AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కొత్త ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ రూల్స్‌..! రూ.50 వేలు దాటితే TDS కటింగ్‌?

వడ్డీ ఆదాయంపై టీడీఎస్ మినహాయింపులకు సంబంధించి ఆదాయపు పన్ను శాఖ కీలక స్పష్టతనిచ్చింది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ పరిధిలోని బ్యాంకులు నిర్దేశిత పరిమితికి మించిన వడ్డీపై టీడీఎస్ తప్పనిసరిగా తీయాలని పేర్కొంది. సాధారణ పౌరులకు రూ.50,000, సీనియర్ సిటిజన్లకు రూ.1 లక్ష వరకు వడ్డీ ఆదాయంపై టీడీఎస్ అవసరం లేదు.

కొత్త ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ రూల్స్‌..! రూ.50 వేలు దాటితే TDS కటింగ్‌?
ప్రభుత్వం చివరిసారిగా 2023-24 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో కొన్ని పథకాల వడ్డీ రేట్లను సవరించిన తర్వాత, గత రెండు సంవత్సరాలుగా ఎలాంటి మార్పులు చేయలేదు. ప్రస్తుత నిర్ణయం ద్వారా ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోవడమే కాకుండా, పెట్టుబడిదారులకు ముందస్తు అంచనాలు సులభతరం చేయాలనే ఉద్దేశం స్పష్టంగా కనిపిస్తోంది. అయితే పెరుగుతున్న ద్రవ్యోల్బణం నేపథ్యంలో రేట్లలో మార్పులు లేకపోవడం కొంతమంది పెట్టుబడిదారులను నిరాశపరచే అవకాశం కూడా ఉంది.
SN Pasha
|

Updated on: Mar 31, 2026 | 7:30 AM

Share

వడ్డీ ఆదాయంపై పన్ను మినహాయింపుల విషయంలో ఆదాయపు పన్ను శాఖ కీలక స్పష్టతను ఇచ్చింది. బ్యాంకింగ్‌ రెగ్యులేషన్‌ యాక్ట్‌ 1949 పరిధిలోకి వచ్చే బ్యాంకింగ్ కంపెనీలు నిర్దేశిత పరిమితిని మించిన వడ్డీ ఆదాయంపై తప్పనిసరిగా టీడీఎస్ (TDS) మినహాయించాల్సి ఉంటుందని తెలిపింది. ఈ మేరకు తాజా మార్గదర్శకాలను సోషల్ మీడియా వేదిక ద్వారా విడుదల చేసింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం.. ఒక ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు లేదా పోస్టాఫీస్ డిపాజిట్ల ద్వారా పొందే వడ్డీ ఆదాయం సాధారణ పౌరులకు రూ.50,000ను, సీనియర్ సిటిజన్లకు రూ.1 లక్షను మించినప్పుడు మాత్రమే TDS అమల్లోకి వస్తుంది.

ఈ పరిమితికి లోబడే మొత్తాలపై పన్ను మినహాయింపు అవసరం లేదు. కొత్తగా ప్రవేశపెట్టిన ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ యాక్ట్‌ 2025 లోని సెక్షన్ 402 ప్రకారం బ్యాంకింగ్ కంపెనీ నిర్వచనాన్ని మరింత స్పష్టంగా పేర్కొన్నారు. ఈ నిర్వచనం ప్రకారం.. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ వర్తించే కంపెనీలతో పాటు, ఆ చట్టంలోని సెక్షన్ 51 కింద పేర్కొన్న బ్యాంకులు, బ్యాంకింగ్ సంస్థలు కూడా ఈ పరిధిలోకి వస్తాయి. అంటే ప్రత్యేకంగా పేర్కొనకపోయినా, ఈ సంస్థలు కూడా TDS నిబంధనలను అనుసరించాల్సిందేనని శాఖ స్పష్టం చేసింది.

అయితే సెక్షన్‌ 393(1) కింద నిర్దేశించిన పరిమితికి లోబడే వడ్డీ ఆదాయంపై బ్యాంకులు లేదా సంబంధిత సంస్థలు TDS మినహాయించాల్సిన అవసరం లేదని కూడా క్లారిటీ ఇచ్చింది. దీంతో చిన్న మొత్తాల డిపాజిటర్లకు ఉపశమనం లభించనుంది. ఈ మార్గదర్శకాలు బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలు, డిపాజిటర్లకు స్పష్టతనిస్తూ, పన్ను అమలు ప్రక్రియను సులభతరం చేసే దిశగా ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా వడ్డీ ఆదాయంపై పన్ను లెక్కింపులో ఏర్పడే సందేహాలను తొలగించడంలో ఇవి సహాయపడనున్నాయి.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us