Horoscope Today: వారు డబ్బు విషయంలో ఎవరికీ హామీలు ఉండొద్దు.. 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు

దిన ఫలాలు (ఆగస్టు 17, 2024): మేష రాశి వారికి అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆర్థిక సమస్యల ఒత్తిడి బాగా తగ్గుతుంది. వృషభ రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నుంచి కొద్దిగా ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. మిథున రాశి వారి కుటుంబ సభ్యుల మీద ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today: వారు డబ్బు విషయంలో ఎవరికీ హామీలు ఉండొద్దు.. 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు
Horoscope Today 17th August 2024
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Aug 17, 2024 | 5:01 AM

దిన ఫలాలు (ఆగస్టు 17, 2024): మేష రాశి వారికి అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆర్థిక సమస్యల ఒత్తిడి బాగా తగ్గుతుంది. వృషభ రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నుంచి కొద్దిగా ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. మిథున రాశి వారి కుటుంబ సభ్యుల మీద ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

వృత్తి, ఉద్యోగాలలో ప్రతి విషయంలోనూ అనుకూలతలు పెరుగుతాయి. ఇంటా బయటా కొద్దిపాటి ఇబ్బందులున్నా అధిగమిస్తారు. వాహన ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. వ్యాపారంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆదాయానికి లోటుండదు. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆర్థిక సమస్యల ఒత్తిడి బాగా తగ్గుతుంది. సమాజంలో పలుకుబడి పెరుగు తుంది. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపో తుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ప్రతి పనిలోనూ కొద్దిపాటి వ్యయ ప్రయాసలు తప్పకపోవచ్చు. ఒకటికి రెండుసార్లు తిరగవలసి వస్తుంది. బంధువులతో కొన్ని అపార్థాలు, ఇబ్బందులు తొలగిపోతాయి. వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నుంచి కొద్దిగా ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. వ్యాపారాల్లో మార్పులు, చేర్పులు చేపడతారు. నిరుద్యోగులు ఆశాభంగం చెందుతారు. అనుకోకుండా మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఉద్యోగం మారడానికి అవకాశం ఉండకపోవచ్చు. దాంపత్య జీవితంలో సమస్యలు సర్దుమణుగుతాయి.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

కుటుంబ సభ్యుల మీద ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు. పిల్లలు కొద్ది శ్రమతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. వ్యక్తిగత సమస్యల ఒత్తిడి బాగా తగ్గుతుంది. తల్లితండ్రుల జోక్యంతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా సాగిపోతాయి. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. కొందరు బంధుమిత్రుల వల్ల ఇబ్బంది పడతారు. అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

బందువుల సమస్యల్లో తలదూర్చి ఇబ్బంది పడతారు. సోదరులతో ఆస్తి సమస్యలు తలెత్తవచ్చు. ఉద్యోగంలో అధికారుల నుంచి ఆశించిన గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా ముందుకు సాగుతాయి. ప్రముఖులతో లాభదాయక సంబంధాలు ఏర్పడతాయి. కొందరు చిన్న నాటి మిత్రులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. కొన్ని ఆటంకాలున్నప్పటికీ అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ముఖ్యమైన ప్రయత్నాలు సానుకూలంగా పూర్తవుతాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి బయటపడడానికి ప్లాన్లు తయారు చేసుకుంటారు. అనారోగ్యం నుంచి కొద్దిగా కోలుకునే అవకాశం ఉంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. చిన్ననాటి మిత్రులతో విహారయాత్ర చేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యో గంలో మీ పనితీరుతో అధికారులు, సహోద్యోగులను ఆకట్టుకుంటారు. కొత్త పరిచయాలు ఏర్పడ తాయి. జీవిత భాగస్వామితో వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. స్వల్ప అనారోగ్యం ఉండవచ్చు.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఒత్తిడి కలిగించే ఆర్థిక సమస్యలు ఉండకపోవచ్చు కానీ, ధనపరంగా వాగ్దానాలు చేయడం శ్రేయ స్కరం కాదు. ఆదాయం క్రమంగా వృద్ధి చెందుతుంది. వృత్తి, వ్యాపారాల్లో కార్యకలాపాలు విస్తరి స్తాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు మంచి ఆఫర్లు అందు తాయి. ఉద్యోగంలో మీ శక్తి సామర్థ్యాలకు గుర్తింపు లభిస్తుంది. తల్లితండ్రుల నుంచి సకాలంలో ఆశించిన సహాయం లభిస్తుంది. కుటుంబంలో కొద్దిగా ఆర్థికపరమైన ఒత్తిడి ఉండే అవకాశం ఉంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

వృత్తి, వ్యాపారాల్లో సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనలు బాగా కలిసి వస్తాయి. ఏ ప్రయత్నం తల పెట్టినా విజయం సిద్ధిస్తుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. మిత్రుల మీద ఖర్చుల్ని తగ్గించు కోవడం మంచిది. అదనపు ఆదాయానికి మార్గాలు పెరుగుతాయి. ఉద్యోగ జీవితం నల్లేరు మీద బండిలా సాగిపోతుంది. సమర్థత విషయంలో ఆశించిన గుర్తింపు పొందుతారు. చేపట్టిన పనులు, వ్యవహారాలు నిరాటంకంగా ముందుకు సాగుతాయి. ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఉద్యోగ జీవితం ఉత్సాహవంతంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఒక మోస్తరు లాభాలు కనిపిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలు సానుకూలంగా పూర్త వుతాయి. కుటుంబ విషయాల్లో మానసిక ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. తల్లితండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడం మంచిది. కొందరు బంధువుల సహాయంతో ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా కొద్ది శ్రమతో నెరవేరే అవకాశం ఉంది. బంధుమిత్రుల నుంచి రావలసిన డబ్బు చేతికి అందుతుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఆదాయానికి దీటుగా వృథా ఖర్చులు కూడా పెరుగుతాయి. బంధుమిత్రుల వల్ల కొద్దిగా డబ్బు నష్టపోయే అవకాశం కూడా ఉంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. అదనపు ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. శారీరక శ్రమ, ఒత్తిడి కాస్తంత ఎక్కువగా ఉంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల తలు పెరుగుతాయి. వ్యాపారాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. బంధువుల తోడ్పాటుతో పెళ్లి ప్రయత్నం ఒకటి సఫలం అవుతుంది. అనుకున్న వ్యవహారాలు కొద్ది శ్రమతో పూర్తవుతాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ కుటుంబ ఖర్చులు బాగా పెరుగుతాయి. ప్రస్తుతానికి ధనపరంగా ఇతరులకు వాగ్దానాలు చేయకపోవడం మంచిది. వృత్తి జీవితం లాభదాయకంగా సాగిపో తుంది. వ్యాపారాల్లో కొన్ని మంచి మార్పులు, చేర్పులు తలపెడతారు. ఉద్యోగంలో అధికారులు బాగా ఉపయోగించుకుంటారు. కొందరు బంధుమిత్రుల వల్ల ఇబ్బందులు తప్పకపోవచ్చు. పిల్లల చదువుల విషయంలో శుభ వార్తలు వింటారు. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. ఉద్యోగ జీవితం బాగా అనుకూలంగా సాగిపో తుంది. అధికారులకు మీ శక్తి సామర్థ్యాలు బాగా ఉపయోగపడతాయి. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. సేవ, సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధు మిత్రుల నుంచి శుభ కార్య ఆహ్వానాలు అందుతాయి. కొందరు మిత్రులు మీ సలహాల వల్ల లబ్ధి పొందుతారు. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఒకటి రెండు ముఖ్యమైన వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. కుటుంబంలో శుభ పరిణా మాలు చోటు చేసుకుంటాయి. ఆశించిన శుభవార్తలు వింటారు. పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండడం మంచిది. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, ఇతరు లకు ఎక్కువగా సహాయం చేయడం జరుగుతుంది. పిల్లల చదువుల మీద శ్రద్ధ పెంచడం అవ సరం. వృత్తి, వ్యాపారాల్లో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది.