Horoscope Today: ఆ రాశివారికి ఈరోజు అంత‌గా క‌లిసి రాక‌పోవ‌చ్చు.. సోమ‌వారం రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today: క్యాలెండ‌ర్‌లో మ‌రో కొత్త వారం మొద‌లైంది. మ‌రి ఈ రోజు కొత్త నిర్ణ‌యాలు తీసుకోవ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నారా.? అయితే రాశి ఫ‌లం ఆధారంగా మీరు తీసుకోబోయే నిర్ణ‌యాలు...

Horoscope Today: ఆ రాశివారికి ఈరోజు అంత‌గా క‌లిసి రాక‌పోవ‌చ్చు.. సోమ‌వారం రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయంటే..
Horoscope Today
Follow us
Narender Vaitla

|

Updated on: May 17, 2021 | 6:43 AM

Horoscope Today: క్యాలెండ‌ర్‌లో మ‌రో కొత్త వారం మొద‌లైంది. మ‌రి ఈ రోజు కొత్త నిర్ణ‌యాలు తీసుకోవ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నారా.? అయితే రాశి ఫ‌లం ఆధారంగా మీరు తీసుకోబోయే నిర్ణ‌యాలు ఏమేర రాణిస్తాయో.. చూసుకొని ఈ కొత్త వారాన్ని ప్రారంభించండి. ఈ రోజు రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయో ఓ సారి చూడండి.

మేషరాశి..

మేష రాశి వారు ఈరోజు నూత‌న కార్య‌క్ర‌మాలు చేప‌ట్టే అవ‌కాశాలున్నాయి. గృహ సంబంధిత విందు, వినోద కార్య‌క్ర‌మాలను నిర్వ‌హిస్తారు. దుర్గా ఆరాధ‌ణ ఈ రాశి వారికి మేలు చేస్తుంది.

వృషభ రాశి..

ఈ రాశి వారి వ్య‌క్తిగ‌త అభివృద్ధి కోసం అప్పులు చేసే ప్ర‌యత్నం చేస్తారు. ఆలోచ‌న‌లు అంత‌గా క‌లిసి రాక‌పోవ‌చ్చు.. ఓం శ‌ర‌వ‌న‌భ‌వ అనే నామ స్మ‌ర‌ణ మేలు చేస్తుంది.

మిధున రాశి..

ఈ రాశి వారికి ఈ రోజు స్నేహితులు, బంధువుల నుంచి కొన్ని ర‌కాల ఒత్తిడిలు ఏర్ప‌డుతుంటాయి. ఆధ్యాత్మిక చింత‌న మిమ్మ‌ల్ని కాపాడుతుంటుంది. శంక పుష్పాల‌తో ప‌ర‌మేశ్వ‌రుడికి అర్చ‌న చేయ‌డం ఈ రాశి వారికి సూచించ‌ద‌గ్గ అంశం.

కర్కాటక రాశి..

క‌ర్కారట రాశి వారికి ఆర్థిక అభివృద్ధి చోటు చేసుకునే అవ‌కాశం క‌నిపిస్తోంది. ముఖ్య‌మైన నిర్ణ‌యాలు తీసుకుంటారు. విద్యా విషయాల్లో మంచి స‌హ‌కారాలు పొందుంటారు. ఓం గం గ‌ణ‌ప‌త‌యే న‌మః నామ స్మ‌ర‌ణ ఈ రాశి వారికి మేలుచేస్తుంది.

సింహరాశి..

ఈ రాశి వారు ఈరోజు సౌక‌ర్యాల విష‌యాల్లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. వాహ‌న సంబంధిత విష‌యాల్లో జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం మంచిది. నందీశ్వ‌రుడి పూజ ఈరాశి వారికి సూచించ‌ద‌గ్గ అంశం.

కన్యరాశి..

క‌న్య రాశి వారు ఈరోజు ఆదాయానికి మించిన ఖ‌ర్చులు చేసే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఉద్యోగాల విష‌యంలో అద‌న‌పు బాధ్య‌త‌లు స్వీక‌రించే ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. ల‌క్ష్మీ నారాయ‌ణ పూజ మేలు చేస్తుంది.

తులా రాశి..

ఈ రాశి వారి ఈ రోజు అనుకున్న ప‌నుల‌ను స‌కాలంలో పూర్తి చేసుకోగ‌లుగుతారు. మాట విలువ కోల్పోకుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. ఓం మ‌హా దేవీ న‌మః అనే నామ స్మ‌ర‌ణ ఈ రాశి వారికి సూచంచ‌ద‌గ్గ అంశం.

వృశ్చిక రాశి..

వృశ్చిక రాశి వారు ఈరోజు దూర ప్ర‌యాణాలు చేసే అవ‌కాశాలు ఉన్నాయి. మీకు వ‌చ్చిన ఇబ్బందుల‌ను ఎదుర్కొవ‌డానికి బంధువులు స‌హ‌కారం చేస్తుంటారు. ఆంజ‌నేయ స్వామి వారి స్తోత్ర పారాయ‌ణం ఈ రాశి వారికి మేలు చేస్తుంది.

ధనుస్సు రాశి..

ఈ రాశి వారికి ప‌నులు పూర్తి చేసే విష‌యంలో శ్ర‌మ పెరిగే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఉద్యోగాల విష‌యంలో జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. విష్ణు సంబంధిత స్తోత్ర పారాయ‌ణం వీరికి సూచించ‌ద‌గ్గ అంశం.

మకర రాశి..

మ‌క‌ర రాశివారి ఈరోజు వ్య‌క్తిగత అంశాల్లో ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటారు. దూర‌పు బంధువుల‌ను క‌లుసుకునే అవ‌కాశాలున్నాయి. రాజ‌రాశేశ్వ‌రి అమ్మ‌వారి స్తోత్ర పారాయ‌ణం మేలు చేస్తుంది.

కుంభరాశి..

ఈ రాశి వారికి ఈరోజు ఆక‌స్మిక ప్ర‌యాణాలు ఏర్ప‌డే అవ‌కాశాలున్నాయి. అనారోగ్య సంబంధ‌మైన భావ‌న‌లు చోటుచేసుకుంటాయి. ఆహార విహారాదుల్లో జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. దుర్గ స‌ప్త శ్లోకి పారాయ‌ణం మేలు చేస్తుంది.

మీన రాశి..

మీన రాశి వారికి వ్య‌క్తిగ‌త ఆస్తి విష‌యాలు ప‌రిష్కారం చేసుకునే దిశ‌గా అడుగులు వేస్తారు. ప‌లు శుభ‌కార్య‌క్ర‌మాలు చేప‌ట్టి పూర్తి చేసుకోగ‌లుగుతారు. గ‌రిక‌తో మ‌హాగ‌ణ‌ప‌తిని అర్చ‌న చేసుకోవ‌డం మంచిది.

Also Read: Vijay Sethupathi : విజయ్ సేతుపతి బాలీవుడ్ సినిమాను అడ్డుకున్న కరోనా.. ఆగిపోయిన షూటింగ్ ..

Airtel offer: ఎయిర్‌టెల్ బంపర్ ఆఫర్.. 5.5 కోట్ల మంది కస్టమర్లకు రీచార్జ్ ఉచితం.. వివరాలు..

Covid-19: కరోనా లక్షణాలు ఉండి.. నెగిటివ్ రిపోర్ట్ వస్తే.. ఏం చేయాలో తెలుసా..? ఎయిమ్స్ ఏం చెప్పిందంటే?

తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం