Horoscope Today: వారికి కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి.. 12 రాశుల వారికి రాశిఫలాలు ఇలా..

దినఫలాలు (నవంబర్ 11, 2023): మేష రాశి వారికి ఉద్యోగంలో అనుకూలమైన మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారాలు ఆశించిన దాని కంటే ఎక్కువ లాభాలనిస్తాయి. వృషభ రాశి వారికి రోజంతా ఆర్థిక వ్యవహారాలు ప్రాధాన్యం సంతరించుకుంటాయి. మొండి బాకీలు వసూలు చేసుకుంటారు. మిథున రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన ప్రోత్సాహం లభిస్తుంది. వ్యాపారాలు లాభాల బాటలో పయనిస్తాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

Horoscope Today: వారికి కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి.. 12 రాశుల వారికి రాశిఫలాలు ఇలా..
Horoscope Today 11th November 2023
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Nov 11, 2023 | 5:01 AM

దినఫలాలు (నవంబర్ 11, 2023): మేష రాశి వారికి ఉద్యోగంలో అనుకూలమైన మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారాలు ఆశించిన దాని కంటే ఎక్కువ లాభాలనిస్తాయి. వృషభ రాశి వారికి రోజంతా ఆర్థిక వ్యవహారాలు ప్రాధాన్యం సంతరించుకుంటాయి. మొండి బాకీలు వసూలు చేసుకుంటారు. మిథున రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన ప్రోత్సాహం లభిస్తుంది. వ్యాపారాలు లాభాల బాటలో పయనిస్తాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఉద్యోగంలో అనుకూలమైన మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారాలు ఆశించిన దాని కంటే ఎక్కువ లాభాలనిస్తాయి. సమయం బాగా అనుకూలంగా ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో మీ మాటకు తిరుగుండదు. బంధువుల వివాదాల్లో తలదూర్చకపోవడం మంచిది. ఆస్తి వివాదంలో రాజీ మార్గం అనుసరి స్తారు. దూర ప్రాంతాల్లో స్థిరపడిన పిల్లల నుంచి శుభవార్తలు అందుకుంటారు. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు వస్తాయి. ఆరోగ్యం విషయంలో మరింత శ్రద్ధ తీసుకోవడం మంచిది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

రోజంతా ఆర్థిక వ్యవహారాలు ప్రాధాన్యం సంతరించుకుంటాయి. మొండి బాకీలు వసూలు చేసుకుంటారు. రాదనుకున్న డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. అదనపు ఆదాయ మార్గాల విషయంలో ప్రయత్నాలు పెరుగుతాయి. పొదుపు సూత్రాలను క్రమం తప్పకుండా పాటిస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. సతీమణి కెరీర్ పరంగా ఆశించిన పురోగతి సాధిస్తారు. శ్రమ, ఒత్తిడి కారణంగా విశ్రాంతి కరువవుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన ప్రోత్సాహం లభిస్తుంది. వ్యాపారాలు లాభాల బాటలో పయనిస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో విజయాలు సాధిస్తారు. అదనపు ఆదాయ మార్గాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. చిన్ననాటి స్నేహితులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి కొద్దిపాటి ఉపశమనం లభిస్తుంది. ఇంటా బయటా కాస్తంత ఒత్తిడి ఉన్నప్పటికీ, ముఖ్యమైన పనులను, వ్యవహారాలను సకాలంలో పూర్తి చేస్తారు.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి జీవితంలో యాక్టివిటీ పెరుగుతుంది. వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు ఆర్జిస్తారు. ఆస్తి వివాదం పరిష్కార దిశగా సాగుతుంది. బంధువులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. అనుకోకుండా పెళ్లి సంబంధం ఖాయం అవు తుంది. ఒకటి రెండు శుభవార్తలు వింటారు. శుభ కార్యాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కుటుంబ జీవితం సంతోషంగా సాగిపోతుంది. అనవసర పరిచయాలకు దూరంగా ఉండండి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఆర్థికంగా ఏ ప్రయత్నం తలపెట్టినా కలిసి వస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో కొద్దిగా ప్రతికూలతలు ఉండే అవకాశం ఉంది. సహోద్యోగులు, సహచరులు ఇబ్బందులకు గురి చేస్తారు. ఇంటా బయటా బాధ్య తలు పెరుగుతాయి. దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయడం మంచిది కాదు. చేప ట్టిన పనులు వేగంగా పూర్తవుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. వ్యాపారాలు పరవా లేదనిపిస్తాయి. సతీమణికి అదృష్టం పడుతుంది. పిల్లల నుంచి ఒకటి రెండు శుభవార్తలు వింటారు.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో కొత్త కార్యక్రమాలు చేపడతారు. వ్యాపారాలు ఆశాజనకంగా ముందుకు సాగు తాయి. తోబుట్టువులతో స్థిరాస్తి వివాదం పరిష్కారం అవుతుంది. కుటుంబ పెద్దల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. బంధుమిత్రులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. ఆకస్మిక ధన లాభ సూచ నలున్నాయి. సతీమణితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ప్రయాణాలు లాభిస్తాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు. పిల్లలు ఆశించిన విధంగా వృద్ధిలోకి వస్తారు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

అన్ని రంగాల వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. అనేక మార్గాలలో ఆదాయం పెరుగు తుంది. ఆర్థిక పరిస్థితి చాలావరకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో అవాంత రాలు తొలగుతాయి. ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగు తుంది. వృత్తి జీవితంలో క్షణం విశ్రాంతి ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఎక్కువ సమయాన్ని ఆధ్యాత్మిక చింతనలో గడుపుతారు. ఎవరినీ గుడ్డిగా నమ్మ వద్దు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. గ్రహబలం బాగా అనుకూలంగా ఉంది. ఉద్యోగులకు కూడా కొత్త ఉద్యోగావకాశాలు అంది వస్తాయి. బంధుమిత్రులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. ముఖ్యమైన పనులు, వ్యవహారాల్లో కార్యసిద్ధి కలుగుతుంది. జీవిత భాగస్వామితో కలిసి విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వృత్తి, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపా రాల్లో శ్రమ తక్కువ, ఫలితం ఎక్కువ అన్నట్టుగా ఉంటుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. ఆర్థిక లావాదేవీలు విజయవంతంగా పూర్తి అవు తాయి. కుటుంబ సమేతంగా శుభకార్యంలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబసమేతంగా ఆలయ సందర్శనాలు చేసుకుంటారు. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. నిరుద్యోగులకు ఆశించిన శుభవార్తలు అందుతాయి. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఆర్థిక విషయాల్లో గ్రహ బలం బాగా అనుకూలంగా ఉంది. సామాజికంగా మీ మాటకు మరింతగా విలువ పెరుగుతుంది. కొందరు బంధువుల నుంచి ఆశించిన శుభవార్తలు అందుతాయి. అను కున్న పనులను అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు అంచనాలకు మించి అనుకూలిస్తాయి. ఉద్యోగాలు ఉత్సాహంగా కొనసాగుతాయి. వృత్తి జీవితంలో క్షణం కూడా తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆర్థిక వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

వృత్తి, ఉద్యోగాలు చాలావరకు సానుకూలంగా సాగిపోతాయి. అధికారులు బాగా ఉపయోగించు కుంటారు. వ్యాపారాల్లో కొత్త వ్యూహాలు సఫలం అవుతాయి. నిరుద్యోగులకు మంచి కంపెనీల నుంచి శుభ వార్తలు అందుతాయి. చిన్ననాటి మిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. కుటుంబ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి. కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. పిల్లలు మంచి ఫలితాలు సాధిస్తారు. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. ప్రయాణాలు వాయిదా పడతాయి.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

వృత్తి, ఉద్యోగాల్లో ప్రత్యేక బాధ్యతలు చేపట్టడానికి అవకాశం ఉంది. అధికారులకు బాగా నమ్మకం పెరుగుతుంది. వ్యాపారాల్లో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. నిరుద్యోగులు సొంత ఊర్లోనే ఉద్యోగం సంపాదించుకునే అవకాశం ఉంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవు తాయి. పిల్లల చదువుల విషయంలో శ్రద్ధ తీసుకుంటారు. బంధు వర్గంలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. దైవ కార్యాల్లోనూ, సహాయ కార్యక్రమాల్లోనూ పాల్గొంటారు. ఆరోగ్యం పరవా లేదు.

(Note: ఇక్కడ అందించిన సమాచారం వారివారి నమ్మకం, విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుంది.  దీన్ని నిర్ధారించేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సమాచారాన్ని అందించాము)

మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి