AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కుంభరాశిలో పాపకర్తరి యోగం.. ఈ రాశులవారికి అలర్ట్..! దోష నివారణ ఇలా

Papa Kartari Yoga: కర్తరి యోగాలు రెండు రకాలుగా ఉంటాయి. వాటిలో ఒకటి పాపకర్తరి యోగం.. ఇది పాపగ్రహాలు చుట్టూ ఉంటుంది. దీంతో ఆయా రాశులవారికి కష్టాలు కలుగుతాయి. రెండోది శుభకర్తరి యోగం.. శుభగ్రహాలు (గురు, శుక్రుడు, బుధుడు, చంద్రుడు) చుట్టూ ఉంటుంది. దీంతో మంచి ఫలితాలు ఏర్పడతాయి. కుంభరాశిలో పాపకర్తరి యోగం వలన ప్రభామయ్యే రాశుల గురించి తెలుసుకుందాం.

కుంభరాశిలో పాపకర్తరి యోగం.. ఈ రాశులవారికి అలర్ట్..! దోష నివారణ ఇలా
Papa Kartari Yoga In Aquarius
Rajashekher G
|

Updated on: Feb 03, 2026 | 1:36 PM

Share

జ్యోతిష శాస్త్రంలో పాపకర్తరి యోగం (Paapa Kartari Yoga) ఒక ముఖ్యమైన దోషయోగం. కర్తరి అంటే కత్తెర. అంటే ఒక గ్రహం లేదా లగ్నం రెండు వైపులా పాపగ్రహాల చేత “కత్తిరించబడినట్లు” ఉండటం. ఒక రాశి లేదా భావానికి ముందు–వెనుక గ్రహాలు (శని, మంగళ, రాహు, కేతు, సూర్యుడు) ఉండి ఆ రాశిని ఒత్తిడిలో పెట్టినప్పుడు ఏర్పడే యోగాన్ని పాపకర్తరి యోగం అంటారు. ఇది జీవితం మీద మానసిక, ఆర్థిక, ఆరోగ్య పరమైన ఒత్తిడిని కలిగిస్తుంది. కర్తరి యోగాలు రెండు రకాలుగా ఉంటాయి. వాటిలో ఒకటి పాపకర్తరి యోగం.. ఇది పాపగ్రహాలు చుట్టూ ఉంటుంది. దీంతో ఆయా రాశులవారికి కష్టాలు కలుగుతాయి. రెండోది శుభకర్తరి యోగం.. శుభగ్రహాలు (గురు, శుక్రుడు, బుధుడు, చంద్రుడు) చుట్టూ ఉంటుంది. దీంతో మంచి ఫలితాలు ఏర్పడతాయి.

కుంభరాశిలో పాపకర్తరి యోగం వలన ఇప్పుడు కుంభరాశి స్వభావాన్ని గురించి కూడా తెలుసుకుందాం. కుంభరాశి స్వభావం కుంభం శని అధిపత్య రాశి. దీని లక్షణాలుగా సామాజిక చింతన, కొత్త ఆలోచనలు, స్వాతంత్ర్య భావం, మానవత్వం, నెట్‌వర్కింగ్, టెక్నాలజీ, సంస్కరణలు ఉన్నాయి. ఈ రాశి పాపకర్తరి యోగంలో పడితే ఈ లక్షణాలన్నీ అడ్డంకులకు గురవుతాయి.

కుంభరాశిలో పాపకర్తరి ఏర్పడే విధానం

కుంభరాశికి.. మకర రాశిలో ఒక పాపగ్రహం, మీన రాశిలో మరో పాపగ్రహం, ఉన్నట్లయితే.. కుంభరాశి పాపకర్తరి యోగంలో పడుతుంది. మకరంలో శని + మీనంలో రాహు, మకరంలో మంగళుడు + మీనంలో శుక్రుడు (పాపగ్రహంతో కలిసి), మకరంలో సూర్యుడు + మీనంలో కేతు కలవడం వల్ల పాపకర్తరి ఏర్పడుతుంది.

ఏ రాశులపై ప్రభావం ఉంటుంది?

కుంభరాశి (లగ్నం / చంద్రరాశి)పై ప్రభావం అత్యధికంగా ఉంటుంది. ఫలితంగా.. మానసిక ఒత్తిడి, నిర్ణయాలలో గందరగోళం, స్నేహితులతో విభేదాలు, కెరీర్‌లో ఆలస్యం, ఒంటరితనం భావనలు కలుగుతాయి.

సింహరాశి

కుంభానికి 7వ రాశి కావడం వల్ల వివాహ జీవితంపై ప్రభావం, భాగస్వామ్య వ్యాపారాల్లో నష్టాలు, అహంకార సమస్యలు ఉత్పన్నమవుతాయి. దీంతో ఈ రాశి వారు కొన్ని ఇబ్బందులు ఎదుర్కుంటారు.

వృషభ రాశి

కుంభానికి 4వ రాశి వృషభ రాశి. పాపకర్తరి వల్ల గృహసుఖంలో లోపం, స్థిరాస్తి సమస్యలు, తల్లి ఆరోగ్యం పట్ల ఆందోళన లాంటి సమస్యలు ఎదుర్కుంటారు.

వృశ్చిక రాశి

కుంభానికి 10వ రాశి వృశ్చికం. పాపకర్తరి వల్ల ఉద్యోగంలో ఒత్తిడి, అధికారులతో విభేదాలు, పేరు–ప్రతిష్ఠ తగ్గే పరిస్థితులు నెలకొంటాయి.

మేష రాశి

కుంభానికి 3వ రాశి మేషం. పాపకర్తరి యోగం వల్ల ధైర్యం తగ్గడం, చిన్న ప్రయత్నాల్లో అడ్డంకులు, సోదరులతో విభేదాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. అయితే, గ్రహాల బలం ఆధారంగా ఫలితాల తీవ్రతలో తేడాలుండే అవకాశం ఉంది.

పాపకర్తరి ఉన్నా కూడా.. గురు దృష్టి, శుభగ్రహ యోగాలు, లగ్న బలం ఉంటే.. ప్రతికూల ప్రభావం తగ్గుతుంది. లేదంటే తీవ్రత పెరుగుతుంది.

పాపకర్తరి జ్యోతిష్య పరిహారాలు

శనివారం శని దేవుని ఆరాధన “ఓం శం శనైశ్చరాయ నమః” జపం నల్ల నువ్వులు, నూనె దానం వృద్ధులు, పేదలకు సహాయం నీలం రంగు నియంత్రణతో వాడకం

కుంభరాశిలో పాపకర్తరి యోగం జీవితాన్ని పూర్తిగా నాశనం చేయదు, కానీ సహనం, క్రమశిక్షణ, ధర్మాచరణ లేకపోతే సమస్యలు పెరుగుతాయి. సరైన దశా–భుక్తి, గ్రహ బలం పరిశీలిస్తే, ఈ యోగం కూడా ఆత్మపరిశీలనకు, ఎదుగుదలకు మార్గం అవుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.

(Declaimer: ఈ వార్తలోని సమాచారం జ్యోతిష్య శాస్త్రం, మత సంబంధిత అంశాలపై ఆధారపడి ఉంది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.)