Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: ఈ రాశులవారు పెట్టుబడులు, ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి.. మే 15 రాశి ఫలాలు..

Rasi Phalalu on may 14th 2021: మన దేశంలో ఇప్పటికీ రాశిఫలాలను నమ్మేవారి సంఖ్య అధికంగానే ఉంటుంది. తమ రోజూను ప్రారంభించే ముందు

Horoscope Today: ఈ రాశులవారు పెట్టుబడులు, ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి.. మే 15 రాశి ఫలాలు..
Horoscope Today
Follow us
Rajitha Chanti

|

Updated on: May 15, 2021 | 6:59 AM

Rasi Phalalu on may 14th 2021: మన దేశంలో ఇప్పటికీ రాశిఫలాలను నమ్మేవారి సంఖ్య అధికంగానే ఉంటుంది. తమ రోజును ప్రారంభించే ముందు తమ జీవితంలో ఏం జరగబోతుందో తెలుసుకోవాలని ఆసక్తి చూపిస్తుంటారు. అందులో భాగంగానే రాశి ఫలాలను తెలుసుకుంటుంటారు. ఈరోజు మే 15న శనివారం రాశి ఫలాలను తెలుసుకుందామా..

మేషరాశి..

ఈరోజు వీరికి ఆర్థిక లాభాలు, కార్యసిద్ధులు కలసి వస్తుంటాయి. ప్రముఖుల నుంచి మంచి మంచి సలహాలు అందుకుంటారు. సుబ్రమణ్య స్వామి అర్చన మేలు చేస్తోంది.

వృషభ రాశి..

ఈరోజు వీరు చేపట్టిన పనులు అనుకూలంగా, ప్రయోజనకరంగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తుండాలి. దత్తాత్రేయ స్వామి వారి దర్శనం మేలు చేస్తోంది.

మిధున రాశి..

ఈరోజు వీరికి నూతనమైన విషయాలు తెలుస్తుంటాయి. పరిచయాలు మరింతగా పెరుగుతుంటాయి. పేదవారికి పాలు, పండ్లు దానం చేసుకోవడం మంచిది.

కర్కాటక రాశి..

ఈరోజు వీరికి వ్యవహరిక విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. పెద్దవారి యొక్క సహకారాలు కోరుకుంటారు. సుబ్రమణ్య స్వామి అర్చన మేలు చేస్తోంది.

సింహరాశి..

ఈరోజు వీరు ముఖ్యమైన వ్యక్తులను కలుసుకుంటారు. విందు, వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గోంటుంటారు. దుర్గా అమ్మవారికి కుంకుమ అర్చన నిర్వహించుకోవడం మంచిది.

కన్యరాశి..

ఈరోజు వీరికి అనారోగ్య సంబంధమైన భావాలను పెరుగుతుంటాయి. వాటిని తగ్గించుకునే ప్రయత్నం చేస్తుండాలి. శివ పంచాక్షరీ జపం చేసుకోవడం మంచిది.

తులా రాశి..

ఈరోజు వీరు పెట్టుబడుల విషయంలో తొందరపడకూడదు. పెద్దవారి ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం మేలు చేస్తుంది.

వృశ్చిక రాశి..

ఈరోజు వీరు కుటుంబ వ్యవహారిక విషయాల్లో కొన్ని అవాంతరాలను ఎదుర్కోంటుంటారు. జాగ్రత్తలు తీసుకోవాలి. విష్ణు సహస్ర నామ స్తోత్ర పారాయణం మేలు చేస్తుంది.

ధనుస్సు రాశి..

ఈరోజు వీరు నూతన ఉత్సాహంతో చేపట్టిన పనులను పూర్తి చేసుకుంటారు. పార్వతీ అమ్మవారి దర్శనం మేలు చేస్తుంది.

మకర రాశి..

ఈరోజు వీరు దూరపు బంధువులను కలుసుకుంటారు. ఆస్తి వ్యవహరిక విషయాల్లో జాగ్రత్తలను తీసుకొని కొన్ని ఒప్పందాలను కుదుర్చుకునే ప్రయత్నం చేస్తుంటారు. శ్రీరామ రక్ష స్తోత్ర పారాయణం మేలు చేస్తుంది.

కుంభరాశి..

ఈరోజు వీరికి వ్యవహారిక విషయాల్లో అనుకూలత ఉంటుంది. ఆర్థిక విషయాల్లో, ఆరోగ్య విషయాల్లో ఇబ్బందులు తొలగించుకోగలుగుతారు. శివ పంచాక్షరీ జపం మేలు చేస్తుంది.

మీన రాశి..

ఈరోజు వీరు స్నేహితులను, బంధువులను కలుసుకుంటారు. కుటుంబపరమైన అంశాలలో కొన్ని ముఖ్యమైన చర్చలు జరుపుతుంటారు. ఆలయాలు, ఆశ్రమాలు సందర్శిస్తుంటారు. అష్టలక్ష్మీ స్తోత్ర పారాయణం మేలు చేస్తుంది.

Also Read: ఎల్ఐసీలో అదిరిపోయే స్కీమ్.. ఇందులో చేరితే ప్రతి 3 నెలలకు డబ్బులు.. ఒకేసారి రూ.10 వేలు అందుకునే..

కీలక నిర్ణయం తీసుకున్న ఆర్బీఐ.. ఆ బ్యాంక్ లైసెన్స్ రద్దు చేస్తున్నట్లు ప్రకటన… అయోమయంలో కస్టమర్లు..