కన్యా రాశిలోకి కుజ, చంద్ర గ్రహాల సంచారం.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధన లాభ యోగం! మీ రాశికి ఇలా..

Money Astrology: ఈ నెల 19, 20, 21 తేదీలలో కన్యారాశిలో కుజ, చంద్ర గ్రహాలు కలుసుకుంటున్నాయి. ఈ రెండు గ్రహాల కలయికను చంద్ర మంగళ యోగం అంటారు. దీనివల్ల కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన యోగం కలుగుతుంది. ఆస్తి కలిసి వస్తుంది. ఆస్తి విలువ పెరుగుతుంది. భూలాభం కలుగుతుంది.

కన్యా రాశిలోకి కుజ, చంద్ర గ్రహాల సంచారం.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధన లాభ యోగం! మీ రాశికి ఇలా..
Money
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Aug 18, 2023 | 10:24 PM

Money Astrology: ఈ నెల 19, 20, 21 తేదీలలో కన్యారాశిలో కుజ, చంద్ర గ్రహాలు కలుసుకుంటున్నాయి. ఈ రెండు గ్రహాల కలయికను చంద్ర మంగళ యోగం అంటారు. దీనివల్ల కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన యోగం కలుగుతుంది. ఆస్తి కలిసి వస్తుంది. ఆస్తి విలువ పెరుగుతుంది. భూలాభం కలుగుతుంది. ఇది రియల్ ఎస్టేట్ వారికి, ఆస్తులు అమ్మకానికి పెట్టినవారికి బాగా కలిసి వచ్చే యోగం. డబ్బు దాచడానికి, డబ్బు మదుపు చేయడానికి కూడా ఈ యోగం దోహదం చేస్తుంది. ఈ కలయిక ఏ రాశుల వారికి ఏ విధంగా అనుకూలించబోతోందో ఇక్కడ పరిశీలిద్దాం.

  1. మేషం: ఈ రాశివారికి ఆరవ స్థానమైన కన్యారాశిలో ఈ కలయిక చోటు చేసుకుంటున్నందువల్ల పెద్దగా యోగించే అవకాశం లేదు. అయితే, డబ్బు దాచడానికి, డబ్బు మదుపు చేయడానికి సరికొత్త మార్గాలను కనిపెట్టే అవకాశం ఉంది. ఈ రాశికి కుజుడు అధిపతి అయినందువల్ల, ఈ కుజుడి కారణంగానే చంద్ర మంగళ యోగం ఏర్పడుతున్నందువల్ల ఈ రాశివారికి ఆదాయం పెరిగే అవకాశం కనిపిస్తోంది. వృత్తి, వ్యాపారాల్లో కూడా బాగా రాబడి పెరిగే సూచనలున్నాయి.
  2. వృషభం: ఈ రాశికి పంచమ స్థానంలో చంద్ర మంగళ యోగం ఏర్పడుతున్నందువల్ల స్పెక్యులేషన్ లాభించడం, ఆర్థిక లావాదేవీలు సత్ఫలితాలను ఇవ్వడం, ఆర్థిక ప్రయత్నాల్లో విజయం సాధించడం వంటివి జరిగే అవకాశం ఉంటుంది. పెద్ద మొత్తంలో డబ్బు దాచడం, మదుపు చేయడం వంటివి కూడా జరిగే అవకాశం ఉంది. పిల్లల వల్ల కూడా ఆదాయం కలిసి వస్తుంది. ఆదాయం పెరుగుదలకు సంబంధించి కొత్తగా చేసే ప్రయత్నాలు, ఆలోచనలు సఫలం అవుతాయి.
  3. మిథునం: ఈ రాశికి నాలుగవ స్థానంలో ఈ యోగం ఏర్పడుతున్నందువల్ల భూ లాభం కలుగుతుంది. ఆస్తి కలిసి వస్తుంది. ఆస్తి విలువ పెరుగుతుంది. తల్లి వైపు నుంచి ఆస్తి వారసత్వంగా లభించే అవకాశం కూడా ఉంది. గృహ, వాహన సౌకర్యాలు ఏర్పడవచ్చు. వృత్తి, ఉద్యోగాల్లో జీతభత్యాలు, వ్యాపారంలో రాబడి పెరుగుతాయి. అదనపు సంపాదనను స్థలాలు, ఇళ్ల మీద పెట్టుబడిగా పెట్టే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ వారికి అన్నివిధాలుగానూ కలిసి వచ్చే సమయం ఇది.
  4. కర్కాటకం: ఈ రాశివారికి ఈ యోగం వల్ల పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చు. అదనపు ఆదాయానికి అవకాశం తక్కువ. వృత్తి, ఉద్యోగాల్లో కొద్దిగా జీతభత్యాలు పెరిగే అవకాశం మాత్రం ఉంది. అయితే, ఆదాయం పెరగడానికి, దాచుకోవడానికి ఈ మూడు రోజుల్లో చేసే ఆలోచనలు, ప్రయత్నాలు సత్ఫ లితాలను ఇవ్వడం జరుగుతుంది. అదనపు ఆదాయానికి ప్రయత్నాలు సాగించడం మంచిది. ఆర్థిక సమస్యలు చాలావరకు తగ్గుముఖం పడతాయి. వ్యాపారాలు వేగం పుంజుకుంటాయి.
  5. సింహం: ఈ రాశికి ధన స్థానంలో ఈ యోగం పడుతున్నందువల్ల కుజ, చంద్రుల కలయిక ఈ రాశివారికి తప్పకుండా ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. ఆదాయం పెరగడం, దాచుకోవాల్సిన పరిస్థితి ఏర్ప డడం, మదుపు చేయడం వంటివి జరుగుతాయి. ఎక్కువగా స్థలాల మీద మదుపు చేయడం జరుగుతుంది. వడ్దీ వ్యాపారాలతో సహా అనేక మార్గాలలో ధనాదాయం పెరుగుతుంది. కుటుంబ సభ్యులు లేదా జీవిత భాగస్వామి తరఫు నుంచి కూడా ఆదాయం పెరిగే అవకాశం ఉంది.
  6. కన్య: ఈ రాశిలోనే చంద్ర మంగళ యోగం ఏర్పడుతున్నందువల్ల ఆర్థిక పరంగా ఈ మూడు రోజులు ఈ రాశివారికి అతి ముఖ్యమైనవని చెప్పవచ్చు. ఆర్థికపరంగా ఎటువంటి ప్రయత్నం చేసినా అది తప్పకుండా సత్ఫలితాలను ఇస్తుంది. గతంలో చేసిన ప్రయత్నాలు కూడా ఇప్పుడు సానుకూల పడతాయి. వడ్డీ వ్యాపారాలు, రియల్ ఎస్టేట్, జూదాలు, స్పెక్యులేషన్, ఆర్థిక లావాదేవీల వంటివి కలిసి వస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఆదాయం పెరుగుతుంది. వ్యాపారాలు లాభాల బాటలో పడ తాయి.
  7. తుల: ఈ చంద్ర మంగళ యోగం వల్ల ఈ రాశివారికి ప్రత్యేకంగా కలిసి వచ్చేదేమీ ఉండదు కానీ, తమ సంపాదనను దాచుకోవడానికి, మదుపు చేయడానికి అవకాశం ఉంది. సంపాదనను సద్విని యోగం చేసుకోవాలని, పెంచుకోవాలని ఆలోచించడం జరుగుతుంది. భూమి, ఇల్లు కొనుగోలుకు సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడడం ప్రారంభిస్తాయి. సంపాదన పెరగడానికి సంబం ధించి కొత్త ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి పెరుగు తుంది.
  8. వృశ్చికం: ఈ రాశివారికి లాభ స్థానంలో ఈ యోగం పట్టడం విశేషం. ఆదాయం పెరగడం, ఆర్థిక సమస్యలు పెరగడం వంటివి తప్పకుండా జరుగుతాయి. ఉద్యోగంలో కంటే, వృత్తి, వ్యాపారాల్లో బాగా ఆదాయం పెరగడం జరుగుతుంది. డబ్బును మదుపు చేయడం, వడ్డీలకు తిప్పడం, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టడం వంటివి జరిగే అవకాశం కూడా ఉంది. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి సరైన నిర్ణయాలు తీసుకోవడానికి సమయం చాలావరకు అనుకూలంగా ఉంది.
  9. ధనుస్సు: ఈ రాశికి వృత్తి, వ్యాపారాల్లో బాగా రాబడి పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగు తుంది. భూ, గృహ లాభం కలుగుతుంది. స్థలాలు, పొలాల విలువ పెరగవచ్చు. తల్లి తండ్రుల వైపు నుంచి ఆస్తి కలిసి వచ్చే సూచనలున్నాయి. సాధారణంగా భూ సంబంధమైన కార్యకలాపాల్లో మదుపు చేసే అవకాశం ఉంటుంది. సొంత ఇంటి కల సాకారం అవుతుంది.
  10. మకరం: ఈ రాశికి భాగ్య స్థానంలో ఈ యోగం పట్టడం వల్ల పెద్దల నుంచి ఆస్తి కలిసి రావడం, స్థలాలు లేదా పొలాల విలువ పెరగడం, ప్రభుత్వపరంగా కూడా లబ్ధి చేకూరడం వంటివి జరుగుతాయి. తండ్రి వైపు నుంచి వారసత్వ సంపద అందుతుంది. తండ్రి కారణంగా ఆకస్మిక ధన లాభం ఏర్పడుతుంది. వృత్తి, వ్యాపారాల్లోనే కాక, ఉద్యోగపరంగా కూడా సంపాదన పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీలు సత్ఫలితాలనిస్తాయి. ఎటువంటి ఆర్థిక ప్రయత్నం చేపట్టడానికైనా ఇది సరైన సమయం.
  11. కుంభం: ఈ రాశివారికి ఈ ధన యోగం వల్ల పెద్దగా కలిసి వచ్చే అవకాశం లేదు కానీ, డబ్బును జాగ్రత్త చేసుకోవడానికి, దాచుకోవడానికి, మదుపు చేసుకోవడానికి ఇది వీలు కల్పిస్తుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలతో సహా వివిధ ఆర్థిక ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. వృత్తి, వ్యాపారాలలో కొద్దిగా సంపాదన పెరిగే సూచనలున్నాయి. జీవిత భాగస్వామి తరఫు నుంచి ఆదాయం పెరగడం, జీవిత భాగస్వామికి కలిసి రావడం జరుగుతుంది. ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది.
  12. మీనం: ఈ రాశికి సప్తమ స్థానంలో ఈ యోగం ఏర్పడుతున్నందువల్ల భాగస్వామ్య వ్యాపారాల్లో ఉన్న వారికి బాగా కలిసి వస్తుంది. విదేశాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్న పిల్లల ద్వారా కూడా ఆదాయం పెరుగుతుంది. విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నవారి సంపాదన పెరిగే సూచనలున్నాయి. జీవిత భాగస్వామి తరఫు నుంచి ఆస్తి కలిసి రావడం, జీవిత భాగస్వామి ఆదాయం పెరగడం వంటివి జరుగుతాయి. ఎక్కువగా భూముల కొనుగోలు మీద పెట్టుబడులు పెట్టే అవకాశముంది.

Note: ఇక్కడ సమకూర్చిన సమాచారం వారివారి నమ్మకం, విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుంది.  దీన్ని నిర్ధారించేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సమాచారాన్ని అందించాము.

మరిన్ని జ్యోతిష్య కథనాలు చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల