AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టమాటా, ఆలుగడ్డ ఆ దేశానియా.. మన ప్లేట్‌లోకి ఎలా వచ్చాయో తెలిస్తే అవాక్కవుతారు..

భారతీయ వంటగదిలో టమాటా లేని కూర ఉండదు.. ఆలుగడ్డ పక్కా ఉండాల్సిందే..అసలు మిరపకాయ లేని వంటకాన్ని ఊహించుకోలేం. ఇవన్నీ మన దేశానివే అని మనం గర్వంగా చెప్పుకుంటాం. కానీ అసలు నిజం తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.. మనం ప్రాణప్రదంగా భావించే ఈ కూరగాయలన్నీ పోర్చుగీస్, డచ్, బ్రిటిష్ వ్యాపారుల పుణ్యమా అని వేల మైళ్ల దూరం నుంచి సముద్ర మార్గంలో మన దేశానికి చేరాయి.

Krishna S
|

Updated on: Mar 30, 2026 | 9:05 PM

Share
బంగాళాదుంప: భారతదేశం బంగాళాదుంపల ఉత్పత్తిలో ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉంది. కానీ దీని పుట్టినిల్లు దక్షిణ అమెరికాలోని పెరూ. 17వ శతాబ్దంలో పోర్చుగీసు వ్యాపారులు దీనిని మన దేశానికి పరిచయం చేశారు. ఆ తర్వాత 1797లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ దీని సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహించింది. మద్రాసుకు చెందిన డాక్టర్ బెంజమిన్ స్వయంగా దీనిని పండించి భారతీయులకు రుచి చూపించారు.

1 / 6
టమాటా: టమోటా లేకుండా భారతీయ మహిళ వంట పూర్తి చేయలేదు. కానీ ఇవి సుమారు 2500 ఏళ్ల క్రితం మెక్సికోలోని నహువా సమాజం పండించిన పంట. యూరప్ మీదుగా ఇటలీకి చేరినప్పుడు దీనిని బంగారు ఆపిల్ అని పిలిచేవారు. పోర్చుగీసు వారి ద్వారా ఇది మన దేశానికి వచ్చి, ఇప్పుడు మనం టమాటా ఉత్పత్తిలో ప్రపంచంలోనే రెండో స్థానంలో నిలిచాం.

2 / 6
మిరపకాయ: మనం వాడే ఘాటు మిరపకాయలు వాస్తవానికి మెక్సికోకు చెందినవి. 1492లో క్రిస్టోఫర్ కొలంబస్ అమెరికాను కనుగొన్నప్పుడు దీనిని గుర్తించారు. పోర్చుగీసు వారు 1500 ప్రాంతంలో గోవాకు దీనిని తీసుకువచ్చారు. అప్పటి వరకు భారతీయులు కారం కోసం కేవలం మిరియాలను మాత్రమే వాడేవారు. ఇప్పుడు మిరప సాగులో భారత్ ప్రపంచంలోనే నంబర్ 1.

3 / 6
క్యాప్సికమ్: దీని మూలాలు కూడా మెక్సికో, ఉత్తర అమెరికాలోనే ఉన్నాయి. దీనిని పోర్చుగీసు వారు భారత్‌కు తీసుకువచ్చినప్పుడు తొలుత సిమ్లా, డార్జిలింగ్, నీలగిరి వంటి చల్లని ప్రదేశాల్లో పండించారు. అందుకే దీనిని ఇప్పటికీ మనం సిమ్లా మిర్చి అని పిలుచుకుంటాం.

4 / 6
క్యాలీఫ్లవర్: క్యాలీఫ్లవర్ అసలు భారతీయులది కాదు. దీని మూలాలు సైప్రస్ ద్వీపం, మధ్యధరా ప్రాంతంలో ఉన్నాయి. 19వ శతాబ్దంలో బ్రిటిష్ వారు దీనిని భారత్‌కు తెచ్చారు. యూపీలోని సహారన్‌పూర్‌లో బ్రిటిష్ వృక్షశాస్త్రజ్ఞుడు డాక్టర్ జేమ్సన్ దీనిని మొదటిసారిగా సాగు చేశారు. నేడు మనం ప్రపంచంలోనే క్యాలీఫ్లవర్ ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్నాం.

5 / 6
మొక్కజొన్న: మెక్సికోలో పుట్టిన మొక్కజొన్నను కొలంబస్ యూరప్‌కు తీసుకెళ్లగా, అక్కడి నుంచి పోర్చుగీసు వారు ఆసియాకు తెచ్చారు. గుజరాత్, పంజాబ్ ప్రాంతాల్లో మొదలైన దీని సాగు ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరించింది. మొక్కజొన్న ఉత్పత్తిలో భారత్ ఇప్పుడు ప్రపంచంలో ఐదో స్థానంలో ఉంది.

6 / 6
Follow Us