Money Astrology: కీలక స్థానాల్లో అనుకూల గ్రహాలు.. ఆ రాశుల వారికి ఆదాయం బాగా పెరిగే అవకాశం..!
జ్యోతిషశాస్త్రంలో 11వ స్థానాన్ని బట్టి ఆదాయాన్ని, 12వ స్థానాన్ని బట్టి వ్యయాన్ని చెప్పవలసి ఉంటుంది. ఈ ఏడాదిలో కొన్ని రాశుల వారికి 11వ స్థానం బలంగా ఉండడం, 12వ స్థానం బలహీనంగా ఉండడం వల్ల వ్యయం కంటే ఆదాయమే బాగా ఎక్కువగా ఉండడం, బ్యాంక్ బ్యాలెన్ప్ పెరగడం వంటివి జరిగే అవకాశం ఉంది.
జ్యోతిషశాస్త్రంలో 11వ స్థానాన్ని బట్టి ఆదాయాన్ని, 12వ స్థానాన్ని బట్టి వ్యయాన్ని చెప్పవలసి ఉంటుంది. ఈ ఏడాదిలో కొన్ని రాశుల వారికి 11వ స్థానం బలంగా ఉండడం, 12వ స్థానం బలహీనంగా ఉండడం వల్ల వ్యయం కంటే ఆదాయమే బాగా ఎక్కువగా ఉండడం, బ్యాంక్ బ్యాలెన్ప్ పెరగడం వంటివి జరిగే అవకాశం ఉంది. ఇందులో మేషం, వృషభం, కర్కాటకం, తుల, దనుస్సు, మకర రాశులు చేరి ఉన్నాయి. ఈ రాశుల వారు అదనపు ఆదాయం కోసం కాస్తంత ఎక్కువగా కష్టపడే అవకాశం కూడా ఉంది.
- మేషం: ఈ రాశికి లాభ స్థానాధిపతి శని లాభంలోనే ఉండడం, వ్యయాధిపతి గురువు కూడా ధన స్థానం లోనే ఉండడం వల్ల వ్యయం కంటే ఆదాయం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అదనపు ఆదా యం కోసం వీరు చేసే ప్రయత్నాలన్నీ సఫలం అవుతాయి. అదనపు ఆదాయాన్ని షేర్లు, వ్యాపా రాల్లో మదుపు పెట్టే అవకాశం ఉంది. ఒక ప్రణాళిక ప్రకారం సంపదను పెంచుకోవడం జరుగు తుంది. ఖర్చుల్ని అదుపు జరుగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించే అవకాశం ఉంది.
- వృషభం: ధన కారకుడు, లాభాధిపతి అయిన గురువు ఇదే రాశిలో ఉండడం, వ్యయాధిపతి కూడా ఇదే రాశిలో ఉండడం వల్ల ఆదాయానికి ఏమాత్రం లోటుండదు. ఆదాయం ఎక్కువగానూ, వ్యయం బాగా తక్కువగానూ ఉండే అవకాశం ఉంది. ఖర్చుల విషయంలో ఆచితూచి అడుగువేయడం, ప్రణాళికాబద్దంగా ఆదాయాన్ని పెంచుకోవడం జరిగే అవకాశం ఉంది. వచ్చే మూడు నెలల కాలంలో ఆదాయం పెరగడమే తప్ప తగ్గడం ఉండకపోవచ్చు. బ్యాంక్ బ్యాలెన్స్ కు లోటుండదు.
- కర్కాటకం: ఈ రాశికి లాభ స్థానంలో భాగ్యాధిపతి గురువు ఈ ఏడాదంతా ఉండబోతున్నందువల్ల, వ్యయా ధిపతి కూడా ధన స్థానంలో సంచారం చేస్తున్నందువల్ల మదుపులు, పెట్టుబడుల మీద తప్ప ఇతరత్రా ఆదాయం తగ్గే అవకాశం ఉండదు. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉంది. ఖర్చుల్ని తగ్గించుకోవడమే కాకుండా విపరీతంగా పొదుపు పాటించడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు, ఉద్యోగంలో జీతాలు పెరిగే అవకాశం ఉంది.
- తుల: ఈ రాశికి లాభ స్థానంలో రాశ్యధిపతి శుక్రుడు, రెండు నెలల పాటు లాభాధిపతి రవి, వ్యయాధిపతి బుధుడు కూడా లాభస్థానంలో సంచారం వల్ల ఈ రాశివారికి ఆదాయం దిన దినాభివృద్ధి చెందే అవకాశం ఉంది. వృథా ఖర్చులు, వైద్య ఖర్చులు కూడా బాగా తగ్గిపోతాయి. షేర్లలోనూ, చిన్న వ్యాపారాల్లోనూ, వడ్డీ వ్యాపారాల్లోనూ పెట్టుబడులు పెట్టడం ఎక్కువవుతుంది. అనేక మార్గాల్లో ఆదాయాన్ని గడించడం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాబడి బాగా పెరిగే అవకాశం ఉంది.
- ధనుస్సు: ఈ రాశికి లాభ స్థానాధిపతి అయిన శుక్రుడు భాగ్య, దశమ స్థానాల్లో సంచారం చేయడం, భాగ్య స్థానంలో రవి, బుధులతో కూడా కలిసి ఉండడం వల్ల ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. వ్యయాధిపతి కుజుడు రాశ్యధిపతి గురువుతో కలిసి ఉన్నందువల్ల ఆర్థిక సమస్యలను పరిష్కరించుకోవడానికి మాత్రమే ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. స్వయం కృషితో ఆదాయాన్ని ఇబ్బడిముబ్బడిగా పెంచుకోవడం జరుగుతుంది.
- మకరం: రాశ్యధిపతి శని, గురు, కుజులు లాభ స్థానాన్ని వీక్షిస్తున్నందువల్ల అనేక మార్గాల్లో ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. వ్యయాధిపతి అయిన గురువు కూడా శుభ స్థానంలో ఉండి లాభ స్థానాన్ని వీక్షిస్తున్నందువల్ల ఆచితూచి ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. అనవసర ఖర్చులు తగ్గించు కోవడం, పొదుపు పాటించడం, లాభసాటి వ్యవహారాల్లో పెట్టుబడులు పెట్టడం వంటివి ఎక్కువగా జరుగుతాయి. అదనపు ఆదాయ మార్గాల మీద ఎక్కువగా దృష్టి పెట్టడం జరుగుతుంది.