Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి.. 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు..
దిన ఫలాలు (నవంబర్ 9, 2023): మేష రాశి వారికి వృత్తి, ఉద్యోగాల పరంగానూ సమయం ఆశించిన స్థాయిలో అనుకూలంగా ఉంది. వృషభ రాశి వారికి ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితిలో ఆశించిన మెరుగుదల ఉంటుంది. మిథున రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో ప్రమోషన్లు రావడం, అధికార యోగం పట్టడం, కుటుంబంలో సుఖ సంతోషాలు చోటుచేసుకోవడం వంటివి జరుగుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
దిన ఫలాలు (నవంబర్ 9, 2023): మేష రాశి వారికి వృత్తి, ఉద్యోగాల పరంగానూ సమయం ఆశించిన స్థాయిలో అనుకూలంగా ఉంది. వృషభ రాశి వారికి ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితిలో ఆశించిన మెరుగుదల ఉంటుంది. మిథున రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో ప్రమోషన్లు రావడం, అధికార యోగం పట్టడం, కుటుంబంలో సుఖ సంతోషాలు చోటుచేసుకోవడం వంటివి జరుగుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
గురువు కారణంగా భాగ్యానికి, అదృష్టానికి సంబంధించిన అంశాల్లోనూ, శనీశ్వరుడి కారణంగా వృత్తి, ఉద్యోగాలపరంగానూ సమయం ఆశించిన స్థాయిలో అనుకూలంగా ఉంది. ఏ ప్రయత్న మైనా సఫలం అవుతుంది. మనసులోని కోరికల్లో ఒకటి రెండయినా తప్పకుండా నెరవేరుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో కొద్దిగా అప్రమత్తంగా ఉండడం మంచిది. అనవసర ఖర్చులు పెరగడం గానీ, డబ్బు నష్టపోవడం కానీ జరుగుతుంది. కొన్ని దీర్ఘకాల వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
లాభ స్థానంలో ఉన్న రాహువు వల్ల ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితిలో ఆశించిన మెరుగుదల ఉంటుంది. ఖర్చులు బాగా తగ్గించుకోవడం మంచిది. శుభ కార్యాలు, దైవ కార్యాల మీద ఎక్కువగా ఖర్చు పెడతారు. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరగడంతో పాటు, ప్రమోషన్ లభించే అవకాశం కూడా ఉంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. తోబుట్టువుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
లాభ స్థానంలో గురువు, నాలుగవ స్థానంలో శుక్రుడు అనుకూలంగా ఉన్నందువల్ల వృత్తి, ఉద్యోగాల్లో ప్రమోషన్లు రావడం, అధికార యోగం పట్టడం, కుటుంబంలో సుఖ సంతోషాలు చోటు చేసుకోవడం వంటివి జరుగుతాయి. అయితే, రాశినాథుడైన బుధుడు ఆరవ స్థానంలో ప్రవేశించడం వల్ల స్వల్ప అనారోగ్యాలకు అవకాశం ఉంది. డబ్బు ఇవ్వడం, తీసుకోవడం వల్ల నష్టపోతారు. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. కొందరు మిత్రులు స్వార్థానికి ఉపయోగించుకుంటారు.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
తృతీయ స్థానంలో కేతువు, పంచమ స్థానంలో బుధుడు ఉండడం వల్ల తప్పకుండా కొన్ని శుభ వార్తలు వినడం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. పిల్లలు చదు వుల్లో విజయాలు సాధించడం జరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలకు సంబంధించి ఆశించిన సమాచారం అందుతుంది. డబ్బు విషయంలో సన్నిహితులు తప్పుదారి పట్టించడం జరుగుతుంది. అనవసర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
భాగ్య స్థానంలో ఉన్న గురువు రాశిని, రాశ్యధిపతినీ వీక్షిస్తున్నందువల్ల ఒకటి రెండు శుభ పరి ణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో అనుకూలతలు కనిపిస్తున్నాయి. కొత్త ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. విదేశీ కంపెనీల నుంచి కూడా నిరుద్యోగు లకు మంచి ఆఫర్లు అందే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. ఆలయాల సంద ర్శన, తీర్థయాత్రలు చోటు చేసుకుంటాయి. కొన్ని వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
వృత్తి, వ్యాపారాల్లో కొత్త ఆలోచనలు ప్రవేశపెడతారు. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. ఆదాయం పెరిగే అవకాశం ఉంది కానీ, ఖర్చులు అదుపు తప్పుతాయి. డబ్బుపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు. ధన స్థానంలో ఉన్న కుజ, రవుల వల్ల ఆర్థికంగా కొద్దిగా ఇబ్బంది పడే సూచనలు న్నాయి. సప్తమ స్థానంలో సంచరిస్తున్న రాహువు వల్ల ఇంటా బయటా ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. వ్యక్తిగత సమస్య ఒకటి టెన్షన్ పెడుతుంది. కుటుంబ విషయాలు సానుకూలంగానే ఉంటాయి.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
గ్రహ బలం చాలావరకు అనుకూలంగా ఉన్నప్పటికీ, రాశ్యధిపతి శుక్రుడు వ్యయ స్థానంలో నీచ బడి ఉన్నందువల్ల, కష్టార్జితం అత్యధిక భాగం వృథా అయిపోతూ ఉంటుంది. స్వల్ప అనారోగ్యా లకు, వైద్య ఖర్చులకు కూడా అవకాశం ఉంది. కొందరు మిత్రులు ఆర్థికంగా నష్టపరిచే సూచనలు న్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి. మాటకు, చేతకు విలువ పెరుగు తుంది. అనవసర పరిచయాలకు దూరంగా ఉండడం మంచిది. ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ఈ రాశిలో ప్రవేశించిన బుధుడి కారణంగా కొన్ని రుణ సమస్యల నుంచి విముక్తి లభించడం, వ్యక్తిగత సమస్యలు పరిష్కారం కావడం వంటివి జరుగుతాయి. ముఖ్యంగా దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కూడా కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. రాశ్యధిపతి కుజుడు వ్యయ స్థానంలో ఉండడం వల్ల ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంటుంది. సతీమణి వైపు నుంచి అనుకూలత పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా సాగిపోతాయి. ఆస్తికి సంబంధించి శుభవార్త వినడం జరుగు తుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
గ్రహ బలం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవు తుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. ముఖ్యమైన ఆర్థిక అవసరాలు తీరిపోతాయి. ఉద్యోగ స్థానాధిపతి బుధుడు వ్యయంలో ఉండడం, ఉద్యోగ స్థానంలో కేతువు ఉండడం వల్ల వృత్తి, ఉద్యోగాలకు సంబంధించి కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కొందరు సహోద్యో గులు మీకు వ్యతిరేకంగా ప్రచారం చేపట్టే సూచనలున్నాయి. ఇతరుల వ్యవహారాల్లో కల్పించుకో వద్దు.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
ధన, తృతీయ, దశమ, లాభ స్థానాలు బలంగా ఉన్నందువల్ల ఆదాయానికి, ఆర్థిక పరిస్థితికి ఏమాత్రం ఇబ్బంది ఉండదు. ఆర్థిక సమస్యలను తగ్గించుకునే ప్రయత్నాలు ప్రారంభిస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. నిరుద్యోగులకే కాక, ఉద్యోగులకు కూడా అవకాశాలు పెరుగుతాయి. ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది. శుభవార్తలు వింటారు. ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉంది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
భాగ్య, దశమ స్థానాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల వృత్తి, ఉద్యోగాలు బాగా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఆస్తిపాస్తుల విషయంలో శుభవార్తలు వింటారు. విదేశీ యాత్రలకు అవ కాశం లభిస్తుంది. పిల్లలు చదువుల్లో విజయాలు సాధిస్తారు. నిరుద్యోగులకు కోరుకున్న ఉద్యోగం లభించే సూచనలున్నాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఏలిన్నాటి శని కారణంగా ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఈ రాశినాథుడు గురువు ధన స్థానంలో సంచరించడం శుభ ప్రదమే కానీ, ఈ రాశిలో రాహువు సంచరించడం మాత్రం కొద్దిగా ఇబ్బంది పెడుతుంది. ఆదాయానికి లోటుండదు కానీ, స్వల్ప అనా రోగ్యానికి మాత్రం అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా సాగిపోతాయి. బరువు బాధ్య తలు పెరగడం, విశ్రాంతి లేకపోవడం వంటివి జరిగే అవకాశం ఉంది. అనవసర పరిచయాలకు, వ్యసనాలకు వీలైనంత దూరంగా ఉండడం మంచిది. సతీమణితో అన్యోన్యత బాగా పెరుగుతుంది.