Horoscope Today: నేటి రాశిఫలాలు.. ఈరోజు ఈ రాశివారు ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం మేలు..
ఈరోజు తమ జాతకం ఎలా ఉంది అని తెలుసుకోవడానికి ఎక్కువమంది ఆసక్తి చూపిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు (జూలై 27వ తేదీ) బుధవారం ఏ రాశివారు (Rashi Phalalu) ఎలాంటి ఫలితాలను కలిగి ఉంటారో తెలుసుకుందాం..!
Horoscope Today (27-07-2022): రోజులో ఏ పనిమొదలు పెట్టాలన్నా.. ఎక్కడికి వెళ్లాలన్నా ఈరోజు తమ జాతకం ఎలా ఉంది అని తెలుసుకోవడానికి ఎక్కువమంది ఆసక్తి చూపిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు (జూలై 27వ తేదీ) బుధవారం ఏ రాశివారు (Rashi Phalalu) ఎలాంటి ఫలితాలను కలిగి ఉంటారో తెలుసుకుందాం..!
మేష రాశి: ఈరోజు ఈ రాశివారు శుభవార్త వింటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లోని వారు చేపట్టిన పనులు ఆత్మవిశ్వాసంతో పూర్తి చేస్తారు. బంధు, మిత్రులతో కలిసి విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.
వృషభ రాశి: ఈరోజు ఈ రాశివారు పనుల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించి పూర్తి చేస్తారు. అధిక శ్రమ చేయాల్సి ఉంటుంది. అధిక వ్యయం చేయాల్సి ఉంటుంది.
మిధున రాశి: ఈ రోజు ఈ రాశివారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. శుభవార్త వింటారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. బంధుమిత్రుల సహాయం అందుతుంది.
కర్కాటక రాశి: ఈ రాశివారు ఈరోజు బంధుమిత్రులతో జాగ్రత్తగా మెలగాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో ముందుకు వెళ్లారు. శారీరకంగా అధిక శ్రమ చేస్తారు.
సింహ రాశి: ఈరోజు ఈ రాశివారికి శుభకాలం. అనవసరానికి తగిన సాయం అందుతుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనుల్లో ఫలితాలను అందుకుంటారు.
కన్య రాశి: ఈ రాశివారు ఈరోజు బంధువులతో విబేధాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తప్పనిసరి. గౌరవ సన్మానాలు అందుకుంటారు. బంధువులతో విబేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి.
తుల రాశి: ఈ రోజు ఈ రాశి వారు శ్రమకు తగిన గుర్తింపుని సొంతం చేసుకుంటారు. కీలక పనులను చేపట్టి.. సక్సెస్ ఫుల్ గా పూర్తి చేస్తారు. కీలక నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి. అధికారుల ప్రోత్సాహంతో ముందుకు వెళ్లారు.
వృశ్చిక రాశి: ఈరోజు ఈరాశివారు అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా ఫలితాలను అనుకూలంగా ఉంటాయి. కుటుంబలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. అధిక శ్రమ పడాల్సి ఉంటుంది.
ధనస్సు రాశి: ఈరోజు ఈ రాశివారు మానసికంగా ఆనందంగా గడుపుతారు. వృత్తి, విద్య, ఆరోగ్య రంగాల్లోని వారు సంతోషంగా గడుపుతారు. మానసికంగా ఆనందంగా ఉంటారు.
మకర రాశి: ఈరోజు ఈ రాశివారు బాధ్యతలను సక్రమంగా నిర్వహించి.. ప్రశంసలను అందుకుంటారు. బంధు, మిత్రులతో సంతోషముగా గడుపుతారు. విందు వినోదకార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనులను పూర్తి చేస్తారు.
కుంభ రాశి: ఈ రోజు ఈరాశివారు చేపట్టిన పనులను పూర్తి చేయడానికి ఆటంకాలు కలగకుండా చూసుకోవాల్సి ఉంటుంది. ఆయా రంగాల్లో ఉన్నవారు అధిక శ్రమ పెరగకుండా చూసుకోవాల్సి ఉంది. చిన్న చిన్న విషయాలకు తీవ్రంగా ఆలోచించడం మానివేయడం మంచిది.
మీన రాశి: ఈరోజు ఈ రాశివారు బంధు, మిత్రులతో విందు, వినోదకార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల ప్రయాణాలను చేస్తారు. దృఢ నిశ్చయంతో ముందుకు వెళ్తే.. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఆనందం మీ సొంతమవుతుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)