AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మే 21 రాశిఫలాలు: గురు బలంతో ఆ రాశుల వారికి అదృష్టం.. 12 రాశుల వారికి ఇలా..

Horoscope Today: మే 21, 2026 గురువారం రాశిఫలాల్లో కొన్ని రాశుల వారికి శుభయోగాలు కనిపిస్తున్నాయి. మేష రాశి వారికి ఉద్యోగ, వివాహ ప్రయత్నాల్లో మంచి వార్తలు అందే అవకాశం ఉండగా, వృషభ రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో ప్రోత్సాహకర పరిస్థితులు ఏర్పడనున్నాయి. మిథున రాశి వారికి గురు బలం కారణంగా ఆర్థిక అదృష్టం కలిసి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. మరి మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారికి ఈ రోజు ఎలా ఉండబోతోందో తెలుసుకోండి.

మే 21 రాశిఫలాలు: గురు బలంతో ఆ రాశుల వారికి అదృష్టం.. 12 రాశుల వారికి ఇలా..
Rashifal In Telugu 21 May 2026
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 21, 2026 | 5:45 AM

Share

దిన ఫలాలు (మే 21, 2026): మేష రాశి వారు ఈ రోజు ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు. కొందరు మిత్రులు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి వృత్తి జీవితం సాఫీగా, సంతృప్తి కరంగా సాగిపోతుంది. ఉద్యోగంలో ఆశించిన ప్రోత్సాహం, ఆదరణ లభిస్తాయి. మిథున రాశి వారు వ్యాపారాల పనులతో బాగా బిజీ అయిపోతారు. గురు బలం వల్ల ఆర్థికంగా మరింత బాగా అదృష్టవంతులవుతారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

గ్రహాల అనుకూలత వల్ల అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో మాటకు, చేతకు తిరుగుండదు. వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. ప్రయాణాల వల్ల ఆశించిన లాభాలుంటాయి. ఆదాయానికి ఇబ్బందేమీ ఉండదు. తోబుట్టువులతో ఆస్తి వివాదం పరిష్కార దిశగా సాగుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు. కొందరు మిత్రులు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. తక్కువ శ్రమతో ఎక్కువగా లబ్ధి పొందుతారు.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

బుధ, రవులు, గురు, శుక్రులు బాగా అనుకూలంగా ఉండడం వల్ల వృత్తి జీవితం సాఫీగా, సంతృప్తి కరంగా సాగిపోతుంది. ఉద్యోగంలో ఆశించిన ప్రోత్సాహం, ఆదరణ లభిస్తాయి. వ్యాపారాలు నిలకడగా సాగుతాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందే అవకాశం ఉంది. బంధుమిత్రులతో సర దాగా కాలక్షేపం చేస్తారు. మాట తొందర వల్ల కుటుంబంలో విభేదాలు, అపార్థాలకు అవకాశం ఉంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. పెళ్లి ప్రయత్నాల్లో ఆశించిన శుభవార్త అందుతుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

గ్రహాల అనుకూలత ఎక్కువగా ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలపరంగానే కాకుండా ఆర్థికపరంగా కూడా బాగా కలిసి వచ్చే సమయం ఇది. కొద్ది ప్రయత్నంతో ముఖ్యమైన కార్యకలాపాలన్నీ పూర్తవుతాయి. బంధుమిత్రులకు ఆర్థికంగా సహాయం చేయడం కూడా జరుగుతుంది. శుభకార్యంలో పాల్గొంటారు. వ్యక్తిగత, కుటుంబ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. వ్యాపారాల పనులతో బాగా బిజీ అయిపోతారు. గురు బలం వల్ల ఆర్థికంగా మరింత బాగా అదృష్టవంతులవుతారు.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

రవి, కుజ, బుధ గ్రహాలు ప్రస్తుతం అనుకూలంగా ఉన్నందువల్ల వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి ఉంటుంది. ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. డాక్టర్లు, లాయర్లు వంటి వృత్తులవారికి తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. వృత్తి నిపుణులు మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. వ్యాపారాలు లాభదాయకంగా కొనసాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. ఆరోగ్యం బాగా నిలకడగా ఉంటుంది. అనుకోకుండా ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

శుభ గ్రహాల అనుకూలత వల్ల అష్టమ శని ప్రభావం కూడా తగ్గుముఖం పడుతుంది. ఫలితంగా వృత్తి, ఉద్యోగాలు సాఫీగా, సంతృప్తికరంగా సాగిపోతాయి. ముఖ్యమైన కార్యకలాపాలను పూర్తి చేయడంలో కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. డాక్టర్లు, లాయర్ల వంటి వృత్తుల వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాలు ఆశాజనకంగా పురోగమిస్తాయి. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

రాశినాథుడు బుధుడు భాగ్య స్థానంలో సంచారం వల్ల ఆదాయం బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో రోజంతా ఆశించిన విధంగా ఆగిపోతుంది. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం కావడం, ఒకటి రెండు కోరికలు నెరవేరడం, బంధువుల నుంచి శుభవార్తలు వినడం వంటివి జరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో కొద్దిగా ఒత్తిడి ఉన్నప్పటికీ, గౌరవప్రదంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో కొద్దిగా లాభాలుండే అవకాశం ఉంది. ఎదురు చూస్తున్న శుభవార్తలు అందుతాయి.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

శుభ గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నాయి. షష్ట స్థానంలో ఉన్న శనీశ్వరుడు ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అయ్యేటట్టు చేస్తాడు. ఉద్యోగ జీవితంలో ప్రాధాన్యం పెరుగుతుంది. వృత్తి పరంగా రాబడి బాగా పెరిగే అవకాశం ఉంది. వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు గడిస్తారు. ముఖ్యమైన వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల్ని కలుపుకుని వెళ్లడం మంచిది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి. వాహన ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. పెళ్లి విషయంలో ఆశించిన శుభవార్త వింటారు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

బుధ, రవులు పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉన్నారు. అందువల్ల కొద్ది ప్రయత్నంతో ముఖ్య మైన వ్యవహారాలు, పనులన్నీ పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. కుటుంబ సభ్యుల సలహాలు పనికి వస్తాయి. ఆస్తి వివాదంలో తోబుట్టువులతో రాజీ మార్గం అనుసరిస్తారు. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి ఆశించిన విశేషాలు వింటారు. ఉద్యోగపరంగా దూర ప్రాంతం నుంచి శుభవార్త వింటారు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

గురు, శుక్రుల బలం కారణంగా వ్యాపారాలు లాభసాటిగా పురోగతి చెందుతాయి. ఆర్థిక ప్రయత్నాలు కలిసి వస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలను పరిష్కరించుకోవడంలో చురుకుగా వ్యవహరించడం మంచిది. కాలయాపన అవుతున్న పనులను పూర్తి చేయడం ఉత్తమం. వృత్తి, ఉద్యో గాల్లో మాట చెల్లుబాటవుతుంది. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారమవుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లతో సహా ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

పంచమ స్థానంలో ఏర్పడ్డ రవి, బుధుల కలయిక కారణంగా కుటుంబ సభ్యుల వల్ల ఆర్థిక పురో గతి లభిస్తుంది. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. స్నేహితుల సహాయంతో వ్యక్తిగత పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఆహార, విహారాల్లో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. వృత్తి, ఉద్యోగాలు ప్రశాంతంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో కొద్దిగా లాభాలు గడిస్తారు. రావలసిన డబ్బు చేతికి అంది అవసరాలు తీరుతాయి. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

పంచమ స్థానంలో గురువు, చతుర్థ స్థానంలో బుధ, రవుల యుతి కారణంగా విదేశీ సంబంధమైన ప్రయత్నాలు సఫలం అవుతాయి. దూర ప్రాంతంలో ఉన్న బంధువులలో పెళ్లి సంబంధం కుదురుతుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందుతుంది. ఆర్థికంగా అదృష్టం కలిసి వచ్చే సూచనలున్నాయి. మిత్రులతో కలిసి సేవా కార్యక్రమంలో పాల్గొంటారు. కుటుంబ సభ్యులు అభివృద్ధి సాధిస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. అనుకోకుండా ఆర్థికంగా చిన్నపాటి అదృష్టం పడుతుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

గురు, శుక్రుల అనుకూల సంచారం కారణంగా కొన్ని ముఖ్యమైన వ్యక్తిగత సమస్యలు చాలా వరకు పరిష్కారమవుతాయి. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో పని భారం పెరిగే అవకాశం ఉంది. బరువు బాధ్యతలు బాగా పెరుగుతాయి. బంధువుల నుంచి శుభవార్త వింటారు. కుటుంబ సభ్యులతో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. వ్యాపారాల్లో లాభాలు పెరిగే సూచనలున్నాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. సామాజికంగా పలుకుబడి బాగా పెరుగుతుంది.

Follow Us
మే 21 రాశిఫలాలు: గురు బలంతో ఆ రాశుల వారికి అదృష్టం..
మే 21 రాశిఫలాలు: గురు బలంతో ఆ రాశుల వారికి అదృష్టం..
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై