంపై HRC సీరియస్‌.. నోటీసులు జారీ!
గుల్జార్‌ హౌస్‌ అగ్నిప్రమాదంపై HRC సీరియస్‌.. నోటీసులు జారీ!
పార్క్‌ చేసిన బైక్‌పై అనుమానాస్పదంగా సంచి.. ఓపెన్ చేసి చూడగా షాక్
పార్క్‌ చేసిన బైక్‌పై అనుమానాస్పదంగా సంచి.. ఓపెన్ చేసి చూడగా షాక్
ఆసియా కప్‌లో భారత్‌ పాల్గొనట్లేదని వార్తలు.. బీసీసీఐ సంచలన ప్రకటన
ఆసియా కప్‌లో భారత్‌ పాల్గొనట్లేదని వార్తలు.. బీసీసీఐ సంచలన ప్రకటన
మన దేవాలయాల సంపదతో అమెరికా, చైనా దేశాల అప్పు కూడా తీర్చవచ్చట
మన దేవాలయాల సంపదతో అమెరికా, చైనా దేశాల అప్పు కూడా తీర్చవచ్చట
దాయాది దేశం కోసం ఏమైనా చేసే పిల్ల సైతాన్లు
దాయాది దేశం కోసం ఏమైనా చేసే పిల్ల సైతాన్లు
రిషబ్ అవుట్‌తో స్టేడియం విడిచి వెళ్లిన యజమాని! రియాక్షన్ వైరల్!
రిషబ్ అవుట్‌తో స్టేడియం విడిచి వెళ్లిన యజమాని! రియాక్షన్ వైరల్!
ఇంట్లో సిరిసంపదల కోసం రాత్రి నిద్రపోయే ముందు పాటించాల్సిన నియమాలు
ఇంట్లో సిరిసంపదల కోసం రాత్రి నిద్రపోయే ముందు పాటించాల్సిన నియమాలు
రుక్మిణి సత్యభామ సమేత శ్రీ మోహన కృష్ణ స్వామి ఉంజల్ సేవ
రుక్మిణి సత్యభామ సమేత శ్రీ మోహన కృష్ణ స్వామి ఉంజల్ సేవ
పొలాలకు వెళ్తున్న రైతులు.. బీ కేర్‌ఫుల్!
పొలాలకు వెళ్తున్న రైతులు.. బీ కేర్‌ఫుల్!
తెలుగు సినిమాలను ఇష్టపడుతున్న అదితి శంకర్
తెలుగు సినిమాలను ఇష్టపడుతున్న అదితి శంకర్