Lucky Zodiac Signs: మేష రాశిలో కుజ గ్రహం.. ఆ రాశుల వారికి అధికార, అదృష్ట యోగాలు పక్కా..!

జూన్ 2వ తేదీన కుజ గ్రహం మేష రాశిలో ప్రవేశిస్తోంది. మేష రాశి కుజుడికి స్వస్థానం. ఇక్కడ కుజుడు మామూలు కన్నా అనేక రెట్లు బలంగా పనిచేస్తాడు. కుజుడు అధికారానికే కాక, ఆకస్మిక ధన లాభానికి కూడా కారకుడు. కుజుడు అనుకూలంగా ఉన్నపక్షంలో సగటు వ్యక్తి సైతం అందలాలు ఎక్కడం జరుగుతుంది.

Lucky Zodiac Signs: మేష రాశిలో కుజ గ్రహం.. ఆ రాశుల వారికి అధికార, అదృష్ట యోగాలు పక్కా..!
Lucky Zodiac Signs
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: May 28, 2024 | 6:26 PM

జూన్ 2వ తేదీన కుజ గ్రహం మేష రాశిలో ప్రవేశిస్తోంది. మేష రాశి కుజుడికి స్వస్థానం. ఇక్కడ కుజుడు మామూలు కన్నా అనేక రెట్లు బలంగా పనిచేస్తాడు. కుజుడు అధికారానికే కాక, ఆకస్మిక ధన లాభానికి కూడా కారకుడు. కుజుడు అనుకూలంగా ఉన్నపక్షంలో సగటు వ్యక్తి సైతం అందలాలు ఎక్కడం జరుగుతుంది. జూలై 12 వరకూ మేష రాశిలో సంచారం చేసే కుజుడి వల్ల మేషం, మిథునం, కర్కాటకం, సింహం, తుల, ధనుస్సు, మీన రాశుల వారు అత్యధికంగా లాభాలు, యోగాలు అనుభవించడం జరుగుతుంది.

  1. మేషం: రాశ్యధిపతి కుజుడు ఇదే రాశిలో సంచారం చేయడం వల్ల ఈ రాశివారికి తప్పకుండా రాజయోగం కలుగుతుంది. ఉద్యోగంలో అధికార యోగం పడుతుంది. ఏం చేసినా చెల్లుబాటవుతుంది. ఆర్థిక సమస్యలన్నీ దాదాపు పరిష్కారమవుతాయి. ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది. విదే శాలకు వెళ్లడం జరుగుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయాలు సాధిస్తారు. ప్రతిభా పాటవా లకు పదును పెడతారు. శక్తి సామర్థ్యాలు బాగా పెరుగుతాయి. ఆరోగ్యం బాగా కుదుటపడుతుంది.
  2. మిథునం: ఈ రాశికి లాభ స్థానంలో కుజ సంచారం వల్ల అనేక విధాలుగా రాబడి పెరుగుతుంది. ఎంత శ్రమ కైనా ఓర్చి ఆదాయ మార్గాల్ని పెంచుకోవడం జరుగుతుంది. ప్రముఖులతో లాభదాయక పరిచ యాలు ఏర్పడతాయి. వృత్తి, వ్యాపారాల్లో డిమాండు పెరిగి, తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇంటా బయటా పని ఒత్తిడి నుంచి విముక్తి లభిస్తుంది. ఉద్యోగంలో అధికారం చెలాయిస్తారు. రావ లసిన డబ్బు, బాకీలు, బకాయిలన్నీ తేలికగా చేతికి అందుతాయి. బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది.
  3. కర్కాటకం: ఈ రాశివారికి దశమ స్థానంలో దశమాధిపతి కుజుడి సంచారం వల్ల ఉద్యోగంలో అనేక శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. తప్పకుండా అధికార యోగం పడుతుంది. వృత్తి, వ్యాపారాలు ఒక వెలుగు వెలుగుతాయి. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా అందుతాయి. ఉద్యోగుల స్థితి గతులు పూర్తిగా మారిపోతాయి. మరింత మంచి ఉద్యోగంలోకి మారే ప్రయత్నాలు చేస్తున్నవారికి శుభవార్తలు అందుతాయి. ఉద్యోగమూలక ధన లాభం ఉంటుంది. ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది.
  4. సింహం: ఈ రాశికి భాగ్య స్థానంలో భాగ్యాధిపతి కుజుడి సంచారం వల్ల మనసులోని కొన్ని కోర్కెలు నెరవేరుతాయి. విదేశాలకు వెళ్లి సంపాదించుకునే యోగం పడుతుంది. పిత్రార్జితం కలిసి వస్తుంది. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. ఆర్థికంగా ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధిస్తారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు అతి తేలికగా నెరవేరుతాయి. ప్రయాణాల వల్ల బాగా లాభం ఉంటుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాల పంట పండుతుంది.
  5. తుల: ఈ రాశివారికి సప్తమ స్థానాధిపతి కుజుడు సప్తమ స్థానంలోనే సంచరిస్తున్నందువల్ల సంపన్న కుటుంబంలో వివాహం నిశ్చయం కావడం, సంపన్న వ్యక్తితో ప్రేమలో పడడం వంటివి జరుగు తాయి. జీవితంలో తప్పకుండా సంపద వృద్ధి చెందుతుంది. విదేశాలకు వెళ్లే అవకాశముంది. వివాహ సంబంధమైన సమస్యలు, వివాదాలు సానుకూలంగా పరిష్కారమవుతాయి. గృహ, వాహన యోగాలు పట్టడం జరుగుతుంది. ఏ ఆర్థిక ప్రయత్నం తలపెట్టినా విజయం సిద్ధిస్తుంది.
  6. ధనుస్సు: ఈ రాశికి పంచమ స్థానంలో కుజ సంరాచం వల్ల అనేక మార్గాల్లో ఈ రాశివారి ఆదాయం పెరుగు తుంది. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి వీరి ఆలోచనలు, వ్యూహాలు తప్పకుండా సత్ఫలితాల నిస్తాయి. ఉద్యోగంలో వీరి ప్రతిభా పాటవాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. దీనివల్ల అధికారంతో పాటు ఆర్థికంగా లాభపడతారు. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. ఆర్థిక లావాదేవీలకు సంబంధించి శుభవార్తలు వినడం జరుగుతుంది.
  7. మీనం: ఈ రాశికి ధన స్థానంలో ధనాధిపతి కుజుడి ప్రవేశం వల్ల అన్ని వైపుల నుంచి ఆదాయం పెరు గుతుంది. సర్వత్రా మాట చెల్లుబాటవుతుంది. ప్రముఖులతో పరిచయాలు విస్తరిస్తాయి. ఇంట్లో శుభ కార్యాలు జరుగుతాయి. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఆర్థికంగా ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా తేలికగా సఫలం అయ్యే అవకాశం ఉంది. డాక్టర్లు, లాయర్ల వంటి వృత్తుల వారికి ఆశించిన గుర్తింపు లభించి నిమిషం కూడా తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది.

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే