Zodiac Signs: ధన్‌తేరస్ నుంచి ఈ 4 రాశులవారికి పట్టిందల్లా బంగారం.. అందులో మీరున్నారా.!

ఈ నెల 10న రాబోయే ధన్ తేరస్ (ధన త్రయోదశి) నుంచి 13వ తేదీ వరకు దాదాపు అన్ని రాశుల వారికి గ్రహ గతి ధన సంపాదనకు అనుకూలంగా ఉంది. నాలుగు రోజుల పాటు ధనపరంగా ఎటువంటి ప్రయత్నం చేసినా విజయవంతం అవడం, ఆర్థిక వ్యవహారాలు, ఆస్తి ఒప్పందాలు సానుకూలంగా పూర్తి కావడం జరుగుతుంది.

Zodiac Signs: ధన్‌తేరస్ నుంచి ఈ 4 రాశులవారికి పట్టిందల్లా బంగారం.. అందులో మీరున్నారా.!
Dhanteras
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Ravi Kiran

Updated on: Nov 08, 2023 | 6:44 PM

ఈ నెల 10న రాబోయే ధన్ తేరస్ (ధన త్రయోదశి) నుంచి 13వ తేదీ వరకు దాదాపు అన్ని రాశుల వారికి గ్రహ గతి ధన సంపాదనకు అనుకూలంగా ఉంది. నాలుగు రోజుల పాటు ధనపరంగా ఎటువంటి ప్రయత్నం చేసినా విజయవంతం అవడం, ఆర్థిక వ్యవహారాలు, ఆస్తి ఒప్పందాలు సానుకూలంగా పూర్తి కావడం జరుగుతుంది. చంద్రుడు సింహ రాశిలో ఉన్నప్పుడు ధన కారకుడైన గురువు దృష్టి ఈ రాశి మీద పడడం, ఆ తర్వాత చంద్రుడు కన్యారాశిలో శుక్రుడితో కలవడం, ఆ తర్వాత కూడా తులా రాశిలో చంద్రుడితో కలవడం వల్ల చంద్ర మంగళ యోగం (ధన యోగం) ఏర్పడడం అసాధారణ ధన యోగాలను ఇచ్చే అవకాశం ఉంది. చంద్రుడు అనుకోకుండా రెండు శుభ గ్రహాల ప్రభావానికి గురి కావడం అనేది తప్పకుండా మనసులోని కోరికలను నెరవేరుస్తుంది. వివిధ రాశులకు దీని ఫలితాలు ఏ విధంగా ఉండబోయేదీ పరిశీలిద్దాం.

మేషం:

ఈ రాశికి చంద్రుడు పూర్తిగా అనుకూలంగా మారుతున్నందువల్ల ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి వీరి మనసులోని కోరికలు తప్పకుండా నెరవేరే అవకాశం ఉంటుంది. అప్రయత్న ధన లాభ సూచనలున్నాయి. మొత్తం మీద ఈ నాలుగు రోజుల్లో ఆర్థిక సమస్యలు గానీ, ఆర్థిక సంబంధమైన ఒత్తిళ్లు గానీ ఉండకపోవచ్చు. కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేయడానికే అవ కాశాలున్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల ద్వారా అందవలసిన డబ్బు సకాలంలో అందుతుంది.

వృషభం:

ఈ రాశికి అనుకూల స్థానాల్లో చంద్రుడు సంచరిస్తున్నందువల్ల ఆర్థిక వ్యవహారాలు సజావుగా సాగిపోతాయి. ఆశలు వదిలేసుకున్న సొమ్ము కూడా కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. గృహ, వాహన సౌకర్యాలకు సంబంధించి శుభవార్తలు అందుతాయి. ఆస్తి సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆస్తి క్రయ విక్రయాలకు సంబంధించి ఒప్పందాలు కుదురుతాయి. తల్లితండ్రులు ఇంటికి వచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద ఆర్థికంగా, వృత్తి, ఉద్యోగాలపరంగా హ్యాపీగా గడిచి పోతుంది.

మిథునం:

ఈ రాశివారి పరిస్థితి నక్క తోకను తొక్కి వచ్చినట్టుగా ఉంటుంది. ధన స్థానాధిపతి చంద్రుడు పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉండడం వల్ల ఆర్థికంగా ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా కలిసి వస్తుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. బంధుమిత్రుల నుంచి బాకీలు వసూలు అవు తాయి. గృహ, వాహన యోగాలకు అవకాశం ఉంది. కుటుంబంతో కలిసి ఆలయాలు సందర్శిం చడం, విహార యాత్రకు వెళ్లడం వంటివి జరుగుతాయి. బంధుమిత్రులతో ఎంజాయ్ చేస్తారు.

కర్కాటకం:

ఈ రాశినాథుడైన చంద్రుడు ప్రస్తుతం అనుకూల స్థానాల్లో సంచారం చేస్తున్నందువల్ల, ఆర్థిక పరి స్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. బంధుమిత్రులతో సుఖ సంతోషాలతో గడపడంతో పాటు, ఇతరులకు సహాయం చేయడం కూడా జరుగుతుంది. ధన్ తేరస్ నుంచి దీపావళి ముగిసే వరకూ దాదాపు ప్రతి రోజూ హ్యాపీగా గడిచిపోతుంది. తల్లితండ్రులు, పిల్లలు ఇంటికి వచ్చే అవకాశం ఉంది. ధన, కుటుంబ స్థానంతో పాటు, సుఖ స్థానాధిపతి కూడా బలంగా ఉన్నందువల్ల ధనానికి లోటుం డదు.

సింహం:

ఈ రాశికి చంద్రుడితో పాటు, శుక్రుడు కూడా బాగా అనుకూలంగా ఉన్నందువల్ల నాలుగు రోజుల పాటు ఈ రాశివారికి ఆనందోత్సాహాలకు అవధులుండకపోవచ్చు. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అటు కంపెనీ నుంచి, ఇటు మిత్రుల నుంచి రావలసిన డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అంది అవసరాలు తీరిపోతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో కూడా రాబడి ఆశించిన స్థాయిలో పెరుగుతుంది. ఆరోగ్యం కూడా బాగా అనుకూలంగా ఉండడం జరుగు తుంది.

కన్య:

ఈ రాశిలో శుక్రుడు సంచరించడమే శుభప్రదం కాగా, చంద్రుడు కూడా అనుకూలంగా ఉండడం వల్ల ఈ రాశివారికి ఆర్థికంగా అనేక విధాలుగా కలిసి వస్తుంది. దాదాపు పట్టిందల్లా బంగారం అవు తుంది. సతీమణితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో విహార యాత్ర చేసే అవకాశం ఉంది. ఇష్టమైన బంధువులను, చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. కుటుంబ సభ్యుల మీద బాగా ఖర్చు చేసే అవకాశం ఉంది. తల్లితండ్రులు ఇంటికి రావడం జరుగు తుంది.

తుల:

వృత్తి, వ్యాపారాల పరంగానే కాకుండా ఉద్యోగంలో జీతభత్యాల పరంగా కూడా ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా లాభ స్థానంలో చంద్రుడి సంచారం వల్ల వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించి రాబడి పెరుగుతుంది. ఆకస్మిక ధన లాభానికి కూడా బాగా అవకాశం ఉంది. పండుగ రోజులను బాగా ఎంజాయ్ చేస్తారు. ఆలయాలను సందర్శించడం గానీ, పుణ్యక్షేత్రాలకు వెళ్లడం గానీ జరుగుతుంది. ఇష్టమైన వ్యక్తులతో, ఇష్టమైన ప్రాంతాలకు వెళ్లి ఆనందం అనుభవి స్తారు.

వృశ్చికం:

ఈ రాశివారికి భాగ్య స్థానంలో శుక్ర, చంద్రుల కలయిక, ఆ తర్వాత చంద్రుడు దశమ స్థానంలో ప్రవేశం వల్ల నాలుగు రోజులు బ్రహ్మాండంగా సాగిపోతాయి. ఆర్థిక పరిస్థితికి సంబంధించి మనసు లోని కోరిక నెరవేరుతుంది. వృత్తి, వ్యాపారాలపరంగా రాబడి పెరుగుతుంది.ఈ రాశ్యధిపతి కుజుడు వ్యయ స్థానంలో ఉన్నందువల్ల కుటుంబం మీద అత్యధికంగా ఖర్చు చేయడం జరుగుతుంది. సతీమణికి వస్త్రాభరణాలు కొనిచ్చే అవకాశం ఉంది. దైవ కార్యాల్లో పాల్గొనే సూచనలున్నాయి.

ధనుస్సు:

ఈ రాశికి భాగ్య, దశమ స్థానాల్లో చంద్రుడి సంచారం, దశమ స్థానంలో శుక్రుడి సంచారం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల నాలుగు రోజుల పాటు ఆనందోత్సాహాల్లో మునిగి తేలుతారు. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. రావలసిన డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. మొండి బాకీలు వసూలవుతాయి. మొత్తానికి ఆర్థిక పరిస్థితి ఎంజాయ్ చేయగలిగిన స్థితిలో ఉంటుంది. తల్లితండ్రులు, తోబుట్టువులు, కుటుంబ సభ్యులతో విహార యాత్ర చేసే అవకాశం ఉంది.

మకరం:

ఈ రాశికి అష్టమ, భాగ్య, దశమ స్థానాల్లో చంద్రుడి అనుకూల సంచారం, భాగ్య స్థానంలో శుక్రుడి సంచారం వల్ల ఆర్థిక పరిస్థితికి లోటుండదు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల ద్వారా ఆదాయం పెరుగుతుంది. తల్లితండ్రుల సహాయ సహకారాలుంటాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడడంతో పాటు సామాజిక హోదా కూడా పెరుగుతుంది. కుటుంబ సభ్యులకు వస్త్రాభరణాలు కొనిస్తారు. విహార యాత్రకు గానీ, తీర్థయాత్రకు గానీ వెళ్లే అవకాశం ఉంది. తోబుట్టువులు ఇంటికి వస్తారు.

కుంభం:

చంద్ర, శుక్రుల సంచారంతో పాటు, రవి, కుజుల సంచారం కూడా అనుకూలంగా ఉండడం వల్ల, ఆర్థిక పరిస్థితి చాలావరకు ఆశించిన స్థాయిలో ఉంటుంది. కుటుంబ సభ్యుల మీద వీలైనంతగా ఖర్చు చేసే అవకాశం ఉంది. ఏలిన్నాటి శని తాలూకు కష్టనష్టాలు బాగా తగ్గి గురు బలం బాగా పెరగడం వల్ల, సుఖ సంతోషాలకు ఎక్కువగా ఆస్కారముంది. ఇష్టమైన ప్రాంతాలను, ఇష్టమైన ఆలయాలను సందర్శించడం జరుగుతుంది. ఇంటికి కొందరు బంధుమిత్రుల రాకపోకలుంటాయి.

మీనం:

ఈ రాశికి శుక్రుడు సప్తమ స్థానంలో బాగా అనుకూలంగా ఉండడంతో పాటు, పంచమాధిపతి చంద్రుడు కూడా మిత్ర క్షేత్రాలలో అనుకూల సంచారం చేస్తుండడంతో ఈ నాలుగు రోజుల పాటు సంతృప్తికరమైన, ఆనందదాయకమైన జీవితం గడపడం జరుగుతుంది. ముఖ్యంగా ఆర్థిక పరి స్థితికి లోటుండదు. ఇతరులకు సహాయం చేయడం కూడా జరుగుతుంది. కుటుంబ సభ్యులను, తల్లితండ్రులను, తోబుట్టువులను సంతోషపెట్టడానికి వీలైనంతగా ప్రయత్నం చేసే అవకాశం ఉంది.

యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!