Astrology: శుక్రుడికి ఇష్టమైన రాశులు.. వారికి లక్ష్మీ కటాక్షం, సుఖ సంతోషాలు!
Venus Favourite Rashi: జ్యోతిషశాస్త్రంలో శుక్ర గ్రహాన్ని లక్ష్మీదేవితో పోలుస్తారు. శుక్రుడికి ఏ రాశులైనా నచ్చితే లక్ష్మీ కటాక్షానికి, సుఖ సంతోషాలకు లోటుండదని జ్యోతిషశాస్త్రం చెబుతోంది. జీవితంలో వృద్ధిలోకి రావాలన్న పక్షంలో కొన్ని రాశులకు శుక్రుడి అనుకూలత తప్పనిసరి. శుక్రుడు తన ఉచ్ఛ క్షేత్రంలో సంచారం చేస్తున్నందువల్ల మరో నాలుగు నెలల పాటు ఈ ఆరు రాశుల వారు విపరీతంగా ప్రయోజనాలు పొందే అవకాశముంది.

Lakshmi Kataksha
Shukra Favourite Rashi: శుక్రుడికి ఏ రాశులైనా నచ్చితే లక్ష్మీ కటాక్షానికి, సుఖ సంతోషాలకు లోటుండదని జ్యోతిషశాస్త్రం చెబుతోంది. శుక్రుడు ఎంత బలంగా ఉన్నా కొన్ని రాశులకు మేలు చేసే అవకాశం ఉండదు. కొద్ది బలంతో తనకు ఇష్టమైన రాశులైన వృషభం, మిథునం, కన్య, తుల, మకర, కుంభ రాశులకు మాత్రం అత్యధికంగా మేలు చేస్తాడు. జ్యోతిషశాస్త్రంలో శుక్ర గ్రహాన్ని లక్ష్మీదేవితో పోలుస్తారు. జీవితంలో వృద్ధిలోకి రావాలన్న పక్షంలో కొన్ని రాశులకు శుక్రుడి అనుకూలత తప్పనిసరి. మరో నాలుగు నెలల పాటు శుక్రుడు తన ఉచ్ఛ క్షేత్రంలో సంచారం చేస్తున్నందువల్ల ఈ ఆరు రాశుల వారు విపరీతంగా ప్రయోజనాలు పొందడం జరుగుతుంది.
- వృషభం: ఈ రాశికి అధిపతి అయిన శుక్రుడు ప్రస్తుతం లాభ స్థానంలో ఉచ్ఛపట్టి ఉన్నందువల్ల ఈ రాశి వారికి సుఖ సంతోషాలతో జీవితం సాగిపోతుంది. ఉన్నత కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురు తుంది. ప్రేమ వ్యవహారాల్లో ఘన విజయాలు సాధిస్తారు. జీవితానికి అవసరమైన సౌకర్యాలన్నీ అమరుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. జీవనశైలి మారిపోతుంది. మనసులోని కోరి కలు నెరవేరుతాయి. ఉద్యోగంలో ఆశించిన ఉన్నత పదవులు లభిస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది.
- మిథునం: రాశినాథుడు బుధుడు శుక్ర గ్రహానికి అత్యంత సన్నిహితమైన మిత్ర గ్రహం అయినందువల్ల, ప్రస్తుతం దశమ స్థానంలో ఉచ్ఛపట్టినందువల్ల ఉద్యోగపరంగా కనివిని ఎరుగని శుభ యోగాలు కలుగుతాయి. ఉద్యోగంలో శీఘ్ర పురోగతి ఉంటుంది. నిరుద్యోగులకు అరుదైన ఆఫర్లు అందు తాయి. సహోద్యోగితో ప్రేమలో పడడం, పెళ్లి నిశ్చయం కావడం వంటివి జరుగుతాయి. ఉద్యోగులు ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో అపార ధన లాభం కలుగుతుంది.
- కన్య: రాశినాథుడు బుధుడికి సన్నిహిత మిత్రుడైన శుక్రుడు ప్రస్తుతం సప్తమ స్థానంలో ఉచ్ఛ స్థితిలో ఉన్నందువల్ల నాలుగు నెలల పాటు ఈ రాశివారికి జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం, పెళ్లి కుదరడం వంటివి జరుగుతాయి. ఉద్యోగంలో ఉన్నత పదవులు వరిస్తాయి. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో ఘన విజయాలు సాధి స్తారు. కొన్ని సమస్యలు, ఒత్తిళ్ల నుంచి విముక్తి లభిస్తుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది.
- తుల: ఈ రాశికి అధిపతి అయిన శుక్రుడు ప్రస్తుతం ఆరవ స్థానంలో ఉచ్ఛపట్టినందువల్ల ఆదాయం ఇబ్బడిముబ్బడిగా వృద్ధి చెంది ఆర్థిక సమస్యల నుంచి పూర్తిగా బయటపడడం జరుగుతుంది. అనారోగ్య సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో పోటీదార్లు, ప్రత్యర్థుల మీద పైచేయి సాధిస్తారు. ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. ఇష్టపడిన వ్యక్తి ప్రేమను సంపాదిం చుకుంటారు. ఏ ప్రయత్నమైనా విజయవంతంగా నెరవేరుతుంది. ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి.
- మకరం: రాశ్యధిపతి శనీశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రుడైన శుక్ర గ్రహం ప్రస్తుతం తృతీయ స్థానంలో ఉచ్ఛ స్థితిలో ఉన్నందువల్ల కొద్ది ప్రయత్నంతో వీరు తమ మనసులోకి కోరికలను, ఆశలను చాలా వరకు నెరవేర్చు కునే అవకాశం ఉంది. ప్రేమ ప్రయత్నాల్లో తప్పకుండా విజయం సాధిస్తారు. ఉన్నత స్థాయి కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఉద్యోగంలో పదోన్నతులకు, వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించిన లాభాలకు అవకాశం ఉంది. నిరుద్యోగుల కల సాకారం అవుతుంది.
- కుంభం: రాశ్యధిపతి శనికి పరమ మిత్రుడైన శుక్రుడు ధన స్థానంలో ఉచ్ఛపట్టడం వల్ల ఆదాయం ఇబ్బడి ముబ్బడిగా వృద్ధి చెందుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు అపార ధన లాభం కలిగిస్తాయి. మాటకు విలువ పెరుగుతుంది. ప్రముఖులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగంలో అంద లాలు ఎక్కడం జరుగుతుంది. ఉన్నత కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం, పెళ్లి నిశ్చ యం కావడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించిన లాభాలు కలుగుతాయి.