Horoscope Today: మంగళవారం రాశిఫలితాలు.. ఈరోజు ఈ రాశివారు కొత్త వస్తువులు కొనే అవకాశం ఉంది..
ఏ రంగంలోని వారైనా రోజుని ప్రారంభించే ముందు.. రోజులో ఎలా ఉంటుంది అని.. మంచి చెడుల గురించి ఆలోచిస్తారు. వెంటనే తమ రాశిఫలాలపై చాలామంది దృష్టి సారిస్తారు.
Horoscope Today (26-07-2022): ఏ రంగంలోని వారైనా రోజుని ప్రారంభించే ముందు.. రోజులో ఎలా ఉంటుంది అని.. మంచి చెడుల గురించి ఆలోచిస్తారు. వెంటనే తమ రాశిఫలాలపై చాలామంది దృష్టి సారిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు (జూలై 26వ తేదీ ) మంగళవారం రాశి ఫలాలు (Rashi Phalalu) ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..!
మేష రాశి: ఈ రాశివారు ఈరోజు బంధువులతో ఆనందంగా గడుపుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగంలో వారికి శుభఫలితాలు ఉంటాయి. కీలక నిర్ణయాలను తీసుకుని ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో పూర్తి చేస్తారు.
వృషభ రాశి: ఈరోజు ఈ రాశివారు కొత్తపనులను చేపడతారు. ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. సంతోషంగా గడుపుతారు. వృథా ఖర్చులు చేయాల్సి వస్తుంది.
మిధున రాశి: ఈ రోజు ఈ రాశివారు వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగంలోని వారు చేపట్టిన పనులను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేస్తారు. శుభవార్త వింటారు. బంధు, మిత్రులతో విందు వినోదకార్యక్రమాల్లో పాల్గొంటారు.
కర్కాటక రాశి: ఈ రోజు రాశివారు చేపట్టిన పనుల విషయంలో ఆలోచించి అడుగు వేయాలి. కీలక వ్యవహారంలో ముందుచూపుతో వ్యవహరించాల్సి ఉంటుంది. కీలక పనులు నిరాశపరుస్తాయి.
సింహ రాశి: ఈరోజు ఈ రాశివారు శుభవార్త వింటారు. ప్రారంభించిన పనులల్లో ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమించి పని చేస్తారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. మీ పనితీరుతో ప్రశంసలను పొందుతారు. ఆశించిన పురోగతి ఉంటుంది.
కన్య రాశి: ఈ రాశివారు ఈ రోజు ఆర్ధికంగా శుభఫలితాలను అందుకుంటారు. చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది.
తుల రాశి: ఈ రోజు ఈ రాశివారు శ్రమకు తగిన గుర్తింపు పొందుతారు. కీలక పనుల విషయంలో ఇతరుల ను కలుపుకుని వెళ్లడం వలన మేలు కలుగుతుంది. కీలక నిర్ణయాలు ఫలిస్తాయి.
వృశ్చిక రాశి: ఈరోజు ఈ రాశివారు ఆచితూచి అడుగు వేయాల్సి ఉంటుంది. శుభవార్త వింటారు. అధిక శ్రమ పడాల్సి ఉంటుంది. బంధువులతో తగిన జాగ్రత్తగా మెలగడం మేలు చేస్తుంది.
ధనస్సు రాశి: ఈరోజు ఈ రాశివారు బంధువుల సహకారంతో చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. శుభఫలితాలను పొందుతారు. కీలక విషయాల్లో నిర్లక్ష్యం వద్దు. కొత్త పనులను ప్రారంభిస్తారు.
మకర రాశి: ఈరోజు ఈ రాశివారు ప్రతిభకు తగిన ప్రశంసలను అందుకుంటారు. చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. బంధు, మిత్రులతో విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు.
కుంభ రాశి: ఈ రోజు ఈరాశివారు శుభవార్త వింటారు. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. వృత్తి రంగాల్లోని వారు అభివృద్ధికి సంబంధించిన శుభఫలితాలను అందుకుంటారు.
మీన రాశి: ఈరోజు ఈ రాశివారు శుభవార్త వింటారు. ఆర్ధికంగా లాభాలను సొంతం చేసుకుంటారు. బంధుమిత్రుల వలన శుభఫలితాలను అందుకుంటారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)