Shukra Vakri: వక్ర శుక్రుడితో ఆ రాశుల వారికి ఆకస్మిక శుభాలు..! జీవితంలో కొత్త పరిణామాలు
Retrograde Venus in Pisces: జ్యోతిషశాస్త్రం ప్రకారం ఏ గ్రహమైనా, ఏ రాశిలోనైనా వక్రిస్తే దానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. గ్రహం వక్రించిన కారణంగా దానికి బలం పెరుగుతుంది. దీంతో పాటు దాని సహజ లక్షణాల నుంచి అది దూరమయ్యే అవకాశం ఉంటుంది. మార్చి 1 నుంచి ఏప్రిల్ 13 వరకూ మీన రాశిలో శుక్రుడు వక్రించడం జరుగుతోంది. మీన రాశి శుక్రుడికి ఉచ్ఛ రాశి. శుక్రుడు ఉచ్ఛ రాశిలో వక్రించడం వల్ల బంధాలు, అనుబంధాల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. కొన్ని ఆకస్మిక శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.

Shukra Vakri 2025
జ్యోతిషశాస్త్రం ప్రకారం ఏ గ్రహమైనా, ఎక్కడైనా వక్రిస్తే దానికి బలం పెరగడంతో పాటు దాని సహజ లక్షణాల నుంచి అది దూరమయ్యే అవకాశం ఉంటుంది. మార్చి 1 నుంచి ఏప్రిల్ 13 వరకూ మీన రాశిలో శుక్రుడు వక్రించడం జరుగుతోంది. మీన రాశి శుక్రుడికి ఉచ్ఛ రాశి. శుక్రుడు ఉచ్ఛ రాశిలో వక్రించడం వల్ల బంధాలు, అనుబంధాల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. శృంగార, ప్రేమ, వైవాహిక జీవితాలు కొత్త పుంతలు తొక్కుతాయి. కొన్ని ఆకస్మిక శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. శుక్రుడు ప్రతికూలంగా ఉన్న రాశులవారికి ఫలితాల్లో మార్పు ఉండకపోవచ్చు కానీ, అనుకూలంగా ఉన్న వృషభం, మిథునం, కర్కాటకం, కన్య, వృశ్చిక, మీన రాశులవారికి మాత్రం జీవితంలో కొత్త పరిణామాలు చోటు చేసుకుంటాయి.
- వృషభం: లాభ స్థానంలో ఉచ్చ స్థితిలో ఉన్న రాశ్యధిపతి శుక్రుడు వక్రించడం వల్ల చిత్ర విచిత్రమైన మార్గాల్లో ఆదాయాన్ని పెంచుకుంటారు. అనుకోకుండా ఒక సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది. నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు అంది వస్తాయి. ఉద్యోగంలో సీనియర్లను కూడా కాదని పదోన్నతి కలిగించే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. సంప్రదాయ పద్ధతులకు స్వస్తి చెబుతారు. ప్రాధాన్యం బాగా పెరుగుతుంది.
- మిథునం: ఈ రాశికి దశమంలో సంచారం చేస్తున్న ఉచ్ఛ శుక్రుడు వక్తించడం వల్ల ఉద్యోగంలో ఆకస్మిక మార్పులు చేర్పులకు అవకాశం ఉంది. ముఖ్యంగా ఊహించని శుభ పరిణామాలు చోటు చేసు కుంటాయి. నిరుద్యోగులకు దూర ప్రాంతాల్లో తప్ప దగ్గర ప్రాంతాల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉండదు. ఉద్యోగులకు బదిలీల మీద పదోన్నతులు కలుగుతాయి. అనుకోకుండా ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. షేర్లు లాభించే అవకాశం ఉంది.
- కర్కాటకం: ఈ రాశికి భాగ్యస్థానంలో ఉన్న ఉచ్ఛ శుక్రుడు వక్రించడం వల్ల నిరుద్యోగులకు అనుకోకుండా విదే శాల నుంచి ఆఫర్లు అందుతాయి. ఉద్యోగులకు కూడా డిమాండ్ బాగా పెరుగుతుంది. మొత్తం మీద ఉద్యోగ జీవితంలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. పెళ్లి ప్రయత్నాల్లో విదేశీ సంబంధం కుదురుతుంది. ఏ ప్రయత్నమైనా అత్యంత శీఘ్రంగా శుభ ఫలితాలనిస్తుంది. విలువైన వారసత్వపు ఆస్తి సంక్రమిస్తుంది. కొన్ని ముఖ్యమైన వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి.
- కన్య: ఈ రాశికి సప్తమ స్థానంలో ఉచ్ఛ శుక్రుడు వక్రించడం వల్ల అప్రయత్నంగా మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. దాంపత్య జీవితంలో ఎటువంటి మనస్పర్థలున్నా తొలగిపోవడంతో పాటు సఖ్యత, సాన్నిహిత్యం బాగా వృద్ధి చెందుతాయి. జీవితం కొత్త పుంతలు తొక్కుతుంది. అనవసర పరిచ యాలకు, వ్యసనాలకు బాగా అవకాశం ఉంది. ఉద్యోగంలో అందలాలు ఎక్కుతారు. వృత్తి, వ్యాపా రాల్లో ఆకస్మిక శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది.
- వృశ్చికం: ఈ రాశికి పంచమంలో ఉన్న ఉచ్ఛ శుక్రుడు వక్రించినందువల్ల ఆదాయ మార్గాల్లో కొత్త పద్ధతులు అనుసరిస్తారు. సృజనాత్మక శక్తి బాగా పెరుగుతుంది. ఏ పని తలపెట్టినా తప్పకుండా విజయం సాధిస్తారు. ఆస్తి, ఆర్థిక, ఆదాయ సమస్యలు చాలావరకు తొలగిపోతాయి. వ్యక్తిగత సమస్యల నుంచి కూడా చాలావరకు విముక్తి లభిస్తుంది. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. సంతాన యోగా నికి కూడా అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మీ ఆలోచనలు విజయవంతం అవుతాయి.
- మీనం: ఈ రాశిలో ఉచ్ఛపట్టిన శుక్రుడు వక్రించడం వల్ల ఏ ప్రయత్నమైన విజయవంతం అవుతుంది. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఆదాయ వృద్ధికి మరింతగా ప్రయత్నించడం మంచిది. ప్రయాణాల వల్ల బాగా లాభాలు కలుగుతాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో మంచి ఉద్యోగం లభిస్తుంది. ఆశించిన వ్యక్తితో పెళ్లి ఖాయం అవుతుంది. కొన్ని ప్రధానమైన సమస్యలు, ఒత్తిళ్ల నుంచి బయటపడతారు. ఉద్యోగంలో శీఘ్ర పురోగతికి అవకాశం ఉంది.



