Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ తేదీల్లో పుట్టినవారి భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసా..? ఇప్పుడే తెలుసుకోండి..!

సంఖ్యాశాస్త్రం ప్రకారం మన జన్మతేది ఆధారంగా ఒక ప్రత్యేకమైన మూలసంఖ్య ఉంటుంది. ఇది వ్యక్తిత్వాన్ని, ఆలోచనా విధానాన్ని ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా మూలసంఖ్య 8 గలవారు ఏకాంతాన్ని ఇష్టపడుతారు. వివాహంలో ఆలస్యం అయ్యే అవకాశముంది. అయితే కొన్ని సంఖ్యల గల వ్యక్తుల‌తో వీరి అనుబంధం బలంగా ఉంటుంది. ఇప్పుడు అనుకూలమైన సంఖ్యల గురించి తెలుసుకుందాం.

ఈ తేదీల్లో పుట్టినవారి భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసా..? ఇప్పుడే తెలుసుకోండి..!
Numerology Secrets
Follow us
Prashanthi V

|

Updated on: Apr 02, 2025 | 12:46 PM

సంఖ్యాశాస్త్రం ప్రకారం ప్రతి వ్యక్తి జన్మ తేదీ ఆధారంగా ప్రత్యేక మూలసంఖ్య కలిగి ఉంటాడు. ఈ సంఖ్య వారి లక్షణాలను, ఆలోచనా విధానాన్ని ప్రభావితం చేస్తుంది. 8, 17, 26 తేదీలలో జన్మించిన వారికి మూలసంఖ్య 8 వస్తుంది. వీరు గంభీర స్వభావం కలిగి ఉంటారు. ఎక్కువగా ఏకాంతాన్ని ఇష్టపడుతారు. వివాహం ఆలస్యంగా జరగవచ్చు. ప్రేమ సంబంధాలు ఎక్కువ కాలం నిలవడం కష్టంగా ఉంటుంది. అయితే కొన్ని నిర్దిష్ట సంఖ్యల వ్యక్తులతో వీరి సంబంధం బలంగా ఉంటుంది.

మూలసంఖ్య 3

3, 12, 21, 30 తేదీలలో జన్మించినవారు మూలసంఖ్య 3కు చెందుతారు. వీరు సాధారణంగా తక్కువ మందితో మాత్రమే స్నేహం చేస్తారు. కానీ మూలసంఖ్య 8 ఉన్న వ్యక్తులతో వీరి అనుబంధం బలంగా ఉంటుంది. జీవితం ఆనందంగా, సమతుల్యంగా సాగుతుంది. ఒకరి భావాలను మరొకరు సులభంగా అర్థం చేసుకుంటారు. పరస్పర గౌరవం, నమ్మకం వీరి బంధాన్ని మరింత బలంగా మార్చుతుంది.

మూలసంఖ్య 4

4, 13, 22, 31 తేదీలలో జన్మించినవారు మూలసంఖ్య 4కు చెందుతారు. వీరు చాలా స్నేహశీలియైనవారు. కొత్త వ్యక్తులతో సులభంగా కలిసిపోతారు. మూలసంఖ్య 8 ఉన్న వ్యక్తులతో వీరి వివాహ జీవితం సంతోషకరంగా ఉంటుంది. వీరి మధ్య గొడవలు తక్కువగా ఉంటాయి. ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవిస్తారు. కుటుంబ జీవితం ప్రశాంతంగా ఉంటుంది.

మూలసంఖ్య 5

5, 14, 23 తేదీలలో జన్మించినవారు మూలసంఖ్య 5కు చెందుతారు. వీరు కాలానికి అనుగుణంగా మారే స్వభావం కలిగి ఉంటారు. కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. మూలసంఖ్య 8 ఉన్నవారి లక్షణాలు వీరికి ఆకర్షణీయంగా అనిపిస్తాయి. ఈ రెండు సంఖ్యల వ్యక్తుల మధ్య మంచి సమతుల్యత ఉంటుంది. ఒకరినొకరు గౌరవిస్తారు. పరస్పరం శ్రద్ధ తీసుకుంటారు.

మూలసంఖ్య 8

మూలసంఖ్య 8 ఉన్నవారు తమ సొంత సంఖ్యతో బాగా కలిసిపోతారు. వీరి స్వభావం ఒకేలా ఉండడం వల్ల పరస్పరం అర్థం చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సమానమైన ఆలోచనా విధానం వీరి మధ్య లోతైన అనుబంధాన్ని కలిగిస్తుంది. అయితే రెండింటిలో ఎవరైనా కోపం, అసహనం ఎక్కువగా పెంచుకుంటే.. సంబంధంలో కొన్ని సమస్యలు తలెత్తే అవకాశముంది. కానీ సహనం పాటిస్తే జీవితం సాఫీగా సాగుతుంది. సంఖ్యాశాస్త్రం ప్రకారం మన జీవిత భాగస్వామి సంఖ్య మన జీవనశైలిని ప్రభావితం చేస్తుంది. అనుకూలమైన సంఖ్యలతో అనుబంధం కలిగి ఉంటే జీవితం మరింత ఆనందంగా కొనసాగుతుంది.