AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Moon Transit: కుంభరాశిలో చంద్రుడు.. వారి మనసులో కోరికలు తీరే సమయం!

ఫిబ్రవరి 17, 18, 19 తేదీల్లో చంద్రుడు కుంభ రాశిలో సంచరిస్తూ రవితో కలవడం వల్ల అమావాస్య ఏర్పడుతుంది. సాధారణంగా అమావాస్య సమయంలో చంద్రుడు బలహీనంగా పరిగణించబడినా, ఈసారి గురుదృష్టి ఉండడం వల్ల అతనికి బలం పెరుగుతుంది. అదనంగా బుధ, శుక్రులతో కూడిన సంయోగం కొన్ని రాశులకు శుభయోగాలను అందిస్తుంది. ముఖ్యంగా మేషం, వృషభం, మిథునం, తుల, వృశ్చికం, మకరం రాశుల వారికి ఈ ప్రభావం అనుకూలంగా ఉంటుంది. ఈ అమావాస్య ప్రభావం మార్చి 2 వరకు కొనసాగుతుంది.

Moon Transit: కుంభరాశిలో చంద్రుడు.. వారి మనసులో కోరికలు తీరే సమయం!
Moon Transit
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Feb 14, 2026 | 6:38 PM

Share

ఈ నెల (ఫిబ్రవరి) 17, 18, 19 తేదీల్లో చంద్రుడు కుంభ రాశిలో సంచారం చేయడం జరుగుతుంది. ఈ రాశిలో అప్పటికే ఉన్న రవితో చంద్రుడు కలవడం వల్ల అమావాస్య ఏర్పడుతుంది. సాధారణంగా నీచ బడినా, అమావాస్య వచ్చినా చంద్రుడు బాగా బలహీనపడే అవకాశం ఉంటుంది. అయితే, గురు దృష్టి కలిగినప్పుడు మాత్రం చంద్రుడికి బలం పెరుగుతుందే తప్ప తగ్గడం జరగదు. ఈ మూడు రోజుల్లో చంద్రుడిని గురువు వీక్షించడంతో పాటు, శుభ గ్రహాలైన బుధ, శుక్రులతో కూడా కలవడం వల్ల చంద్రుడు కొన్ని రాశులకు యోగాలనివ్వడం జరుగుతుంది. అవిః మేషం, వృషభం, మిథు నం, తుల, వృశ్చికం, మకరం. ఈ అమావాస్య చంద్రుడి ప్రభావం మార్చి 2 వరకు కొనసాగుతుంది.

  1. మేషం: ఈ రాశికి చతుర్థాధిపతి అయిన చంద్రుడు లాభ స్థానంలో రవితో కలిసినందువల్ల ఈ రాశివారి జీవితంలో ఆకస్మిక శుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. ఆదాయ వృద్ధికి, పదోన్నతులకు సంబంధించి వీరు కంటున్న కలలు సాకారమవుతాయి. ఒకటికి రెండుసార్లు ధన యోగాలు పట్టే అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్ల వల్ల పెద్ద ఎత్తున ధన లాభం కలగడానికి అవకాశం ఉంది. రావలసిన డబ్బు, రాదనుకున్న డబ్బు కూడా చేతికి అందుతాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.
  2. వృషభం: ఈ రాశికి దశమ స్థానంలో అమావాస్య ఏర్పడడం, దాన్ని గురువు వీక్షించడం వల్ల ఉద్యోగులకు, నిరుద్యోగులకు కొద్ది ప్రయత్నంతో విదేశీ అవకాశాలు లభించడం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల రీత్యా ఇతర దేశాలకు వెళ్లే అవకాశం కలుగుతుంది. మనసులోని కొన్ని కోరికలు చాలావరకు నెరవేరుతాయి. ఆర్థికంగా ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. ముఖ్యమైన అవసరాలు, సమస్యలు తీరిపోతాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది.
  3. మిథునం: ఈ రాశికి ధన స్థానాధిపతి అయిన చంద్రుడు భాగ్య స్థానంలో రవితో కలవడం, దాన్ని గురువు వీక్షించడం వల్ల అనేక విధాలుగా ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు చాలావరకు తగ్గిపోయే అవకాశం ఉంది. అనారోగ్యాల నుంచి కూడా చాలా వరకు ఉపశమనం లభిస్తుంది. కుటుంబ జీవితంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. ఉద్యోగంలో హోదాలు, వేతనాలు అంచనాలకు మించి పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి.
  4. తుల: దశమ స్థానాధిపతి చంద్రుడు ఈ రాశికి పంచమ స్థానంలో రవితో కలవడం వల్ల ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో ఉన్నత పదవులు చేపడతారు. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి కూడా అవకాశం ఉంది. నిరుద్యోగులకు భారీ జీతభత్యాలతో కూడిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. విదేశీ అవకాశాలు కూడా అందుతాయి. వృత్తి, వ్యాపారాలు ఆర్థికంగా మెరుగైన స్థితికి చేరుకుంటాయి. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. మంచి పరిచయాలు కలుగుతాయి.
  5. వృశ్చికం: ఈ రాశికి చతుర్థ స్థానంలో రవి, చంద్రుల కలయిక జరిగి అమావాస్య ఏర్పడడం వల్ల కుటుంబం బాగా వృద్ధిలోకి రావడం గానీ, కుటుంబ సభ్యుల్లో ఒకరు ఘన విజయాలు సాధించడం గానీ జరుగుతుంది. కొద్ది ప్రయత్నంతో గృహ, వాహన సౌకర్యాలు కలుగుతాయి. విదేశీయానానికి ఆటంకాలు తొలగిపోతాయి. విదేశాల్లో ఉద్యోగాలు లభిస్తాయి. పెళ్లి ప్రయత్నాల్లో విదేశీ సంబంధం కుదురుతుంది. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. ఆస్తి వివాదాలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది.
  6. మకరం: ఈ రాశికి ధన స్థానంలో రవి, చంద్రులు కలవడం, ఈ యుతికి శుభ గ్రహాల సంబంధం ఏర్పడడం వల్ల అనేక విధాలుగా ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో వేతనాలు, వృత్తి, వ్యాపారాల్లో లాభాలు రెట్టింపయ్యే సూచనలున్నాయి. షేర్లు, స్పెక్యులేషన్లు అంచనాలకు మించి లాభిస్తాయి. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. ఆస్తి వివాదం ఒకటి సానుకూలంగా పరిష్కారమై, విలువైన ఆస్తి సంక్రమిస్తుంది. వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది.

కుంభరాశిలో చంద్రుడు.. వారి మనసులో కోరికలు తీరే సమయం!
కుంభరాశిలో చంద్రుడు.. వారి మనసులో కోరికలు తీరే సమయం!
శవాన్ని 191 కిలోమీటర్లు తీసుకెళ్లి దారుణం.. కానిస్టేబుల్ కిరాతకం.
శవాన్ని 191 కిలోమీటర్లు తీసుకెళ్లి దారుణం.. కానిస్టేబుల్ కిరాతకం.
దేశంలోనే హాట్ టూరిస్ట్ స్పాట్‌గా మారిన ఈ గ్రామం ప్రత్యేకత ఏమిటి?
దేశంలోనే హాట్ టూరిస్ట్ స్పాట్‌గా మారిన ఈ గ్రామం ప్రత్యేకత ఏమిటి?
చనిపోయే 6 రోజుల ముందు ఉదయ్ కిరణ్ ఫోన్‌లో మాట్లాడాడు..
చనిపోయే 6 రోజుల ముందు ఉదయ్ కిరణ్ ఫోన్‌లో మాట్లాడాడు..
పదేళ్లకే పసిడిపై పట్టు! ఈ చిన్నారి ఫ్యూచర్ బిజినెస్ టైకూన్..
పదేళ్లకే పసిడిపై పట్టు! ఈ చిన్నారి ఫ్యూచర్ బిజినెస్ టైకూన్..
ఏడుగురు హీరోయిన్లతో సినిమా.. ఐడియా బాగుంది..
ఏడుగురు హీరోయిన్లతో సినిమా.. ఐడియా బాగుంది..
పచ్చి బొప్పాయి మటన్ కర్రీ.. ఇలా వండి తింటే టేస్ట్ అదిరిపోతోంది!
పచ్చి బొప్పాయి మటన్ కర్రీ.. ఇలా వండి తింటే టేస్ట్ అదిరిపోతోంది!
కాంగ్రెస్ ఖాతాలోకి వడ్డేపల్లి మున్సిపాలిటీ
కాంగ్రెస్ ఖాతాలోకి వడ్డేపల్లి మున్సిపాలిటీ
అభిషేక్ ఆడతాడా లేదా.. పాక్ కెప్టెన్‌ కోరికపై సూర్య ఏమన్నాడంటే..?
అభిషేక్ ఆడతాడా లేదా.. పాక్ కెప్టెన్‌ కోరికపై సూర్య ఏమన్నాడంటే..?
బేగం బజార్‌ రోడ్డు మీద నైటీలు, స్కూల్ బ్యాగులు అమ్మాను..
బేగం బజార్‌ రోడ్డు మీద నైటీలు, స్కూల్ బ్యాగులు అమ్మాను..