Horoscope Today: ఈ రాశివారికి అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి.. ఆకస్మిక ప్రయాణాలు..!
Horoscope Today: చాలా మందికి తమ భవిష్యత్తులో ఏం జరుగబోతుందో ముందే తెలుసుకోవాలిని ఆసక్తి ఉంటుంది. ముఖ్యంగా తమ రోజు ఎలా ఉంటుంది....
Horoscope Today: చాలా మందికి తమ భవిష్యత్తులో ఏం జరుగబోతుందో ముందే తెలుసుకోవాలిని ఆసక్తి ఉంటుంది. ముఖ్యంగా తమ రోజు ఎలా ఉంటుంది.. ఏలాంటి పరిణమాలు జరుగుబోతున్నాయి అని తెలుసుకోవాలనుకుంటారు. ఈ క్రమంలో రాశిఫలాలు తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతారు. సెప్టెంబర్ 27 (సోమవారం) రాశి ఫలాలు ఎలా ఉండనున్నాయో తెలుసుకుందాం.
మేష రాశి:
ఈ రాశివారు చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. విందు, వినోదాల్లో పాల్గొంటారు. ఆత్మవిశ్వాసంలో ముందుకు సాగుతారు. ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి.
వృషభ రాశి:
ఈ రాశివారికి మెరుగైన ఫలితాలు లభిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇతరుల నుంచి ప్రశంసలు పొందుతారు. వ్యాపారాలు మెరుగ్గా ఉంటాయి.
మిథున రాశి:
వివిధ రంగాల వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృథా ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉంటాయి. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.
కర్కాటక రాశి:
ఆత్మవిశ్వాసంతో పనులు చేపడితే విజయాలు మీ సొంతం అవుతాయి. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.
సింహ రాశి:
సమాజంలో గొప్ప వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ఉద్యోగులకు బదిలీలు ఉండవచ్చు. వ్యాపార, ఇతర విషయాలలో అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక పరిస్థితులు నిలకడగా ఉంటాయి.
కన్య రాశి:
ఈ రాశివారు ఆర్థికంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఏదైనా పనులు చేపట్టే ముందు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది.
తుల రాశి:
కుటుంబ సభ్యులతో బేధాలు వచ్చే అవకాశం ఉంది. కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఓ సంఘటన ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది.
వృశ్చిక రాశి:
పట్టుదలతో ముందుకు సాగితే విజయాన్ని సాధిస్తారు. అప్పుల బాధ పెరగకుండా జాగ్రత్త పడాలి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉంది.
ధనుస్సు రాశి:
ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి సహకారం ఉంటుంది. వ్యాపారాలు నిలకడగా ఉంటాయి. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఉద్యోగులకు మంచి అవకాశాలు ఉంటాయి.
మకర రాశి:
కీలక వ్యవహారాలలో శ్రద్ద వహించడం మంచిది. ఖర్చుల విషయంలో పొదుపు పాటించాలి. అనవసరమైన విషయాలలో తలదూర్చడం మంచిది కాదు.
కుంభ రాశి:
తోటి వారి నుంచి సహాయం అందుకుంటారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఇతరుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.
మీన రాశి:
కొత్త వ్యాపారాలు చేపట్టే ప్రయత్నం చేస్తారు. ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. ఇష్టమైన వారితో గడుపుతారు. ఆరోగ్యం బాగుంటుంది. మేలైన ఫలితాలు ఉంటాయి.