Parshuram Jayanti 2021: పరశురామ జయంతి ఎప్పుడు జరుపుకుంటారు.. శుభ సమయం, ప్రాముఖ్యత, చరిత్ర తెలుసుకుందామా..

Parshuram Jayanti 2021: పరశురాముడు.. విష్ణుమూర్తి దశావతారములలో ఆరవ అవతారం. వైశాఖ శుద్ద తదియ రోజున పరశురాముడు జన్మించాడని స్కాంద,

Parshuram Jayanti 2021: పరశురామ జయంతి ఎప్పుడు జరుపుకుంటారు.. శుభ సమయం, ప్రాముఖ్యత, చరిత్ర తెలుసుకుందామా..
Parshuram Jayanti 2021
Follow us
Rajitha Chanti

|

Updated on: May 14, 2021 | 7:34 AM

Parshuram Jayanti 2021: పరశురాముడు.. విష్ణుమూర్తి దశావతారములలో ఆరవ అవతారం. వైశాఖ శుద్ద తదియ రోజున పరశురాముడు జన్మించాడని స్కాంద, బ్రహ్మండ పురాణాలు చెబుతున్నాయి. క్షత్రియుల నుంచి ప్రజలను రక్షించడానికి పరశురాముడు అవతరించాడని విశ్వాసిస్తుంటారు. అలాగే పరశురాముడి జయంతి కూడా త్రేతాయుగ ప్రారంభరోజే అని నమ్ముతుంటారు. హిందూ క్యాలెండర్ ప్రకారం పరశురాముడి జయంతి వైశాఖ మాసంలో వస్తుంది. శుక్ల పక్షం మూడవ రోజున జయంతి జరుపుకుంటారు.

పరశురామ జయంతి 2021: తేదీ, శుభ సమయం.. తృతీయ తిథి 2021 మే 14.. ఉదయం 4.08 ఉదయం ప్రారంభమవుతుంది. తృతీయ తిథి 2021 మే 15న ఉదయం 6.29తో ముగుస్తుంది.

ప్రాముఖ్యత.. పరశురామ అంటే పార్షుతో రాముడు.. అది గొడ్డలి. క్షత్రియుల క్రూరత్వం నుంచి భూమిని కాపాడటానికి పరశురాముడి అవతరించాడు. ఆయన శివ భక్తుడు. ఆయన ఆయుధం గొడ్డలి. పరశురాముడు ప్రసేనాజిత్ కుమార్తె రేణుక, బ్రిగు రాజవంశీయులైన జమదగ్ని దంపతులకు ఐదవ కుమారుడిగా జన్మించాడు. లక్ష్మీ అవతారమైన ధనవిని వివాహం చేసుకున్నాడు. హిందూ పురాణాల ప్రకారం పరశురాముడు అమరుడు. ఇప్పటికీ భూమిపై అతను ఉన్నట్లుగా నమ్ముతుంటారు. భీష్ముడు, ద్రోణాచారి, కర్ణుల గురువు పరశురాముడు.

కథ… హరి వంశ పురాణం ప్రకారం, కర్తా విర్య అర్జునుడు రాజు, అతను మహిష్మతి నగరాన్ని పరిపాలించాడు. అతను మరియు ఇతర క్షత్రియులు అనేక విధ్వంసక పనులలో పాల్గొన్నారు. దీంతో చాలా మంది అనేక కష్టాలు పడ్డారు. దీంతో బాధపడిన ప్రుథ్వీ క్షత్రియుల క్రూరత్వం నుండి భూమిని, జీవులను కాపాడటానికి విష్ణువు సహాయం కోరారు. అప్పుడు ఆ దేవికి సహాయం చేసేందుకు విష్ణువు పరశురాముని పేరుతో రేణుక, జమదగ్ని దంపతులకు కుమారుడిగా జన్మించాడు. అతనే అర్జునుడిని, క్షత్రియులను వధించి భూమిని, ఇతర ప్రజలను వారి క్రూరత్వం నుండి కాపాడాడు.

పూజా విధి… ఈరోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానమాచరించి.. సాంప్రదాయ దుస్తులను ధరిస్తారు. ఈరోజున ఉపవాసం ఉంటారు. కేవలం పాలు, పండ్లు వంటి సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకుంటారు. ఈరోజున లక్ష్మీ నారయణను ఆరాధిస్తారు. పవిత్ర తులసి ఆకులు, చందన్, కుంకమ, పువ్వులను విష్ణువుకు అర్పిస్తారు. ఈరోజున భోగి పండ్లు, పాల ఉత్పత్తులను భక్తులకు ధానం చేస్తారు.

Also Read: Happy Eid-ul-Fitr 2021: మీ ఆత్మీయులకు ఈద్ ఉల్ ఫితర్ విషెస్ తెలియజేయండిలా.. రంజాన్ శుభాకాంక్షలు..

Horoscope Today: అక్షయ తృతీయ రోజున వీరికి ఉద్యోగాలు, వ్యాపారాల్లో కలిసివస్తుంది.. మే 14 రాశి ఫలాలు..