Lord Shani: శని దోషంతో ఆ రాశుల వారికి కష్టనష్టాలు..! ఊరట ఎప్పటినుంచంటే..?

Shani Dosha and Jubiter Blessings: ఈ ఏడాదంతా మీన రాశిలో సంచరిస్తున్న శనీశ్వరుడి వల్ల మేషం, సింహం, కన్య, ధనుస్సు, కుంభం, మీన రాశులకు శని దోషం ఉంది. అయితే, ఈ ప్రభావం జూన్ మొదటి వారం వరకు మాత్రమే. జూన్ 3న గురువు కర్కాటక రాశిలో ఉచ్ఛపట్టడం వల్ల ఈ రాశుల శని దోషం పూర్తిగా తొలగిపోతుంది. ఉచ్ఛ గురువు వీక్షణతో విజయాలు, సాఫల్యాలు సిద్ధిస్తాయి. ఆర్థిక వృద్ధి, పదోన్నతులు, మనశ్శాంతి కలుగుతాయి.

Lord Shani: శని దోషంతో ఆ రాశుల వారికి కష్టనష్టాలు..! ఊరట ఎప్పటినుంచంటే..?
Jupiter Blessings

Edited By:

Updated on: Jan 17, 2026 | 4:57 PM

ఈ ఏడాదంతా మీన రాశిలో సంచారం చేస్తున్న శనీశ్వరుడి వల్ల మేషం, సింహం, కన్య, ధనుస్సు, కుంభం, మీన రాశులకు ప్రబలమైన శని దోషం కలుగుతోంది. ఇందులో మేష, కుంభ, మీన రాశులకు ఏలిన్నాటి దోషం, సింహ రాశికి అష్టమ శని దోషం, కన్యా రాశికి సప్తమ శని దోషం, ధనూ రాశికి అర్ధాష్టమ శని దోషం కలుగుతాయి. అయితే, ఈ రాశులవారికి మొదటి ఆరు నెలలు మాత్రమే, అంటే జూన్ వరకు మాత్రమే ఈ శని దోషం కొనసాగే అవకాశం ఉంది. జూన్ 3న గురువు కర్కాటక రాశిలో ప్రవేశించి ఉచ్ఛపట్టిన తర్వాత ఈ శని దోషం పూర్తిగా మటుమాయం అవుతుంది. ఉచ్ఛ గురువు ఈ శనిని పూర్ణ బలంతో వీక్షించడం వల్ల ఈ రాశులకు ఈ ఏడాదంతా శని దోషం ఉండే అవకాశం లేదు. వీరి జీవితాలు విజయాలు, సాఫల్యాలతో సాగిపోతాయి.

  1. మేషం: ఈ రాశికి వ్యయ స్థానంలో ఉన్న శనీశ్వరుడి వల్ల ఏడున్నర ఏళ్ల శని దోషం కలిగింది. దీనివల్ల ఆదాయం కంటే వ్యయం ఎక్కువగా ఉంటుంది. తరచూ అనారోగ్యాలతో ఇబ్బంది పడవలసి వస్తుంది. ఇష్టం లేని దూర ప్రాంతాలకు బదిలీ కావడం జరుగుతుంది. జూన్ నుంచి ఇటువంటి సమస్యలకు అవకాశం ఉండదు. ఈ రాశివారి ఆదాయం పెరగడం, పదోన్నతులు కలగడం, ఆరోగ్యం మెరుగ్గా ఉండడం వంటివి జరుగుతాయి. మనసులోని కోరికలు చాలావరకు నెరవేరుతాయి.
  2. సింహం: ఈ రాశికి అష్టమ స్థానంలో శని సంచారం వల్ల అష్టమ శని దోషం కలిగింది. ఈ ఏడాది మొదటి ఆరు నెలలు వీరికి శ్రమ ఎక్కువ ఫలితం తక్కువగా ఉంటుంది. ఆశించిన స్థాయిలో ఆదాయం వృద్ధి చెందకపోవచ్చు. జీవిత భాగస్వామితో సహా కుటుంబంలో ఎవరో ఒకరిని అనారోగ్యాలు ఇబ్బంది పెడుతుంటాయి. రావలసిన సొమ్ము రాకపోగా, సహాయం పొందినవారు ముఖం చాటే స్తారు. జూన్ తర్వాత నుంచి వీరి జీవితంలో ఆదాయ వృద్ధి, పదోన్నతి వంటివి కలుగుతాయి.
  3. కన్య: ఈ రాశికి సప్తమ స్థానంలో శని ప్రవేశం వల్ల ప్రతి పనిలోనూ, ప్రతి ప్రయత్నంలోనూ ఆటంకాలు ఉండే అవకాశం ఉంది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో చిక్కులు, చికాకులుంటాయి. వ్యక్తిగత, ఆర్థిక సమస్యల ఒత్తిడి ఉంటుంది. జీవిత భాగస్వామి అనారోగ్యాలతో ఇబ్బంది పడడం జరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు, పెళ్లి ప్రయత్నాలు ఒక పట్టాన ముందుకు సాగవు. అయితే, జూన్ తర్వాత జీవితం నల్లేరు మీద బండిలా సాగిపోతుంది. విజయాలు, సాఫల్యాలతో ముందుకు దూసుకుపోతారు.
  4. ధనుస్సు: ఈ రాశికి చతుర్థ స్థానంలో శని సంచారం వల్ల ఈ రాశివారు అర్ధాష్టమ శనితో అవస్థలు పడాల్సి ఉంటుంది. కుటుంబంలో పురోభివృద్ది స్తంభించిపోతుంది. సుఖ సంతోషాలకు, మనశ్శాంతికి లోటు ఏర్పడుతుంది. ఆస్తి వివాదాలు, ఆర్థిక సమస్యలు ఇబ్బంది పెడతాయి. గృహ నిర్మాణ ప్రయత్నా లకు ఆటంకాలు ఏర్పడతాయి. జూన్ మొదటి వారంలో గురువు శనిని వీక్షించిన దగ్గర నుంచి ఈ పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. సుఖ సంతోషాలు, ఆదాయ వృద్ధి, పదోన్నతులు కలుగుతాయి.
  5. ఇవి కూడా చదవండి
  6. కుంభం: ఈ రాశికి ద్వితీయ స్థానంలో శని సంచారం వల్ల ఏలిన్నాటి శని దోషం కలిగింది. దీనివల్ల ఆదాయం వృద్ధి చెందడం ఆగిపోతుంది. ఆర్థిక సమస్యలు పెరుగుతాయి. కుటుంబంలో శుభ కార్యాలు జరగడానికి అవకాశం ఉండదు. ఇంట్లో ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. జూన్ లో ఉచ్ఛ గురువు మీన రాశిలో ఉన్న శనిని వీక్షించిన దగ్గర నుంచి వీరికి ఈ సమస్యలన్నీ క్రమంగా తొలగిపోయి, ఆదాయం వృద్ధి చెందడం, మనసులోని కోరికలు నెరవేరడం జరుగుతుంది.
  7. మీనం: ఈ రాశిలో శని సంచారం వల్ల ఈ రాశివారికి ఏలిన్నాటి శని దోషం కలిగింది. దీనివల్ల ఇంటా బయటా ప్రాధాన్యం తగ్గుతుంది. శ్రమ, తిప్పట, వ్యయ ప్రయాసలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగంలో పదోన్నతులు ఆగిపోతాయి. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు ఇబ్బంది పెడతాయి. జూన్ నెలలో రాశ్యధిపతి గురువు ఉచ్ఛపట్టడం వల్ల ఈ సమస్యలన్నీ తొలగిపోవడంతో పాటు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది.