Lucky Horoscope
మొత్తం తొమ్మిది గ్రహాల్లో అయిదు గ్రహాల అనుగ్రహం కలగడం ఏ రాశికైనా చాలా అరుదైన విషయం. ప్రస్తుతం అయిదు రాశులకు అటువంటి అరుదైన అయిదు గ్రహాల అనుగ్రహం కలిగింది. మేషం, వృషభం, కర్కాటకం, కన్య, మకర రాశుల వారికి ఈ అదృష్టం పట్టింది. ఈ అదృష్టం వల్ల నవంబర్ 15 వరకు ఈ రాశుల వారు పట్టిందల్లా బంగారం అవుతుంది. జీవితం నిత్య కల్యాణం పచ్చతోరణంలా సాగిపోతుంది. ఏ ప్రయత్నమైనా సునాయాసంగా నెరవేరుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఊహించని ఫలితాలు సాధిస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మహారాజ యోగం పడుతుంది.
- మేషం: ఈ రాశికి గురువు, కుజుడు, రవి, బుధ, శని గ్రహాలు అత్యంత యోగదాయకంగా మారాయి. అందువల్ల మనసులోని ముఖ్యమైన ఆశలు, ఆశయాలు, కోరికలు నెరవేరుతాయి. ఆరోగ్యం బాగా మెరుగ్గా ఉంటుంది. ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాలు తప్పకుండా లాభాల బాట పడతాయి. ఉద్యోగులకు, నిరుద్యోగులకు ఇతర దేశాల నుంచి కూడా అవకాశాలు లభిస్తాయి. ఎక్కువగా శుభవార్తలు వింటారు.
- వృషభం: ఈ రాశికి రాహువు, గురువు, రాశ్యధిపతి శుక్రుడు, కుజుడు, శని బాగా అనుకూలంగా ఉన్నాయి. ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా కలిసి వస్తాయి. ఉద్యోగంలో జీతభత్యాలు బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు ఆశించిన స్థాయికి చేరుకుంటాయి. ఇంట్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. కొద్ది ప్రయత్నంతో సొంత ఇంటి కల నెరవేరుతుంది. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది.
- కర్కాటకం: ఈ రాశికి గురువు, బుధుడు, రవి, శుక్రుడు, కేతువు బాగా అనుకూలంగా సంచారం చేస్తున్నాయి. వీటి ఫలితంగా విదేశీ సొమ్మును అనుభవించే యోగం పడుతుంది. నిరుద్యోగులకు, ఉద్యోగులకు విదేశాల నుంచి ఆఫర్లు, ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగులు మరింత మంచి ఉద్యోగంలోకి మార డానికి అవకాశం ఉంది. ఆదాయం రెండింతలు, మూడింతలుగా పెరుగుతుంది. వివాదాలు, సమ స్యలు పరిష్కారమై, విలువైన ఆస్తి కలిసి వస్తుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి.
- వృశ్చికం: ఈ రాశికి శని, గురువు, కుజుడు, బుధ, రవులు బాగా అనుకూలంగా మారినందువల్ల ఉద్యోగం లోనే కాక, కుటుంబంలో కూడా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఏ ప్రయత్నం తల పెట్టినా విజయవంతం అవుతుంది. అనేక వైపుల నుంచి ఆదాయం పెరుగుతుంది. ఆస్తిపాస్తులు కొనడం జరుగుతుంది. ఆస్తుల విలువ బాగా పెరుగుతుంది. నిరుద్యోగులకు అనేక ఆఫర్లు అందే అవకాశం ఉంది. సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది.
- మకరం: ఈ రాశికి శని, రాహువు, గురువు, రవి, బుధ, శుక్రులు బాగా అనుకూలంగా సంచారం చేస్తు న్నందు వల్ల అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజ యాలు సాధిస్తారు. ఆస్తి వివాదం పరిష్కారమై, విలువైన ఆస్తి కలిసి వస్తుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో ఉన్నత స్థానాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలు విస్తరించే అవ కాశం ఉంది. ఆస్తిపరులతో పెళ్లి సంబంధం కుదురుతుంది. నిరుద్యోగులకు అరుదైన ఆఫర్లు అందుతాయి.
మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి