Horoscope Today: వీరికి ఆర్థిక లాభాలు.. కొత్త వస్తువులు కొంటారు.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే
Horoscope Today (22-07-2022): ఈరోజు మనకు ఎలా ఉంది? మంచి ముహూర్తాలు ఎప్పుడు ఉన్నాయి? అశుభ సంకేతాలేమైనా ఉన్నాయా? అని తెలుసుకునేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తుంటారు. అందుకోసం
Horoscope Today (22-07-2022): ఈరోజు మనకు ఎలా ఉంది? మంచి ముహూర్తాలు ఎప్పుడు ఉన్నాయి? అశుభ సంకేతాలేమైనా ఉన్నాయా? అని తెలుసుకునేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తుంటారు. అందుకోసం ఆరోజు రాశిఫలాలు (Rasi Phalalu)ను చూస్తారు. వాటిని అనుసరించే రోజులో ఎలా ముందుకు సాగాలి అనే విషయాలపై దృష్టి సారిస్తారు. మరి జులై 22 (శుక్రవారం)న రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం రండి.
మేషం
నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. స్థిరమైన ఆలోచనలతో అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి.లక్ష్మీదేవిని పూజిస్తే శుభం కలుగుతుంది.
వృషభం
ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ఆత్మవిశ్వాసంతో ఇబ్బందులను అధిగమించే ప్రయత్నం చేస్తారు. కుటుంబంలో కలహాలు ఇబ్బంది పెడతాయి. ఆగ్రహావేశాలకు దూరంగా ఉండడం మంచిది. గోసేవ చేయడం వల్ల సానుకూల ఫలితాలు పొందుతారు.
మిథునం
కీలక వ్యవహారాలలో కుటుంబీకులు, పెద్దల సలహాలు, సూచనలు లాభిస్తాయి. నిర్ణయాలు అనుకూలంగానే ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు, శుభకార్యాల్లో పాల్గొంటారు. అనవసర ఖర్చులు పెరుగుతాయి. బంధువులతో విభేదాలు వచ్చే అవకాశాలున్నాయి. ఇష్టదేవతలను ఆరాధించడం శుభప్రదం
కర్కాటకం
చేపట్టిన రంగాల్లో సానుకూల ఫలితాలు ఉంటాయి. ఆత్మీయుల సహకారం అందుతుంది. కొన్ని విషయాల్లో మనస్సు చెప్పిన విధంగా నడుచుకోవడం మంచిది. శుభకార్యాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల సానుకూల ఫలితాలు అందుతాయి.
సింహం చేపట్టిన పనుల్లో శ్రమాధిక్యం. కుటుంబీకులు, బంధువులతో ఆచితూచి వ్యవహరించాలి. ఆర్థిక విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. రామరక్షా స్తోత్రం జపిస్తే మంచిది.
కన్య
శ్రమాధిక్యం తప్పదు. అస్థిర ఆలోచనలు ఇబ్బంది పెడతాయి. కీలక వ్యవహారాల్లో అనుభవజ్ఞుల సలహాలు పాటించడం మంచిది. మానసిక వేదనను కలిగించే సంఘటనలకు దూరంగా ఉండాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధిస్తే సానుకూల ఫలితాలు పొందుతారు.
తుల
వృత్తి,ఉద్యోగ,వ్యాపార, తదితర రంగాల వారికి సానుకూలంగా ఉంటుంది. సమయస్ఫూర్తితో ఆలోచిస్తారు. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. ప్రసన్నాంజనేయ స్తోత్రం పారాయణం చేయడం ఉత్తమం.
వృశ్చికం
ఈ రాశివారికి అదృష్టం వెన్నంటే ఉంటుంది. అధికారుల సహకారం లాభిస్తుంది. కీలక వ్యవహారాల్లో పై చేయి సాధిస్తారు. శ్రమాధిక్యం పెరగకుండా చూసుకోవాలి. వేంకటేశ్వర స్వామి దర్శించుకుంటే మేలు జరుగుతుంది.
ధనస్సు
భవిష్యత్తు ప్రణాళికలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంటారు. కుటుంబీకులు, ఆత్మీయులతో సంతోషంగా గడుపుతారు. ఓర్పు, సహనం తగ్గకుండా చూసుకోవాలి. సన్నిహితుల సహకారం తోడుంటుంది. ఆంజనేయ స్వామి దర్శించుకుంటే మంచిది.
మకరం
ముఖ్యమైన, కీలక విషయాల్లో బంధువుల సహకారం అందుతుంది. ఒక శుభవార్త ఇంట్లో సంతోషాన్ని పెంచుతుంది. సమాజంలో మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ఇష్ట దైవారాధన మాత్రం మానవద్దు.
కుంభం
అనుకున్న పనులు సకాలంలో నెరవేరుతాయి.మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. ఉద్యోగ వ్యవహారాల్లో అధికారుల సహకారం ఉంటుంది. ఆర్థిక లాభం ఉంటుంది. శత్రువులపై పై చేయి సాధిస్తారు. ఇష్టదైవారాధన శుభప్రదం.
మీనం
కీలక పనుల్లో జాప్యం జరుగుతుంది. కుటుంబ బాధ్యతలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొన్ని విషయాల్లో అంచనాలు తారుమారవుతాయి. కీలక విషయాల్లో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి.
Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..