Horoscope Today: ఈ రాశి వారు పిల్ల‌ల ఆరోగ్యాల విష‌యాల్లో జాగ్ర‌త్త‌గా ఉండాలి.. ఆదివారం మీ రాశిఫ‌లాలు చూసుకోండి..

Horoscope Today: ప్ర‌తీ రోజునూ ఒక్కో కొత్త అవ‌కాశంగా భావిస్తుంటారు. మ‌న‌లో చాలా మంది ఏదో ఒక కొత్త నిర్ణ‌యం తీసుకుంటూ జీవితంలో ముందుకు వెళ్లాల‌నే ఆలోచ‌న‌తో ఉంటారు...

Horoscope Today: ఈ రాశి వారు పిల్ల‌ల ఆరోగ్యాల విష‌యాల్లో జాగ్ర‌త్త‌గా ఉండాలి.. ఆదివారం మీ రాశిఫ‌లాలు చూసుకోండి..
Horoscope

Horoscope Today: ప్ర‌తీ రోజునూ ఒక్కో కొత్త అవ‌కాశంగా భావిస్తుంటారు. మ‌న‌లో చాలా మంది ఏదో ఒక కొత్త నిర్ణ‌యం తీసుకుంటూ జీవితంలో ముందుకు వెళ్లాల‌నే ఆలోచ‌న‌తో ఉంటారు. ఇందులో భాగంగానే వ్యాపారం, విద్య‌.. ఇలా ఏదో రంగంలో కొత్త ప‌నుల‌ను మొద‌లు పెడుతుంటారు. అయితే మ‌నం తీసుకునే నిర్ణ‌యాలు ఎంత ముఖ్య‌మో.. ఆ రోజు మ‌న రాశి ఫ‌లితం కూడా అంతే ముఖ్య‌మ‌ని న‌మ్మేవాళ్లు మ‌న‌లో చాలా మందే ఉంటారు. రాశి ఫ‌లాల ఆధారంగా కొత్త ప‌నుల‌ను మొద‌లు పెడుతుంటారు. మ‌రి ఈ రోజు (ఆదివారం) రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయో ఓ సారి చూసేయండి..

మేషరాశి..

మేష‌రాశి వారు ఈరోజు చేపట్టిన ప‌నుల‌ను పూర్తి చేసుకోగ‌లుగుతారు. ఆధ్యాత్మిక దైవ చింత‌న కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటుంటారు. శివాభిషేకం ఈ రాశి వారికి సూచించ‌ద‌గ్గ అంశం.

వృషభ రాశి..

ఈ రాశి వారి వారు ఈ రోజు ఆర్థిక‌, నేత్ర సంబంధిత విష‌యాల్లో జాగ్రత్త‌లు తీసుకోవాలి. ఆదిత్య హృద‌య స్తోత్ర పారాయ‌ణం ఈ రాశి వారికి మేలు చేస్తుంది.

మిధున రాశి..

మిధున రాశి వారికి ఈ రోజు వ్య‌క్తిగ‌త ఆరోగ్య విష‌యాల్లో జాగ్ర‌త్త తీసుకుంటూ ఉండాలి. మీ మంచి త‌నం మిమ్మ‌ల్ని అన్ని ర‌కాలుగా కాపాడుతుంటుంది. విష్ణు స‌హ‌స్త్రనామ స్తోత్ర పారాయ‌ణం మేలు చేస్తుంది.

కర్కాటక రాశి..

ఈ రాశి వారు ఈరోజు వృథా ఖ‌ర్చు ఎక్కువగా చేసే అవ‌కాశం కనిపిస్తోంది. పెట్టుబ‌డుల విష‌యంలో ఏ మాత్రం తొంద‌ర‌ప‌డ‌కూడ‌దు. గురు చ‌రిత్ర పారాయ‌ణం ఈ రాశివారికి సూచించ‌ద‌గ్గ అంశం.

సింహరాశి..

సింహ రాశి వారు ఈ రోజు ఆర్థిక ప్రయోజ‌నాల విష‌యంలో జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. చేప‌ట్టిన ప‌నుల‌న్నీ విజ‌య‌వంత‌మ‌య్యే అవకాశాలు క‌నిపిస్తున్నాయి. ఈ రాశి వారికి గ‌ణ‌ప‌తి నామ స్మ‌ర‌ణ మేలు చేస్తుంది.

కన్యరాశి..

ఈ రాశి వారు చేప‌ట్టిన ప‌నుల‌ను ఏ మాత్రం ఆవేశం లేకుండా నిదానంగా చేప‌ట్టే ప్ర‌య‌త్నం చేస్తుండాలి. దీనివ‌ల్ల హోదా, గౌర‌వం పెంచుకునే అవ‌కాశం ల‌భిస్తుంది. ప‌ర‌మేశ్వ‌రుడినికి రుద్రాభిషేకం చేయ‌డం ద్వారా ఈ రాశి వారికి మేలు జ‌రుగుతుంది.

తులా రాశి..

తుల రాశి వారు ఈ రోజు కుటుంబ పెద్ద‌ల విష‌యంలో జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. మ‌రింత ఆరోగ్యం, ప్ర‌శాంత‌త కోసం ప్రాణామాయంతో ఆదిత్య హృద‌య స్తోత్ర పారాయ‌ణ‌యం చేసుకోవ‌డం సూచించ‌ద‌గ్గ అంశం.

 

వృశ్చిక రాశి..

ఈ రాశి వారి ఈరోజు ప‌లు ర‌కాల బాధ‌ల నుంచి బ‌య‌ట ప‌డే ప్ర‌య‌త్నం చేస్తారు. వ్య‌క్తిగ‌త ఆరోగ్య విష‌యాల్లో జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం త‌ప్ప‌నిస‌రి. దుర్గ స‌ప్త శ్లోకి పారాయ‌ణం, శివుడికి రుద్రాభిషేకం నిర్వ‌హించ‌డం ఈ రాశి వారికి సూచించ‌ద‌గ్గ అంశం.

ధనుస్సు రాశి..

ధ‌నుస్సు రాశి వారు ఈ రోజు ఐక్య‌మ‌త్యం, అనుబంధాలు కోల్పోకుండా జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ ఉండాలి. రావాల్సిన బాకీలు వ‌సూళు అవుతాయి. సుబ్ర‌మ‌ణ్య స్వామి ఆధార‌ణ మేలు చేస్తుంది.

మకర రాశి..

ఈ రాశి వారు ఈరోజు అనారోగ్యాల విష‌యంలో ఏ మాత్రం నిర్ల‌క్ష్యం చేయ‌కూడ‌దు. పిల్ల‌ల ఆరోగ్యాల విష‌యంలో జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం మంచిది. నారాయ‌ణ నామ‌స్మ‌ర‌ణ మేలు చేస్తుంది.

కుంభరాశి..

ఈ రాశి వారు ఈరోజు నీతి, నియ‌మాల‌కు క‌ట్టుబ‌డి ఉంటారు. ధ‌ర్మం మిమ్మ‌ల్ని క‌చ్చితంగా కాపాడుతుంది. ప‌ర‌మేశ్వ‌రుడు అర్చ‌న‌, విష్ణు స‌హ‌స్త్ర స్తోత్ర పారాయ‌ణం మేలు చేస్తుంది.

మీన రాశి..

మీన రాశి వారు ఈరోజు మీ ప‌రిస‌ర ప్రాంతాల‌ను ప‌రిశుభ్రంగా ఉంచుకునే ప్ర‌య‌త్నం చేయాలి. ఆహార‌, విహారాదుల విష‌యంలో జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. గ‌ణ‌ప‌తి నామ స్మ‌ర‌ణ ఈరాశి వారికి సూచింగ‌ద‌గ్గ అంశం.

Also Read: Akshaya Tritiya: అక్ష‌య తృతీయ రోజున ఏడు వేల మామిడి పండ్ల‌తో ఆల‌య‌ అలంక‌ర‌ణ‌.. చూడ‌డానికి రెండు క‌ళ్లూ చాల‌వు..

Annapurna Meals : లాక్ డౌన్‌లో అన్నార్తుల ఆక‌లి తీరుస్తున్న అన్న‌పూర్ణ భోజ‌నం.. ఇప్పుడు గ్రేటర్లో రోజూ 45వేల మందికి..

Parshuram Jayanti 2021: పరశురామ జయంతి ఎప్పుడు జరుపుకుంటారు.. శుభ సమయం, ప్రాముఖ్యత, చరిత్ర తెలుసుకుందామా..