Money Astrology: ధనూ రాశిలో కుజ, రవి, బుధ గ్రహాలు.. వారి అత్యధిక ధన, అధికార కాంక్ష నెరవేరుతుంది!
జ్యోతిష శాస్త్రం ప్రకారం ధనూ రాశి లేదా ధనుర్లగ్నం వారికి యాంబిషన్ ఎక్కువగా ఉంటుంది. ధన కాంక్ష, అధికార కాంక్ష వీరిలో అత్యధికంగా వ్యక్తమవుతుంటుంది. ధనూ రాశిలో ఏ గ్రహ మున్నా, ఎన్ని గ్రహాలున్నా అవి ముందుగా ధన కాంక్షను పెంచుతాయి. బాగా డబ్బాశను కలిగిస్తాయి. ప్రస్తుతం ధనూ రాశిలో కుజ, రవి, బుధులు కలిసి ఉన్నాయి.
జ్యోతిష శాస్త్రం ప్రకారం ధనూ రాశి లేదా ధనుర్లగ్నం వారికి యాంబిషన్ ఎక్కువగా ఉంటుంది. ధన కాంక్ష, అధికార కాంక్ష వీరిలో అత్యధికంగా వ్యక్తమవుతుంటుంది. ధనూ రాశిలో ఏ గ్రహ మున్నా, ఎన్ని గ్రహాలున్నా అవి ముందుగా ధన కాంక్షను పెంచుతాయి. బాగా డబ్బాశను కలిగిస్తాయి. ప్రస్తుతం ధనూ రాశిలో కుజ, రవి, బుధులు కలిసి ఉన్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ చివరి వరకు ఏదో ఒక గ్రహం ఈ రాశిలో కొనసాగే అవకాశం ఉంటుంది. ఫలితంగా, ఏడు రాశుల వారిలో ధన సంపాదన మీద ఆశపెరగడం, అందుకు తగ్గట్టుగా గట్టి ప్రయత్నాలు సాగించడం, చివరికి వీరు విజయం సాధించడం జరుగుతుంది. ఆ రాశులుః మేషం, మిథునం, సింహం, కన్య, వృశ్చికం, కుంభం, మీనం.
- మేషం: ఒక మూడు నెలల పాటు ఈ రాశివారిలో డబ్బాశ అతి ఎక్కువగా ఉండే సూచనలు కనిపిస్తు న్నాయి. ధన కారకుడైన గురువు ఇదే రాశిలో సంచారం చేస్తూ, ధనూ రాశిని, అందులోని గ్రహా లను వీక్షించడం వల్ల వీరు ఆదాయం పెంచుకోవడానికి వీలైనన్ని ప్రయత్నాలు సాగించే అవకాశం ఉంటుంది. వీరి ప్రయత్నాలకు తగ్గట్టుగా వీరికి ఆదాయ మార్గాలు పెరుగుతాయి. తప్పకుండా రాబడి పెరుగుతుంది. ఆర్థికంగా ఎటువంటి ప్రయత్నం చేపట్టినా తప్పకుండా విజయం సాధిస్తారు.
- మిథునం: ఈ రాశికి లాభ స్థానంలో గురువు ఉండడం, సప్తమ స్థానమైన ధనూ రాశిని పూర్ణ దృష్టితో వీక్షించడం, అందులో మూడు గ్రహాలు సంచారం చేస్తుండడం వల్ల వీరిలో డబ్బాశ విపరీతంగా పెరుగుతుంది. అనేక విధాలుగా ఆదాయం కోసం ప్రయత్నించే అవకాశం ఉంది. అక్రమ మార్గాలకు కూడా వెనుకాడకపోవచ్చు. మొత్తం మీద వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో లావాదేవీలు పెరగడం, కార్య కలాపాలు విస్తృతం కావడం వంటివి జరుగుతాయి. తప్పకుండా వీరి ప్రయత్నాలు ఫలిస్తాయి.
- సింహం: ధనూ రాశిలో రాశ్యధిపతి రవితో సహా మూడు గ్రహాల సంచారం వీరిలో ధనార్జన పట్ల ఆకాంక్ష లను బాగా పెంచుతుంది. అదనపు సంపాదన కోసం ప్రయత్నాలుసాగించడంతో పాటు, ఖర్చు లను తగ్గించుకోవడం, పొదుపు చర్యలను పాటించడం వంటివి కూడా జరుగుతాయి. ఐశ్వర్యవం తుడిని అనిపించుకోవాలనే ఏకైక లక్ష్యంతో ఈ రాశివారు ఆదాయ మార్గాలను విస్తరించుకునే ప్రయత్నం చేస్తారు. రావలసిన డబ్బు కోసం, బకాయిల కోసం గట్టి ప్రయత్నాలు చేసి చివరికి సాధిస్తారు.
- కన్య: ఈ రాశికి నాలుగవ స్థానమైన ధనూ రాశిలో మూడు గ్రహాలు కలవడం, దాన్ని గురువు వీక్షిం చడం వల్ల ఈ రాశివారికి ఆస్తిపాస్తుల మీద విపరీతమైన మోజు పెరుగుతుంది. గృహ, వాహన సౌకర్యాల మీద దృష్టి కేంద్రీకరిస్తారు. తమకు దక్కాల్సిన ఆస్తి మీద వీరి దృష్టి పడుతుంది. వీటిని సాధించుకోవడానికి అహర్నిశలూ కష్టపడడం జరుగుతుంది. ఏదో విధంగా డబ్బు సంపాదించ డానికి కూడా ప్రయత్నాలు సాగిస్తారు. వీరికి సంపద పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
- వృశ్చికం: ఈ రాశివారికి ధన స్థానమైన ధనూ రాశిలో మూడు గ్రహాల కలయిక జరుగుతున్నందువల్ల స్వల్ప ప్రయత్నంతో వీరికి సంపాదన పెరిగే అవకాశం ఉంది. మే లోపు వీరు తప్పకుండా ధన వంతులు కావడం, వీరి ఆర్థిక స్వప్నాలు సాకారం కావడం జరుగుతుంది. వీరికి సంబంధించిన ఆస్తిపాస్తులు వివాదం నుంచి బయటపడతాయి. అయితే, కొద్దిగా అక్రమ సంపాదనకు కూడా అవ కాశం ఉంది. మొత్తం మీద వీరి ఆర్థిక ప్రయత్నాలు సఫలం అయి, వీరి సంపద పెరగడం జరుగుతుంది.
- కుంభం: ఈ రాశికి లాభస్థానమైన ధనూ రాశిలో గ్రహ సంచారం ఎక్కువగా ఉండడమనేది ఈ రాశివారికి డబ్బుపరంగా ఎంతో అదృష్టం తెచ్చిపెడుతుంది. వీరి ప్రయత్నంతో అదనపు ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఇతరులకు సహాయం చేసే స్థితికి ఈ రాశివారు చేరుకుంటారు. అదనపు ఆదా యానికి వీరు ఎంత ప్రయత్నం చేస్తే అంతగా ఆదాయం సమకూరుతుంది. కొద్ది ప్రయత్నంతో ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. ఆస్తిపాస్తుల విలువ బాగా పెరిగే సూచనలున్నాయి.
- మీనం: ఈ రాశివారికి ఉద్యోగ స్థానంలో గ్రహ సంచారం ఎక్కువగా ఉన్నందువల్ల వృత్తి, వ్యాపారాల్లో కార్య కలాపాలు, లావాదేవీలను విస్తృతం చేయడం ద్వారా వీరి సంపాదన పెరిగే అవకాశం ఉంది. ఉద్యో గంలో కూడా జీతభత్యాలు పెరగడం జరుగుతుంది. అదనపు ఆదాయ మార్గాలు ఏర్పడ డంతో పాటు, రావలసిన డబ్బు కోసం, బాకీలు వసూలు కోసం ప్రయత్నించడం కూడా జరుగు తుంది. ఆర్థికంగా చేసే ప్రతి ప్రయత్నం సఫలం అవుతుంది. పొదుపు చర్యలు బాగా పాటించడం జరుగుతుంది.