AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మంగళ్ గోచార్ 2023: కన్యారాశిలో కుజుడు సంచారం.. ఈ రాశుల వారు అద్భుతాన్ని చూస్తారు..

అంగారక గ్రహాం ఆగష్టు 18న సింహరాశి నుండి కన్యారాశిలోకి ప్రవేశించనున్నాడు. దీని ప్రభావం అన్ని రాశులపై కనిపిస్తుంది. ముఖ్యంగా తులా రాశి సహా మరికొన్ని రాశులపై దీని ప్రభావం ఉంటుంది.  మొత్తం ఐదు రాశులపై ఈ మంగళ్ గోచార్‌ ప్రభావం ఉంటుంది. దీని కారణంగా.. ఈ రాశుల వారికి చాలా ప్రయోజనాలు ఉంటాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

మంగళ్ గోచార్ 2023: కన్యారాశిలో కుజుడు సంచారం.. ఈ రాశుల వారు అద్భుతాన్ని చూస్తారు..
Mangal Gochar
Shiva Prajapati
|

Updated on: Aug 18, 2023 | 9:23 AM

Share

కుజుడు ఈ ఆగష్టు 18వ తేదీన సింహరాశి నుండి కన్యారాశిలోకి ప్రవేశించనున్నాడు. దీని ప్రభావం అన్ని రాశులపై కనిపిస్తుంది. ముఖ్యంగా తులా రాశి సహా మరికొన్ని రాశులపై దీని ప్రభావం ఉంటుంది. ఈ గ్రహ చలనాన్ని మంగళ్ గోచార్ అని పిలుస్తారు. ఈ మంగళ్ గోచార్ కారణంగా ఆయా రాశుల వారికి మేలు జరుగనుంది.  అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

తుల:  కుజుడు స్థాన చలనం కారణంగా.. తులా రాశి వారిపై ప్రభావం ఉంటుంది. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. మీరు ఆర్థికంగా కూడా బలపడతారు. వ్యాపారంలో లాభాలు పొందవచ్చు. అన్ని కోరికలు నెరవేరుతాయి. వైవాహిక జీవితంలో సమస్యలు రావచ్చు. కానీ మీరు పరిస్థితిని నిర్వహిస్తారు. ఈ సంచారము మీ ప్రేమ జీవితంలో ఉద్రిక్తతను కలిగిస్తుంది. ఈ సమయంలో, మీరు విద్యను అభ్యసించడానికి విదేశాలకు వెళ్లడానికి పరిస్థితులు అనుకూలిస్తాయి. డబ్బు పెట్టుబడి జాగ్రత్తగా చేయాలి. లేకుంటే నష్టాలను చవిచూడవలసి ఉంటుంది.

వృశ్చికం: భౌతిక సుఖాల కోసం ఖర్చు చేయవచ్చు. పనిని పూర్తి చేయడానికి సాధారణం కంటే ఎక్కువ పరుగులు చేయాల్సి రావచ్చు. వృత్తి, ఆర్థిక రంగాలు సవాలుగా ఉంటాయి. మీకు స్నేహితులతో విభేదాలు ఏర్పడే పరిస్థితులు ఏర్పడతాయి. కార్యాలయంలో మీకు విశ్వాసం, ధైర్యం అవసరం. అయితే, ఈ సంక్షోభ సమయంలో మీ అవగాహన,  సహనం మాత్రమే మీకు ఉపయోగపడుతుంది. వ్యాపారంలో మీ ప్రత్యర్థులను ప్రశాంతంగా ఉంచడంలో మీరు విజయం సాధిస్తారు.

ఇవి కూడా చదవండి

ధనుస్సు : ఈ సమయంలో విద్యార్థుల్లో అనవసరమైన కోపం, ఆవేశం ఉంటాయి. స్వభావంలో కోపం రానివ్వొద్దు. మీ మనస్సు వృత్తి, ప్రజా ప్రతిష్టకు సంబంధించిన విషయాలపై ఉంటుంది. మీరు ప్రపంచాన్ని కొత్త మార్గంలో చూడటం ప్రారంభిస్తారు. ఇంట్లో గందరగోళ వాతావరణం ఉండవచ్చు. కాబట్టి మీ వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాన్ని అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించండి. విద్యార్థులు వారి స్నేహితులతో సమయాన్ని ఆస్వాదిస్తారు. మీరు చేరిన సమూహాలకు ప్రశంసలు లభిస్తాయి. వ్యాపారంలో రిస్క్‌లో కొత్త స్టార్టప్‌లను ప్రారంభించకుండా ఉండటం మంచిది. మితిమీరిన సాహసోపేతంగా ఉండటం వలన నష్టాలు సంభవించవచ్చు. వివాహానికి సంబంధించిన విషయాలలో కొన్ని అడ్డంకులు ఉండవచ్చు.

మకరం: వ్యాపారంలో పాత ప్రాజెక్ట్‌ను పునఃప్రారంభించేందుకు ప్లాన్ చేస్తారు. విద్యార్థులు వారి అధ్యయనాలలో చాలా చురుకుగా, శక్తివంతంగా, చైతన్యవంతంగా, ఔత్సాహికంగా ఉంటారు. కార్యాలయంలో అమ్మాయిలకు, అబ్బాయిలకు ఆకర్షితులవుతారు. అర్థవంతమైన, ఆసక్తికరమైన సంబంధాలు కూడా ఏర్పడతాయి. దూకుడు తగ్గించుకోవాలి. లేకపోతే కుటుంబ సభ్యులతో ఉద్రిక్తత ఉండవచ్చు. ఈ సమయంలో మీరు ఏమి చేసినా, మీ తెలివితేటలు, కృషి వల్ల మీరు పురోగతి సాధిస్తారు. ప్రేమ జీవితంలో స్థిరత్వం ఇవ్వడానికి ప్రయత్నిస్తారు.

కుంభం: విద్యార్థుల ఉత్సాహంలో ఉంటారు. అతి ఉత్సాహం అనర్థానికి దారి తీస్తుంది. కార్యాలయంలో మీ బలాన్ని తప్పుగా అంచనా వేయడం వలన మీకు సమస్యలు ఏర్పడవచ్చు. ప్రయాణాలలో అధిక ఖర్చు లేకుండా జాగ్రత్త వహించండి. ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సిన సమయం. వ్యాపారంలో ఆచి తూచి వ్యవహరించాలి. లేదంటే నష్టం ఏర్పడే అవకాశం ఉంది. ప్రేమ-జీవితంలో షార్ట్ టెంపర్‌గా ఉండటం వల్ల చేస్తున్న పని చెడిపోతుంది. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది.

మీనం: మీ కోపం జీవిత భాగస్వామిపై పడవచ్చు. మీరు ఈ సమయంలో జీవిత భాగస్వామిపై కోపం రాకుండా చూసుకోవాలి. వ్యాపార భాగస్వామితో కొత్త ప్రాజెక్ట్ గురించి చర్చిస్తారు. ఈ చర్చల ఫలితాలు భవిష్యత్తుకు పునాది వేయగలవు. కార్యాలయంలో నాయకత్వ అవకాశాన్ని కోల్పోయే అవకాశం ఉంది. సానుకూల దృక్పథంతో ముందుకు సాగడానికి ఇది సమయం. శుభ సమయాలను సద్వినియోగం చేసుకోండి. కుటుంబ సంబంధిత నిర్ణయాలు, సామర్థ్యాల గురించి అనిశ్చితి సరైనది కాదు. విద్యార్థులు చదువులో కొన్ని సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..