Horoscope Today: స్నేహితుల వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం.. 12 రాశుల వారికి శుక్రవారం రాశిఫలాలు
దిన ఫలాలు (నవంబర్ 10, 2023): మేష రాశి వారికి వృత్తి, వ్యాపారాలు ఆశించిన విధంగా సానుకూలంగా సాగిపోతాయి. వృషభ రాశికి చెందిన నిరుద్యోగులకే కాకుండా, ఉద్యోగులకు కూడా మంచి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. మిథున రాశి వారికి ఉద్యోగంలో అనుకూల వాతావరణం ఉంటుంది. అధికారులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
దిన ఫలాలు (నవంబర్ 10, 2023): మేష రాశి వారికి వృత్తి, వ్యాపారాలు ఆశించిన విధంగా సానుకూలంగా సాగిపోతాయి. వృషభ రాశికి చెందిన నిరుద్యోగులకే కాకుండా, ఉద్యోగులకు కూడా మంచి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. మిథున రాశి వారికి ఉద్యోగంలో అనుకూల వాతావరణం ఉంటుంది. అధికారులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
వృత్తి, వ్యాపారాలు ఆశించిన విధంగా సానుకూలంగా సాగిపోతాయి. ఉద్యోగుల పనితీరుకు మంచి గుర్తింపు లభిస్తుంది. అధికారుల నుంచి ప్రోత్సాహకాలు కూడా లభిస్తాయి. ఇష్టమైన వ్యక్తులను కలుసుకుంటారు. దైవ సేవా కార్యక్రమాలకు సహాయం అందిస్తారు. సతీమణితో కలిసి వస్త్రాభర ణాలు కొనుగోలు చేస్తారు. దీర్ఘకాలిక రుణాలు బాగా తగ్గుముఖం పడతాయి. ఆరోగ్యం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. కుటుంబ జీవితం ప్రశాంతంగా, సామరస్యంగా సాగిపోతుంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
నిరుద్యోగులకే కాకుండా, ఉద్యోగులకు కూడా మంచి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపా రాలలో అంచనాలకు మించిన లాభాలు అందుతాయి. ముఖ్యమైన ఆచితూచి అడుగులు వేయడం మంచిది. కొందరు స్నేహితుల వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. బంధువులతో అపార్థాలు తలెత్తుతాయి. ఇంటా బయటా అదనపు బాధ్యతలు పెరుగుతాయి. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన సహకారం లభిస్తుంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఉద్యోగంలో అనుకూల వాతావరణం ఉంటుంది. అధికారులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి దైవ కార్యాల్లో పాల్గొం టారు. బంధుమిత్రులతో కలిసి శుభ కార్యంలో పాల్గొనే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహా రాలు విజయవంతంగా పూర్తవుతాయి. ఆరోగ్యం చాలావరకు కుదుటపడుతుంది. కొత్త ఉద్యోగావ కాశాలు అంది వస్తాయి. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుకుం టారు.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
వృత్తి, వ్యాపారాల్లో ఆశించినంతగా పురోగతి ఉంటుంది. ఉద్యోగంలో అనుకూల వాతావరణం ఉంటుంది. చాలా కాలంగా పెండింగులో ఉన్న పనులను పట్టుదలగా పూర్తి చేస్తారు. బంధువుల నుంచి శుభవార్త అందుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. సతీమణితో కలిసి దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థికంగా ఇబ్బందులున్నప్పటికీ కొందరు స్నేహితులకు సహాయం చేస్తారు. కుటుంబ సభ్యుల్లో ఒకరిని అనారోగ్యం ఇబ్బంది పెడుతుంది. ఎవరికీ హామీలు ఉండవద్దు.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
వృత్తి, వ్యాపారాలలో ఆటంకాలు తొలగిపోయి, లాభాల బాట పడతాయి. ఉద్యోగంలో పని భారం ఎక్కువగా ఉంటుంది. ఆదాయం బాగా పెరిగే సూచనలున్నాయి. సతీమణితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ముఖ్యమైన పనులను వేగంగా పూర్తి చేస్తారు. బంధువుల రాక పోకలుంటాయి. ఇంట్లో సామరస్య వాతావరణం నెలకొంటుంది. నిరుద్యోగులకు మంచి అవకా శాలు అంది వస్తాయి. పరిచయస్థులలో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఆర్థిక లావాదేవీలు, వ్యవహారాలు కొంత ఉత్సాహం కలిగిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో బరువు బాధ్య తలు పెరుగుతాయి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. వ్యాపారాలు సంతృప్తికరంగా ముందుకు సాగుతాయి. కుటుంబ సభ్యుల నుంచి శుభ వార్త వింటారు. బంధుమిత్రులతో కొద్దిగా అపార్థాలు చోటు చేసుకుంటాయి. తలపెట్టిన పనులు వేగంగా పూర్తవుతాయి. ఆరోగ్యానికి, ఆదాయానికి ఢోకా ఉండదు కానీ, ఖర్చులు బాగా తగ్గించుకోవాలి. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
కొద్ది ప్రయత్నంతో ఆదాయం బాగా పెరుగుతుంది. ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి. ఆరో గ్యానికి లోటు ఉండదు. అదనపు మార్గాల ద్వారా ఆదాయం కలిసి వస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో సమస్యలు కాస్తంత తగ్గుముఖం పడతాయి. ఆధ్యాత్మిక చింతన ఎక్కువవుతుంది. చిన్ననాటి మిత్రులతో సరదాగా గడుపుతారు. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. ఇంటా బయటా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కొందరు మిత్రుల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
వృత్తి, ఉద్యోగాలలో అధికారులు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. ప్రతి ప్రయత్నమూ సఫలం అవుతుంది. గట్టి పట్టుదలతో ముఖ్యమైన పనులు, వ్యవహారాలను పూర్తి చేస్తారు. ఆక స్మిక ధన లాభ సూచనలున్నాయి. ప్రముఖుల నుంచి అనుకోకుండా గుర్తింపు, సత్కారాలు లభిస్తాయి. తోబు ట్టువులతో లేదా బంధువులతో వివాదాలు సద్దుమణుగుతాయి. వ్యాపారాలు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతాయి. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
అనుకోకుండా ఒకటి రెండు శుభవార్తలు వింటారు. పెళ్లి సంబంధాల విషయంలో బంధువుల నుంచి కీలక సమాచారం అందుతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఒత్తిడి బాగా తగ్గుతుంది. ఆశించిన స్థాయిలో సంపాదన పెరుగుతుంది. బంధుమిత్రులు మీ సలహాలు పాటించి ప్రయోజనం పొందు తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని విందు కార్యక్రమంలో పాల్గొంటారు. కొత్త ఉద్యోగ ప్రయ త్నాలు చాలావరకు కలిసి వస్తాయి. రావాల్సిన డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందు తుంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
రోజంతా సానుకూలంగానే గడిచిపోతుంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవు తాయి. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ అన్నట్టుగా ఉంటుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఇంటా బయటా ఒత్తిడి కారణంగా కొన్ని పనులను వాయిదా వేస్తారు. ఉద్యోగంలో అధికారులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. బంధుమిత్రులతో అపార్థాలు చోటు చేసుకునే సూచనలున్నాయి. కుటుంబ జీవితం సాఫీగా సాగి పోతుంది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఉద్యోగ వాతావరణం చాలావరకు అనుకూలంగా ఉంటుంది. ఇతరుల విషయాల్లో తలదూర్చక పోవడం మంచిది. వృత్తి, వ్యాపారాల్లో కొత్త ప్రయత్నాలకు మొదలుపెడతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలను కుటుంబ సభ్యుల సహాయ సహ కారాలతో పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో మాట పట్టింపులుంటాయి. సతీమణితో కలిసి తగిన నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఆహార విహారాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఉద్యోగంలో పదోన్నతులకు అవకాశం ఉంది. గతంలో చేపట్టిన ప్రయత్నాలు ఇప్పుడు సత్ఫలితాలను ఇవ్వడం ప్రారంభిస్తాయి. ఆర్థికంగా మరింత పురోగతి సాధిస్తారు. స్థిరాస్తి వివాదాలు కూడా ఒక కొలిక్కి వస్తాయి. వ్యాపారాల్లో కొత్త ఆలోచనలను ప్రవేశపెట్టి లాభాలు అందుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. పది మందికీ మేలు జరిగే పనులు చేస్తారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.