Lucky Zodiac Signs: భాగ్యాధిపతి అనుగ్రహం.. ఆ రాశుల వారికి అదృష్ట యోగాలు..!

జాతక చక్రంలో గానీ, గ్రహ సంచారంలో గానీ భాగ్యాధిపతి, అంటే 9వ స్థానాధిపతి బలంగా ఉన్న పక్షంలో అటువంటి రాశివారికి తప్పకుండా ఏదో ఒక రూపంలో మహా భాగ్య యోగం పడుతుంది. అన్ని విధాలుగానూ పురోగతి ఉంటుంది. ఇంట్లో శుభ కార్యాలు జరగడం, శుభ పరిణామాలు చోటు చేసుకోవడం వంటివి తప్పకుండా జరుగుతాయి.

Lucky Zodiac Signs: భాగ్యాధిపతి అనుగ్రహం.. ఆ రాశుల వారికి అదృష్ట యోగాలు..!
Lucky Zodiac Signs
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: Aug 17, 2024 | 9:41 PM

జాతక చక్రంలో గానీ, గ్రహ సంచారంలో గానీ భాగ్యాధిపతి, అంటే 9వ స్థానాధిపతి బలంగా ఉన్న పక్షంలో అటువంటి రాశివారికి తప్పకుండా ఏదో ఒక రూపంలో మహా భాగ్య యోగం పడుతుంది. అన్ని విధాలుగానూ పురోగతి ఉంటుంది. ఇంట్లో శుభ కార్యాలు జరగడం, శుభ పరిణామాలు చోటు చేసుకోవడం వంటివి తప్పకుండా జరుగుతాయి. ముఖ్యంగా ‘విదేశీ’ యోగాలు పడతాయి. ప్రస్తుతం గ్రహ సంచారం రీత్యా మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, తుల, మకర రాశుల వారికి భాగ్యాధిపతి అనుకూలంగా ఉన్నందువల్ల వీరికి అదృష్ట యోగాలు పడతాయి. శుభ వార్తలు ఎక్కువగా వినడం జరుగుతుంది.

  1. మేషం: ఈ రాశికి భాగ్యాధిపతి అయిన గురువు ధన స్థానంలో ఉన్నందువల్ల ఈ రాశివారికి ధనపరంగా అదృష్టం పడుతుంది. ఆదాయ మార్గాలన్నీ సత్ఫలితాలనిస్తాయి. విదేశీ సొమ్ము అనుభవించే యోగం కూడా ఉంది. ఈ రాశివారికి 2025 మే వరకూ ధన సంబంధమైన అదృష్టం కొనసాగు తుంది. ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉంది. రావలసిన డబ్బు, బాకీలు వసూలవు తాయి. పిత్రార్జితం లభిస్తుంది. ఆస్తి విలువ పెరుగుతుంది. మాటకు, చేతకు విలువ ఉంటుంది.
  2. వృషభం: ఈ రాశికి భాగ్యాధిపతి అయిన శనీశ్వరుడు దశమ స్థానంలో ఉన్నందువల్ల ఉద్యోగంలో హోదాతో పాటు జీతభత్యాలు, రాబడి బాగా పెరిగే అవకాశం ఉంది. విదేశాల్లో ఉద్యోగం లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఉద్యోగరీత్యా విదేశీ ప్రయాణాలు చేయడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు నష్టాల్లోంచి బయటపడి లాభాల బాట పట్టే అవకాశం ఉంది. తండ్రి నుంచి ఆస్తిపాస్తులు లభించే అవకాశం ఉంది. బ్యాంక్ బ్యాలెన్స్ బాగా వృద్ధి చెందుతుంది. ఇది 2025 జూలై వరకు కొనసాగుతుంది.
  3. మిథునం: ఈ రాశివారికి భాగ్యస్థానాధిపతి శని భాగ్య స్థానంలోనే సంచారం చేస్తున్నందువల్ల 2025 జూలై వరకు వీరి ఆర్థిక పరిస్థితికి తిరుగుండదు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లోనే కాకుండా, కుటుంబ పరంగా కూడా అనేక శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఇంట్లో తప్పకుండా శుభ కార్యాలు జరుగుతాయి. తండ్రి నుంచి విలువైన ఆస్తి సంక్రమిస్తుంది. ఆస్తిపాస్తులు కొనుక్కునే అవకాశం కూడా ఉంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారం అవుతాయి.
  4. కర్కాటకం: ఈ రాశికి భాగ్యాధిపతి అయిన గురువు లాభ స్థానంలో ఉన్నందువల్ల 2025 మే లోపల అనేక పర్యాయాలు ధన యోగాలు పట్టే అవకాశం ఉంది. ఉద్యోగంలో జీతభత్యాలు అంచనాలకు మించి పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభాలపరంగా కొత్త పుంతలు తొక్కుతాయి. మొత్తం మీద ఆదా యానికి ఎటువంటి లోటూ ఉండదు. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతూనే ఉంటుంది. ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. ‘గంగా స్నాన యోగం’ పడుతుంది.
  5. తుల: ఈ రాశికి భాగ్యాధిపతి అయిన బుధుడు దశమ, లాభ స్థానాల్లో సంచారం చేస్తున్నందువల్ల ఈ ఏడాది సెప్టెంబర్ 23 వరకూ ఏదో ఒక రూపంలో అదృష్టం లేదా ధనయోగం పడుతూనే ఉంటుంది. ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి కూడా అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల రీత్యా విదేశాలకు వెళ్లి ఆర్జించడం కూడా జరుగుతుంది. ఉద్యోగంలో పదోన్నతి, జీతభత్యాల పెరు గుదల విషయంలో శీఘ్ర పురోగతి ఉంటుంది. వ్యాపారాల్లో లాభాలు అంచనాలను మించుతాయి.
  6. మకరం: ఈ రాశికి భాగ్యాధిపతి అయిన బుధుడు మరో నాలుగు నెలల పాటు అనుకూల స్థానాల్లో సంచారం చేస్తున్నందువల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు బాగా లాభసాటిగా సాగిపోయే అవకాశం ఉంది. జీవిత భాగస్వామి ద్వారా కూడా అదృష్టం కలిసి వస్తుంది. వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. ఆస్తి వివాదం అనుకూలంగా పరిష్కారమై, విలువైన ఆస్తి కలిసి వస్తుంది. నిరు ద్యోగులకు విదేశీ అవకాశాలు కలిసి వస్తాయి. అనేక శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.

నటుడిగా డైరెక్టర్ హరీశ్ శంకర్.. ఏయే సినిమాల్లో యాక్ట్ చేశారంటే?
నటుడిగా డైరెక్టర్ హరీశ్ శంకర్.. ఏయే సినిమాల్లో యాక్ట్ చేశారంటే?
భాగ్యాధిపతి అనుగ్రహం.. ఆ రాశుల వారికి అదృష్ట యోగాలు..!
భాగ్యాధిపతి అనుగ్రహం.. ఆ రాశుల వారికి అదృష్ట యోగాలు..!
చిరంజీవి చెల్లెలిగా కొత్త హీరోయిన్..
చిరంజీవి చెల్లెలిగా కొత్త హీరోయిన్..
నీచ శుక్రుడితో ఆ రాశుల వారికి ధన, అధికార, రాజయోగాలు..!
నీచ శుక్రుడితో ఆ రాశుల వారికి ధన, అధికార, రాజయోగాలు..!
టీ20 కెప్టెన్‌గా సూర్య కొన్ని రోజులే! మళ్లీ అతనే భారత జట్టు సారథి
టీ20 కెప్టెన్‌గా సూర్య కొన్ని రోజులే! మళ్లీ అతనే భారత జట్టు సారథి
దేశవ్యాప్తంగా ఓపీ సేవలను బహిష్కరించిన మెడికవర్ హాస్పిటల్స్
దేశవ్యాప్తంగా ఓపీ సేవలను బహిష్కరించిన మెడికవర్ హాస్పిటల్స్
జొమాటోలో 'గ్రూప్‌ ఆర్డరింగ్‌' ఫీచర్‌.. ఉపయోగం ఏంటో తెలుసా.?
జొమాటోలో 'గ్రూప్‌ ఆర్డరింగ్‌' ఫీచర్‌.. ఉపయోగం ఏంటో తెలుసా.?
తంగళాన్ సినిమాలో మాళవిక పాత్ర రిజెక్ట్ చేసిన ఆ స్టార్ హీరోయిన్..
తంగళాన్ సినిమాలో మాళవిక పాత్ర రిజెక్ట్ చేసిన ఆ స్టార్ హీరోయిన్..
'అందుకే అన్నానువ్వంటే మాకిష్టం'.. అభిమాని కోసం నాని ఏం చేశాడంటే?
'అందుకే అన్నానువ్వంటే మాకిష్టం'.. అభిమాని కోసం నాని ఏం చేశాడంటే?
శ్రీకాంత్ కొడుకు రోషన్ కొత్త సినిమా స్టార్ట్..
శ్రీకాంత్ కొడుకు రోషన్ కొత్త సినిమా స్టార్ట్..