దిన ఫలాలు మే 12: ఈ రాశుల వారికి కార్యసిద్ధి.. ఉద్యోగాల్లో శుభవార్తలు!
Horoscope Today in Telugu: మే 12 మంగళవారం రాశిఫలాల్లో చాలా రాశుల వారికి ఉద్యోగ, ఆర్థిక, కుటుంబ విషయాల్లో అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. మేషం నుంచి మీనం వరకు కొన్ని రాశుల వారికి కార్యసిద్ధి, ఆదాయ వృద్ధి, శుభవార్తలు లభించే సూచనలు ఉండగా, మరికొన్ని రాశుల వారు ఆర్థిక లావాదేవీలు, ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిదని జ్యోతిష నిపుణులు సూచిస్తున్నారు.

దిన ఫలాలు (మే 12, 2026): మేష రాశి వారికి ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగే సూచనలున్నాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. వృషభ రాశి వారు ఉద్యోగంలో ఉత్సాహంగా బాధ్యతలు నిర్వర్తిస్తారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. మిథున రాశి వారికి వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాలను దాటుతాయి. ప్రస్తుతానికి ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగే సూచనలున్నాయి. వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు, పనులు తేలికగా పూర్తవుతాయి. బంధుమిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఇష్టమైన మిత్రులతో విలాస జీవితం గడుపుతారు. ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఉద్యోగంలో ఉత్సాహంగా బాధ్యతలు నిర్వర్తిస్తారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. ఆదాయం బాగా పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో దైవ కార్యాల్లో పాల్గొంటారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. చిన్ననాటి మిత్రుల్ని కలుసుకుని, విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఇంటా బయటా గౌరవమర్యాదలు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి. అదనపు ఆదాయం మీద దృష్టి పెడతారు. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఉద్యోగంలో అధికారులు మీ మీద ఎక్కువగా ఆధారపడే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాలను దాటుతాయి. ఆదాయం బాగానే ఉంటుంది. ప్రస్తుతానికి ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. ఆర్థికంగా ఎవరికీ వాగ్దానాలు చేయడం, హామీలు ఉండడం కూడా మంచిది కాదు. సొంత సమస్యల పరిష్కారం మీద దృష్టి పెట్టడం మంచిది. బంధుమిత్రులతో కొన్ని వ్యవహారాల్లో విభేదాలు కలుగుతాయి. ఆరోగ్య సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
వృత్తి, ఉద్యోగాల్లో పనిభారం పెరుగుతుంది. ఆశించిన ప్రోత్సాహకాలు కూడా అందుతాయి. వ్యాపా రాల్లో పెట్టుబడికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది. బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఆర్థికంగా కొంత మెరుగైన పరిస్థితులుంటాయి. తలపెట్టిన పనులు అనుకూలంగా సాగుతాయి. ప్రయాణాల్లో కొత్త వ్యక్తుల పరిచయాలు కలుగుతాయి. దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఆర్థిక సమస్యలు బాగా తగ్గుముఖం పడతాయి. ఆరోగ్యం పరవాలేదు. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఉద్యోగంలో సంతృప్తికర పరిస్థితులుంటాయి. అధికారుల నుంచి అండదండలు లభిస్తాయి. లాభ సాటి పరిచయాలు ఏర్పడతాయి. సమాజంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో చాలావరకు ఆర్థిక సమస్యలను అధిగమిస్తారు. కొందరు సన్నిహిత మిత్రులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. జీవిత భాగస్వామితో కలిసి విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఉద్యోగంలో అధికారుల నుంచి వేధింపులు, ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. గృహ, వాహన రుణాలకు ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉంది. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేయడమే కాక, ఒకటి రెండు దీర్ఘకాలిక వ్యక్తిగత సమస్యలను కూడా పరిష్కరించుకుంటారు. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది. పిల్లలు పురోగతి చెందుతారు. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో ఏమాత్రం తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి. దూర ప్రాంతం నుంచి ఆశించిన సమాచారం అందుకుంటారు. ఆహార, విహారాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిది. కొత్త వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉంది. దూర ప్రాంతం నుంచి పిల్లలు ఇంటికి రావడం జరుగుతుంది. వ్యక్తిగత పరిచయాలు బాగా పెరుగుతాయి. దైవ కార్యాల్లో పాల్గొంటారు.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. ఆర్థిక పరి స్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైన పనులు సజావుగా పూర్తవుతాయి. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. కొత్త గృహ నిర్మాణ పనులు ప్రారంభిస్తారు. బంధుమిత్రుల రాకపోకలుంటాయి. పెళ్లి ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. ఆర్థిక వ్యవహారాలు చక్కబడతాయి. ఆర్థిక లావాదేవీలకు బాగా దూరంగా ఉండడం మంచిది. ఆరోగ్యం పరవాలేదు.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఉద్యోగంలో అధికారులతో సామరస్యం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు సానుకూలంగా, సంతృప్తి కరంగా సాగిపోతాయి. ఏ పని తలపెట్టినా కార్యసిద్ధి కలుగుతుంది. వాహన యోగం ఉంది. జీవిత భాగస్వామి తరఫు బంధువులు ఇంటికి వచ్చే అవకాశం ఉంది. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. అనుకోకుండా లాభదాయక స్నేహాలు ఏర్పడతాయి. నిరుద్యోగులకు విదేశాల నుంచి సైతం ఆఫర్లు అందుతాయి. దైవ కార్యాల్లో పాల్గొంటారు. దాంపత్య జీవితం హ్యాపీగా సాగిపోతుంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
వృత్తి, వ్యాపారాల్లో మార్పులు చేసి లబ్ధి పొందుతారు. రాబడి బాగా పెరుగుతుంది. వృత్తి జీవితం ఊపందుకుంటుంది. వ్యాపారాలు సంతృప్తికరంగా ముందుకు సాగుతాయి. ఉద్యోగంలో అధికారులు ప్రత్యేక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. ముఖ్యమైన పనులు, వ్యవహారాలను కుటుంబ సభ్యుల సహకారంతో పూర్తి చేస్తారు. చదువులకు సంబంధించి పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. జీవిత భాగస్వామి పురోగతి సాధిస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఉద్యోగంలో పని ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు సానుకూలంగా సాగిపోతాయి. వ్యయ ప్రయాసలతో కానీ ముఖ్యమైన పనులు, వ్యవహారాలు పూర్తి కావు. అనారోగ్యం కొద్దిగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. వృథా ఖర్చులు బాగా పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. కుటుంబ విషయాల్లో బంధువుల జోక్యం పనికి రాదు. జీవిత భాగస్వామిని సంప్రదించడం మంచిది. ఇరుగు పొరుగుతో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. స్పెక్యులేషన్ జోలికిపోవద్దు.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఉద్యోగంలో అధికారులను పనితీరుతో ఆకట్టుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలు, లక్ష్యాలు అందుకుంటారు. సోదర వర్గంతో ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. చేపట్టిన పనుల్లో యత్న కార్యసిద్ధి ఉంటుంది. సమాజంలో ఆదరణ పెరుగుతుంది. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని విందు కార్యక్రమంలో పాల్గొంటారు. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందుతుంది. ఆహార, విహారాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి.
(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష శాస్త్రం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది)