Shukra Gochar 2023: స్వక్షేత్రమైన తులా రాశిలోకి శుక్ర గ్రహం.. ఆ రాశుల వారికి హనీమూన్ యోగం!

ద్విస్వభావ రాశి అయిన కన్యారాశిలో ప్రస్తుతం సంచారం చేస్తున్నశుక్రుడు.. ఈ నెలాఖరు నుంచి డిసెంబర్ 25 వరకూ చరరాశి అయిన తులా రాశిలో (స్వక్షేత్రంలో) సంచారం చేస్తున్నందువల్ల ప్రేమ యాత్రలకు తప్పకుండా అవకాశం ఉంటుంది. గ్రహ సంచారం రీత్యా కొన్ని రాశులవారు బయలు దేరే అవకాశం ఉన్నప్పటికీ, ఇది ప్రేమ యాత్రలకు మంచి సమయం అని కూడా గ్రహించడం మంచిది.

Shukra Gochar 2023: స్వక్షేత్రమైన తులా రాశిలోకి శుక్ర గ్రహం.. ఆ రాశుల వారికి హనీమూన్ యోగం!
Honeymoon
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Nov 10, 2023 | 3:36 PM

జ్యోతిషశాస్త్రం ప్రకారం శృంగార రసాధిపతి అయిన శుక్రుడు ద్విస్వభావ లేదా చర రాశుల్లో సంచరిస్తున్నప్పుడు ప్రేమ యాత్రలకు అవకాశం కలుగుతుంది. ప్రేమికులు, కొత్త దంపతులే కాక, భార్యాభర్తలు కూడా హనీమూన్ లేదా ప్రేమ యాత్రలు చేసే అవకాశం ఉంటుంది. ద్విస్వభావ రాశి అయిన కన్యారాశిలో ప్రస్తుతం సంచారం చేస్తున్నశుక్రుడు.. ఈ నెలాఖరు నుంచి డిసెంబర్ 25 వరకూ చరరాశి అయిన తులా రాశిలో (స్వక్షేత్రంలో) సంచారం చేస్తున్నందువల్ల ప్రేమ యాత్రలకు తప్పకుండా అవకాశం ఉంటుంది. గ్రహ సంచారం రీత్యా కొన్ని రాశులవారు బయలు దేరే అవకాశం ఉన్నప్పటికీ, ఇది ప్రేమ యాత్రలకు మంచి సమయం అని కూడా గ్రహించడం మంచిది. శుక్ర గ్రహం అనుకూల స్థానాల్లో సంచరిస్తున్న రాశుల వారికి మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. ఈ శృంగార గ్రహం అనుకూలంగా సంచరిస్తున్న స్థానాలుః వృషభం, మిథునం, సింహం, కన్య, వృశ్చికం, మకరం, మీనం. ఈ ఏడు రాశుల వారికి డిసెంబర్ 25లోగా తప్పకుండా హనీమూన్ యోగం పడుతుందని చెప్పవచ్చు.

  1. వృషభం: ఈ రాశినాథుడైన శుక్రుడు పంచమ స్థానమైన కన్యారాశిలో సంచారం చేయడం వల్ల ఈ రాశివారికి శృంగార, లైంగిక సంబంధమైన ఆలోచనలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. శృంగార భరితమైన రమణీయ ప్రదేశాలకు తప్పకుండా విహార యాత్ర లేదా ప్రేమ యాత్రకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఇది ప్రేయసీ ప్రియులకు, కొత్త దంపతులకు, భార్యాభర్తలకు కూడా వర్తిస్తుంది. సాధారణంగా ఈ నెల 29 తర్వాత ప్రేమ యాత్రకు తప్పకుండా బయలుదేరడం జరుగుతుంది.
  2. మిథునం: ఈ రాశికి ప్రస్తుతం చతుర్థ స్థానంలో, అంటే సుఖ సంతోషాలకు సంబంధించిన స్థానంలో శుక్ర సంచారం జరుగుతోంది. అందువల్ల ఈ రాశివారు తప్పకుండా ప్రేమ యాత్ర చేపట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతాలకు ప్రేమ యాత్రకు వెళ్లడం జరుగుతుంది. సాధారణంగా, ఈ నెల 29వ తేదీ లోపునే వీరు ప్రేమ యాత్ర చేసే అవకాశం ఉంది. ఈ సమయంలో ప్రేమ యాత్ర చేయగలిగితే గరిష్ట స్థాయిలో ఈ రాశివారు సుఖ సంతోషాలు అనుభవించే అవకాశం ఉంటుంది.
  3. సింహం: ఈ రాశికి ప్రస్తుతం ద్వితీయ స్థానంలో సంచరిస్తున్న శుక్రుడి వల్ల ఈ రాశివారిలో శృంగార భావనలు పేట్రేగే అవకాశం ఉంటుంది. వీరు ఒకటికి రెండు సార్లు ప్రేమ యాత్రలు చేసే అవకాశం కూడా ఉంది. సాధారణంగా జల ప్రాంతాలకు లేదా జలపాత ప్రాంతాలకు ప్రేమ యాత్ర సాగించడం జరుగుతుంది. ఈ నెల 29 లోపున ఒకసారి, ఆ తర్వాత ఒకసారి హనీమూన్ వెళ్లడం జరగవచ్చు. ప్రేమ యాత్రల సందర్భంగా ఆహార, విహారాల మీద భారీగా ఖర్చయ్యే అవకాశం కూడా ఉంటుంది.
  4. కన్య: ఈ రాశి మీద నుంచి శుక్రుడు సంచారం సాగిస్తున్నందువల్ల సాధారణంగా ఈ రాశివారిలో ప్రేమ భావనలు విజృంభించే అవకాశం ఉంటుంది. ఈ రాశివారు కూడా ఒకటికి రెండు సార్లు ప్రేయసి లేదా భార్యతో ప్రేమ యాత్ర చేయడానికి అవకాశం ఉంది. వీరు తమ ప్రేమ యాత్రలకు కొండలు, పర్వతాలు లేదా హిల్ స్టేషన్లను ఎంచుకోవడం జరుగుతుంది. దూర ప్రాంతాలు కాకుండా తామున్న ప్రాంతానికి బాగా దగ్గరగా ఉండే ప్రదేశాలను ఎంచుకునే సూచనలు కూడా ఉన్నాయి.
  5. వృశ్చికం: ఈ రాశికి లాభస్థానంలో శుక్ర సంచారం జరుగుతున్నందువల్ల ఈ రాశివారు తప్పకుండా హనీ మూన్ కు వెళ్లే అవకాశం ఉంటుంది. ఇందుకు ఈ రాశివారికి ఈ నెల 29 లోపు సమయం అను కూలంగా ఉంది. ప్రేమ యాత్రకు సాధారణంగా అరణ్యాలు, లోయ ప్రాంతాలను ఎంపిక చేసుకోవడం జరుగుతుంది. ఆహార, విహారాల మీదే కాకుండా, వస్త్రాభరణాల మీద కూడా భారీగా ఖర్చు చేసే అవకాశం ఉంది. ప్రేయసీ ప్రేమికులు లేదా కొత్త దంపతులు ప్రేమ యాత్ర చేయడం జరుగుతుంది.
  6. మకరం: ఈ రాశివారికి భాగ్య స్థానంలో శుక్రుడి సంచారం వల్ల ప్రేమ యాత్రలకు డిసెంబర్ 25 వరకు సమ యం బాగా అనుకూలంగా ఉంది. రెండు మూడుసార్లు ప్రేమ యాత్ర చేసే అవకాశం కూడా ఉంది. సాధారణంగా దూర ప్రదేశాలను, ఎత్తయిన ప్రదేశాలను తమ హనీమూన్ కు ఎంపిక చేసు కోవడం జరుగుతుంది. ఎక్కువగా కొత్త దంపతులు లేదా భార్యాభర్తలు ప్రేమ యాత్రకు వెళ్లే అవకాశం ఉంది. ప్రేమ యాత్ర సందర్భంగా సతీమణికి విలువైన వస్తువులు కానుకగా ఇవ్వడం జరుగు తుంది.
  7. మీనం: ఈ రాశివారికి సప్తమ స్థానంలో, అంటే కళత్ర స్థానంలో శుక్రుడు సంచారం చేస్తున్నందువల్ల ఈ నెల 29వ తేదీ లోపు తప్పకుండా ప్రేమ యాత్రకు వెళ్లే అవకాశం ఉంది. సాధారణంగా కొత్త దంప తులు లేదా భార్యాభర్తలు ఈ శృంగార యాత్రకు వెళ్లడం జరుగుతుంది. ఇష్టమైన ప్రాంతాలకు, సుందర ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉన్నప్పటికీ, ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్లే అవకాశం కూడా ఉంది. ఈ రాశివారికి సమయం బాగా అనుకూలంగా ఉంది. ఇది ఖర్చుతో కూడిన యాత్ర అవుతుంది.

(Note: ఇక్కడ అందించిన సమాచారం వారివారి నమ్మకం, విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుంది.  దీన్ని నిర్ధారించేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సమాచారాన్ని అందించాము)

మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి

మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!