Friday Puja Tips: లక్ష్మీదేవి, శుక్రుడు అనుగ్రహం కోసం శుక్రవారం ఈ పరిహారాలు చేసి చూడండి.. ఆర్ధిక ఇబ్బందులు తీరతాయి..

కొన్ని చర్యలతో లక్ష్మీదేవి ఆగ్రహించి ఇల్లు వదిలి వెళ్లిపోతుంది. అప్పుడు  జీవితం కష్టంగా మారుతుంది. ఈ నేపథ్యంలో లక్ష్మీదేవి అనుగ్రహం కోసం శుక్రవారం పాటించాల్సిన అనేక చర్యలు ఉన్నాయి. ఇలా చేయడం వలన అదృష్టం కలిసి వస్తుంది. పేదవాడు మళ్లీ ధనవంతుడు అవుతాడు. ఈ రోజు శుక్రవారం చేయాల్సిన నివారణలు ఏమిటో తెలుసుకోండి.

Friday Puja Tips: లక్ష్మీదేవి, శుక్రుడు అనుగ్రహం కోసం శుక్రవారం ఈ పరిహారాలు చేసి చూడండి.. ఆర్ధిక ఇబ్బందులు తీరతాయి..
Friday Puja Tips
Follow us

|

Updated on: Aug 18, 2023 | 8:15 AM

శుక్రవారం లక్ష్మీ దేవికి శుక్రుడికి అంకితం చేయపడింది.. లక్ష్మీదేవిని అత్యంత భక్తి శ్రద్దలతో పూజిస్తారు.    ప్రతి మనిషి తన జీవితాంతం సంపదకు అధినేత లక్ష్మీదేవి అనుగ్రహం,  ఆశీర్వాదం తనపై ఉండాలని కోరుకుంటాడు. సిరి సంపదలు తనను ఎప్పటికీ విడిచిపెట్టకూడదని భావిస్తారు. అయితే తెలిసో తెలియకనో చాలాసార్లు తప్పులు చేస్తారు. కొన్ని చర్యలతో లక్ష్మీదేవి ఆగ్రహించి ఇల్లు వదిలి వెళ్లిపోతుంది. అప్పుడు  జీవితం కష్టంగా మారుతుంది. ఈ నేపథ్యంలో లక్ష్మీదేవి అనుగ్రహం కోసం శుక్రవారం పాటించాల్సిన అనేక చర్యలు ఉన్నాయి. ఇలా చేయడం వలన అదృష్టం కలిసి వస్తుంది. పేదవాడు మళ్లీ ధనవంతుడు అవుతాడు. ఈ రోజు శుక్రవారం చేయాల్సిన నివారణలు ఏమిటో తెలుసుకోండి.

  1. సంపదలకు అధిదేవత అయిన లక్ష్మిదేవిని ప్రసన్నం చేసుకోవడానికి సోమరితనం విడిచిపెట్టడం చాలా ముఖ్యం. తెల్లవారుజామున నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఎందుకంటే లక్ష్మీదేవి మలినాల్లో ఎప్పుడూ నివాసం ఉండదు.
  2. వ్యాపారంలో ఇబ్బందులు ఏర్పడుతూ ఆర్ధిక ఇబ్బందులు పడుతుంటే.. శుక్రవారం ఈ పరిహారం  చేయాల్సిన పరిహారం ఏమిటంటే.. గులాబీ రంగు వస్త్రంలో అష్టలక్ష్మి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోండి. దీంతో వ్యాపారం జోరుగా సాగుతుంది.
  3. మీరు లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకోవాలనుకుంటే.. ముందుగా లోక రక్షకుడైన శ్రీ మహా విష్ణువును  పూజించాలి. ఇలా చేసే వారి పట్ల లక్ష్మిదేవి ప్రసన్నురాలవుతుంది.
  4. శుక్రవారం తెల్లటి దుస్తులు ధరించడం శుభప్రదంగా భావిస్తారు. దీనితో పాటు లక్ష్మీదేవికి పాయసం, సేమ్యా వంటి తెల్లటి స్వీట్లను నైవేద్యంగా సమర్పించాలి. అనంతరం ఈ నైవేద్యాన్ని ఆడపిల్లలకు ప్రసాదంగా  పంచాలి. ఈ పరిహారం శుక్ర గ్రహాన్ని కూడా బలపరుస్తుంది.
  5. ఇవి కూడా చదవండి
  6. శుక్రగ్రహ దోషం కారణంగా మీరు ఆర్థిక సమస్యలను కూడా ఎదుర్కోవలసి రావచ్చు. దీన్ని తొలగించడానికి ఆవుకు, చీమలకు ఆహారాన్ని అందించండి. దీనితో పాటు పాలను బ్రాహ్మణులకు దానంగా ఇవ్వండి.
  7. శుక్రవారం నాడు లక్ష్మీదేవికి ఇష్టమైన తామరపూవును సమర్పించాలి. ఈ పరిహారాన్ని చేసే భక్తుల పట్ల అనుగ్రహం కలిగి ఉంటుంది.
  8. శుక్రవారం నాడు కనకధార స్త్రోత్ లేదా లక్ష్మీ స్త్రోత్ పఠించడం కూడా లక్ష్మీ దేవి సంపద, ఆశీర్వాదాలను పొందేందుకు సులభమైన మార్గం.
  9. మీరు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లయితే, మీరు శుక్రవారం నాడు లక్ష్మీ దేవిని అలాగే బుద్ది, సిద్ధిలతో పాటు గణపతిని పూజించాలి. ఇది ఆర్థిక సంక్షోభాన్ని తొలగిస్తుంది.
  10. ఇంటిలోని పూజ గదిలో శ్రీ యంత్రాన్ని ప్రతిష్ఠించి ప్రతిరోజూ పూజించండి. ముఖ్యంగా శుక్రవారం శ్రీ యంత్రాన్ని పూజించడం వలన జీవితంలో ఆర్థిక సంక్షోభం తొలగిపోతుంది.
  11. లక్ష్మీ దేవి పూజలో గులాబీ పువ్వును సమర్పించడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. శుక్రవారం ఉపవాసం రోజు గులాబీ పువ్వును సమర్పించడం ద్వారా సంపద దేవత ఆశీర్వాదాలు ఉంటాయి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)