Horoscope Today: వారికి అనుకోకుండా అదృష్ట యోగం పడుతుంది.. 12 రాశుల వారికి శనివారం రాశిఫలాలు..!

Daily Horoscope in Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు, నక్షత్రాలు మీ జాతకచక్రానికి అనుకూలంగా ఉన్నాయా? ఆరోగ్యం, ఆర్థికపరంగా ఎలా ఉండబోతుంది..? ఉద్యోగపరంగా మీ రాశికి దిన ఫలాలు ఎలా ఉంటాయి? ఆగస్టు 19, 2023న(శనివారం) 12 రాశుల వారి రాశిఫలాలు ఎలా ఉంటాయో తెలుసుకోండి..

Horoscope Today: వారికి అనుకోకుండా అదృష్ట యోగం పడుతుంది.. 12 రాశుల వారికి శనివారం రాశిఫలాలు..!
Horoscope 21st August 2023
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Aug 19, 2023 | 5:01 AM

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): వృత్తి, ఉద్యోగాల్లో అధికారులతో అతి జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. వ్యాపారాల్లో మీ ఆలోచనలు మంచి ఫలితాలను ఇస్తాయి. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఆధ్యాత్మిక చింతన పెరిగి, దైవ కార్యాల్లో పాల్గొంటారు. పుణ్య క్షేత్ర సందర్శనకు అవ కాశం ఉంది. ఆదాయ వృద్ధి ఉంది. పితృవర్గం నుంచి ఆశించిన ప్రయోజనాలు సిద్ధిస్తాయి. పిల్లలకు సంబంధించి సానుకూల సమాచారం అందుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): అనుకోకుండా మంచి అదృష్ట యోగం పడుతుంది. గృహ, వాహన సౌకర్యాలపై దృష్టి పెడతారు. కుటుంబ వ్యవహారాలు చక్కబడతాయి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి. నిరుద్యోగులకు మంచి జీతభత్యాలతో కూడిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది సమయం కాదు.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): ఆదాయం పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. అదనపు ఆదాయ మార్గాలు కలిసి వస్తాయి. ఉపయోగకర మైన నిర్ణయాలు తీసుకుంటారు. పిల్లలకు సంబంధించి ఇంట్లో శుభ కార్యం నిర్వహించే అవకాశం ఉంది. లాభదాయకమైన పరిచయాలు ఏర్పడతాయి. బాగా సన్నిహితులు కొందరు పక్కదోవ పట్టించడమో, మోసం చేయడమో జరుగుతుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి సహాయ సహ కారాలు ఉంటాయి. వృత్తి జీవితంలో డిమాండ్ పెరుగుతుంది. వ్యాపారంలో లాభాలు కనిపిస్తాయి.

ఇవి కూడా చదవండి

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. ప్రోత్సాహకాలు లభిస్తాయి. అనవసర పరిచయాలతో ఇబ్బంది పడతారు. ధనాభివృద్ధికి అవకాశాలు పెరుగుతాయి. ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది. కొందరు బంధువులకు సహాయం చేస్తారు. వృత్తి జీవితంలో కొత్త ఆలోచనలు అమలు చేస్తారు. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. పెళ్లి ప్రయత్నాల్లో సానుకూల స్పందన లభించకపోవచ్చు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): గట్టి పట్టుదలతో కొన్ని ముఖ్యమైన విషయాలను చక్కబెట్టుకుంటారు. వృత్తి, ఉద్యోగ బాధ్యతలను ఎంతో ఆత్మవిశ్వాసంతో నిర్వర్తిస్తారు. వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. ఆరోగ్యం పరవాలేదని పిస్తుంది. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకపోవడం మంచిది. లేనిపోని సమస్యలు మీద పడే అవకాశం ఉంది. ఆదాయానికి లోటు ఉండకపోవచ్చు. విదేశీ యనానికి సంబంధించిన ఆటంకాలు తొలగిపోతాయి. ఒకటి రెండు శుభవార్తలు వినే సూచనలున్నాయి. ప్రయాణాలు పెట్టుకోవద్దు.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): ఉద్యోగంలో స్థిరత్వం లభించడంతో పాటు పురోగతి కూడా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో క్షణం కూడా తీరిక ఉండకపోవచ్చు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. అనవసర సహాయాలకు స్వస్తి చెప్పడం మంచిది. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. జీవిత భాగస్వామితో కలిసి దైవ దర్శనం చేసుకుంటారు. జీవిత భాగస్వామి తరఫు బంధువుల రాకపోక లుంటాయి. అనవసర సంబంధాలకు, పరిచయాలకు దూరంగా ఉండడం చాలా మంచిది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): శుభ గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నందువల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా అనుకూలించే అవకాశం ఉంటుంది. ముఖ్యమైన పెండింగ్ పనులన్నీ సునాయాసంగా పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా సాగిపోతాయి. వ్యాపారాలు లాభాలు తెచ్చి పెడతాయి. జీవిత భాగస్వామి తన వృత్తి, ఉద్యోగాలలో ఆశించిన స్థాయిలో పురోగతి చెందుతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఇతరుల వలలో పడకపోవడం మంచిది. కొందరు మిత్రులు పక్కదోవ పట్టించే అవకాశముంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): ఆదాయం పెరగడానికి అవకాశం ఉంది. ముఖ్యమైన సమస్యలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగంలో కొద్దిగా ఒడిదుడుకులు ఉంటాయి. వృత్తి, వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. స్థిరాస్తుల విలువ పెరిగినట్టు సమాచారం అందుకుంటారు. సన్నిహితులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఉద్యోగ, వివాహ ప్రయత్నాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. పిల్లలు పురోగతి చెందుతారు. కుటుంబంలో ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): అన్ని వైపుల నుంచి ఆదాయం అందుతుంది. కొత్తగా వాహనం కొనడానికి ప్లాన్ చేస్తారు. దైవ కార్యాల్లో పాల్గొంటారు. వ్యాపారాన్ని విస్తరించుకునే అవకాశం ఉంది. ఉద్యోగంలో మీ మాట చెల్లుబాటు అవుతుంది. వృత్తి జీవితం బిజీగా మారిపోతుంది. ఆస్తి వివాదంలో రాజీ మార్గం అనుసరిస్తారు. కుటుంబ బాధ్యతలను నిర్వర్తించడంలో కొద్దిగా ఇబ్బందులు పడతారు. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు సానుకూలపడతాయి. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): ముఖ్యమైన కార్యక్రమాలు సజావుగా పూర్తవుతాయి. బంధుమిత్రులు మీ నుంచి సహాయాన్ని ఆశించడం జరుగుతుంది. ప్రయాణాల వల్ల ఆశించిన ఫలితం ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు పెరిగినప్పటికీ, మీ శ్రమకు, ప్రతిభకు మంచి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాల్లో స్వల్ప లాభాలకు అవకాశం ఉంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో తగినంత శ్రద్ధ చూపించడం మంచిది. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలపడతాయి. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. తలపెట్టిన పను లలో కార్యసిద్ధి ఉంటుంది. దైవ చింతన పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలలో ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఆరోగ్యం అనుకూలంగానే ఉంటుంది. కుటుంబ వ్యవహారాలు చక్కబెట్టడం మీద దృష్టి సారిస్తారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. మొండి బాకీలు కూడా వసూలు అవుతాయి. శుభకార్యాల మీదా, దైవ కార్యాల మీదా బాగా ఖర్చు అవుతుంది. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగాలలో ప్రశాంత, ప్రోత్సాహకర వాతావ రణం నెలకొంటుంది. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. కుటుంబ జీవితం సామరస్యంగా సాగిపోతుంది. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది.

Note: ఇక్కడ సమకూర్చిన సమాచారం వారివారి నమ్మకం, విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుంది.  దీన్ని నిర్ధారించేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సమాచారాన్ని అందించాము.

మరిన్ని జ్యోతిష్య కథనాలు చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
పాన్ కార్డు 2.0 అంటే ఏంటి? పాత కార్డు పని చేయదా? అసలు నిజం ఇదే
పాన్ కార్డు 2.0 అంటే ఏంటి? పాత కార్డు పని చేయదా? అసలు నిజం ఇదే