Tirumala: వరస చిరుత దాడులతో భక్తుల్లో ఆందోళనలు.. అలిపిరి కాలిబాట మార్గంలో తగ్గిన సందడి

తిరుమల శ్రీనివాసుడు అంటేనే కోట్ల మంది ప్రజలకు ఆరాధ్య దైవం. అలాంటి దేవుని వద్దకు వెళ్లే మార్గంలో కూడా భక్తులు సెంటిమెంట్ పాటిస్తుంటారు. కాలినడకన వెళ్లి మొక్కు తీర్చుకోవాలని అనుకుంటారు. అలా వెళ్లాలనుకున్న వారిలో భయాందోళన మొదలయ్యాయి. వరుసగా చిరుత దాడి చేసిన ఘటనలు వెలుగు చూస్తుండటంతో కంగారు పెట్టిస్తోంది. దేవుడి దర్శనం సంగతి తర్వాత ముందు ఆ దారిలో వెళ్తే ఎటు నుంచి ఏ ప్రమాదం ముంచుకొస్తుందో అని కంగారు పడుతున్నారు.

Tirumala: వరస చిరుత దాడులతో భక్తుల్లో ఆందోళనలు.. అలిపిరి కాలిబాట మార్గంలో తగ్గిన సందడి
Tirumala Walkway
Follow us

| Edited By: Surya Kala

Updated on: Aug 18, 2023 | 7:25 AM

అలిపిరి కాలిబాట మార్గంలో భక్తుల సందడి తగ్గింది. క్రూరమృగాల సంచారంతో పాటు టీటీడీ తాజా నిబంధనలతో కాలినడక మార్గాలు నిర్మానుష్యంగా మారిపోతుంది. తిరుమలలో దర్శనానికి వెళ్లే భక్తులను వన్యమృగాల సంచారం భయపెడుతోంది. తరచూ చిరుతలు, ఎలుగుబంట్లు, పాముల సంచారం సాధారణమైపోతోంది. దీంతో నడక మార్గంలో వెళ్లే భక్తులు భయం భయంగా తిరుమల కొండకు చేరుకునే పరిస్థితి ఏర్పడింది. తిరుమల శ్రీనివాసుడు అంటేనే కోట్ల మంది ప్రజలకు ఆరాధ్య దైవం. అలాంటి దేవుని వద్దకు వెళ్లే మార్గంలో కూడా భక్తులు సెంటిమెంట్ పాటిస్తుంటారు. కాలినడకన వెళ్లి మొక్కు తీర్చుకోవాలని అనుకుంటారు. అలా వెళ్లాలనుకున్న వారిలో భయాందోళన మొదలయ్యాయి. వరుసగా చిరుత దాడి చేసిన ఘటనలు వెలుగు చూస్తుండటంతో కంగారు పెట్టిస్తోంది. తిరుమల శ్రీనివాసుడి దర్శనానికి కాలి మార్గంలో వెళ్లాలంటే భక్తులు భయపడిపోతున్నారు. దేవుడి దర్శనం సంగతి తర్వాత ముందు ఆ దారిలో వెళ్తే ఎటు నుంచి ఏ ప్రమాదం ముంచుకొస్తుందో అని కంగారు పడుతున్నారు.

మొన్నటివరకు రోజుకు దాదాపు లక్ష మందికి పైగా భక్తులతో కిటకిటలాడిన తిరుమల గిరులు.. ఇప్పుడు భక్తులు లేక వెలవెలబోతున్నాయి. ముఖ్యంగా నడిచే భక్తుల సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. సాధారణంగా తిరుమల శ్రీవారిని నిత్యం 70 వేల నుంచి 90 వేల మంది వరకు భక్తులు దర్శించుకుంటారు. వీరిలో 30 నుంచి 40 శాతం మంది కాలినడకన కొండెక్కుతుంటారు. అయితే అలిపిరి కాలినడక మార్గంలో క్రూరమృగాల సంచారం అధికమవ్వడంతో… టీటీడీ ఆంక్షలు విధించింది. మధ్యాహ్నం తర్వాత పిల్లలకు అనుమతి లేకపోవడంతో చిన్నారులతో వచ్చేవారిలో చాలామంది రోడ్డుమార్గం ద్వారానే తిరుమలకు చేరుకుంటున్నారు. దీంతో అలిపిరి, శ్రీవారిమెట్టు మార్గాలు మధ్యాహ్నం తర్వాత బోసిపోతున్నాయి. గతంలో 30వేల నుంచి 32వేల వరకు నడిచి వచ్చే భక్తుల సంఖ్య పులి దాడి, ఆంక్షల నేపథ్యంలో భారీగా తగ్గింది. బుధవారం కాలి నడకన తిరుమలకు 19 వేల భక్తులు మాత్రమే వెళ్లారు. గురువారం కూడా భక్తులు 20 వేలు దాటలేదు.

ఇవి కూడా చదవండి

ఆరేళ్ల లక్షిత అనే బాలికను చిరుత లాక్కెళ్లి చంపేయడంతో మరోసారి కాలిమార్గంలో భద్రతపై నీలినీడలు కమ్ముకున్నాయి. దీంతో అప్రమత్తమైన టీటీడీ పాత రూల్స్‌ను కఠినం చేస్తోంది. ఎవరినీ ఈ మార్గంలో ఒంటరిగా పంపించడం లేదు. గుంపులు గుంపులుగా విడిచిపెడుతోంది. మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..