శుభ, పాప గ్రహాల ప్రభావం.. వచ్చే ఐదు వారాల పాటు ఆ రాశుల వారికి విచిత్ర యోగాలు..

నవంబర్ 15వ తేదీ వరకు కొన్ని రాశుల వారికి సహజ శుభ గ్రహలు ప్రతికూల ఫలితాలను, సహజ పాప గ్రహాలు అనుకూల ఫలితాలను ఇవ్వడం జరుగుతోంది. గురు, బుధ, శుక్ర, చంద్ర గ్రహాలను సహజ శుభ గ్రహాలని, కుజ, రవి, శని, రాహు, కేతు గ్రహాలను సహజ పాప గ్రహాలని అంటారు.శుభ గ్రహాల వల్ల అనారోగ్య సమస్యలు, కష్టనష్టాలు, ఆదాయ సమస్యలు తలెత్తవచ్చు. పాప గ్రహాల వల్ల మాత్రం అంచనాలకు మించిన ఆదాయ వృద్ధి ఉంటుంది.

శుభ, పాప గ్రహాల ప్రభావం.. వచ్చే ఐదు వారాల పాటు ఆ రాశుల వారికి విచిత్ర యోగాలు..
Telugu Astrology
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: Sep 26, 2024 | 4:33 PM

నవంబర్ 15వ తేదీ వరకు కొన్ని రాశుల వారికి సహజ శుభ గ్రహలు ప్రతికూల ఫలితాలను, సహజ పాప గ్రహాలు అనుకూల ఫలితాలను ఇవ్వడం జరుగుతోంది. గురు, బుధ, శుక్ర, చంద్ర గ్రహాలను సహజ శుభ గ్రహాలని, కుజ, రవి, శని, రాహు, కేతు గ్రహాలను సహజ పాప గ్రహాలని అంటారు. మిథునం, సింహం, కన్య, తుల, ధనుస్సు, కుంభ రాశులకు పాప గ్రహాలు శుభ ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది. శుభ గ్రహాల వల్ల అనారోగ్య సమస్యలు, కష్టనష్టాలు, ఆదాయ సమస్యలు తలెత్తవచ్చు. పాప గ్రహాల వల్ల మాత్రం అంచనాలకు మించిన ఆదాయ వృద్ధి ఉంటుంది. అధికారం చేపట్టడం, విదేశీ అవకాశాలు ఏర్పడడం వంటివి జరిగే అవకాశం ఉంది.

  1. మిథునం: ఈ రాశిలో కుజుడు, దశమ స్థానంలో రాహువు, చతుర్థ స్థానంలో రవి, కేతువులు, భాగ్య స్థానంలో శనీశ్వరుడి సంచారం వల్ల వీరు ఈజీ మార్గాల్లో డబ్బు సంపాదించే అవకాశం ఉంటుంది. ఇతర దేశాల్లో ఉద్యోగం సంపాదించడం జరుగుతుంది. ఆస్తిపాస్తులను పెంపొందించుకుంటారు. తల్లి తండ్రుల నుంచి ఆస్తి లభించే అవకాశం ఉంది. గృహ, వాహనాలను సమకూర్చుకుంటారు. ఆలయాలకు వెళ్లడం, ఇతరులకు సహాయం చేయడం, సేవల్లో పాల్గొనడం వంటివి తగ్గిపోతాయి.
  2. సింహం: ఈ రాశికి ధన స్థానంలో రవి, కేతువులు, అష్టమ స్థానంలో రాహువు, సప్తమ స్థానంలో శని, లాభ స్థానంలో కుజ సంచారం వల్ల అనేక మార్గాల్లో ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. జీవిత భాగస్వామి వైపు నుంచి ఆస్తి కలిసి వస్తుంది. భూలాభం కలిగే అవకాశం ఉంది. ఆస్తి వివాదాల్లో, కోర్టు కేసుల్లో విజయాలు సాధిస్తారు. ఉద్యోగంలో సహోద్యోగులతో పోటీపడి విజయం సాధిస్తారు. ఆదాయ వృద్ధి మీద శ్రద్ధ పెరుగుతుంది. శుభకార్యాలు, తీర్థయాత్రలు వాయిదా పడతాయి.
  3. కన్య: ఈ రాశిలో రవి, కేతువులు, ఆరవ స్థానంలో శని, దశమ స్థానంలో కుజుడు, సప్తమ స్థానంలో రాహువు విశేషంగా శుభ ఫలితాలనిస్తాయి. ఉద్యోగంలో అందలాలు ఎక్కుతారు. వృత్తి, వ్యాపా రాల్లో అనేక విధాలుగా లాభాలను, రాబడిని పెంచుకుంటారు. ఉద్యోగంలో కూడా అదనపు ఆదా యానికి అవకాశం ఉంది. విదేశీయానానికి, విదేశాల్లో ఉద్యోగాలకు అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు నిరుత్సాహం కలిగిస్తాయి. సహాయాలను, దానధర్మాలను బాగా తగ్గించుకుంటారు.
  4. తుల: ఈ రాశికి వ్యయస్థానంలో రవి, కేతువులు, పంచమంలో శని, ఆరులో రాహువు, భాగ్య స్థానంలో కుజ సంచారం వల్ల విదేశాల్లో ఉద్యోగం సంపాదించడానికి చేస్తున్న ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఉద్యోగంలో హోదా పెరగడానికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు సంపా దించడానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తారు. రావలసిన డబ్బును, మొండి బాకీలను గట్టి పట్టుదలతో రాబట్టుకుంటారు. ఆధ్యాత్మిక విషయాల కంటే ఆర్థిక విషయాల మీద శ్రద్ధ బాగా పెరుగుతుంది.
  5. ధనుస్సు: ఈ రాశికి తృతీయంలో శని, చతుర్థంలో రాహువు, సప్తమంలో కుజుడు, దశమంలో రవి, కేతు వుల సంచారం వల్ల ఆదాయ వృద్ధికి బాగా కృషి చేస్తారు. ఉద్యోగాల్లో సహచరులను మించి పోయి, పదోన్నతులు అందుకుంటారు. వృత్తి, వ్యాపారాలను అభివృద్ధి బాటపట్టిస్తారు. ఆస్తి వివాదాల్లో రాజీ మార్గం అనుసరించి విలువైన ఆస్తి సంపాదిస్తారు. షేర్లు, వ్యాపారాల్లో పెట్టుబడులు పెడతారు. ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకుంటారు. పెళ్లి ప్రయత్నాలు, శుభ కార్యాల మీద ఆసక్తి తగ్గుతుంది.
  6. కుంభం: ఈ రాశిలో శని, ధన స్థానంలో రాహువు, పంచమంలో కుజుడు, అష్టమంలో రవి, కేతువుల సంచా రం వల్ల ధన వ్యామోహం బాగా పెరుగుతుంది. ఆదాయాన్ని పెంచుకోవడం మీద ఎక్కువగా శ్రద్ధ చూపిస్తారు. అనేక మార్గాల్లో ఆదాయం పెరగడానికి అవకాశం ఉంది. ఆదాయ వృద్ధికి ఎంతటి కష్టా న్నయినా ఓర్చుకుంటారు. ఉద్యోగంలో పదోన్నతులతో పాటు జీతభత్యాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో పట్టుదలగా లాభాలను ఆర్జిస్తారు. ఉచిత సహాయాలకు, దాన ధర్మాలకు దూరంగా ఉంటారు.