Horoscope Today: ఈరాశుల వారు ఆర్థిక లావాదేవీలలో జాగ్రత్తగా ఉండాలి.. వ్యాపారాల్లో అనుకూలత..
Horoscope Today April 22nd 2021: ఇప్పటికీ రాశిఫలాలను నమ్మేవారి సంఖ్య అధికంగానే ఉంటుంది. తమ రోజూను
Horoscope Today April 22nd 2021: ఇప్పటికీ రాశిఫలాలను నమ్మేవారి సంఖ్య అధికంగానే ఉంటుంది. తమ రోజూను ప్రారంభించే ముందు తమ జీవితంలో ఏం జరగబోతుందో తెలుసుకోవాలని ఆసక్తి చూపిస్తుంటారు. అందులో భాగంగానే రాశి ఫలాలను తెలుసుకుంటుంటారు. మరీ గురువారం (ఏప్రిల్ 22న) రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందామా.
మేషరాశి..
ఈ రోజు వీరు చేపట్టినటువంటి పనులు చకచక పూర్తి చేసుకుంటారు. మీ నిర్ణయాలను ప్రతి ఒక్కరు హర్షిస్తుంటారు. ఈరోజు శివపంచాక్షరి జపం మేలు చేస్తుంది.
వృషభ రాశి..
ఈరోజు వీరు వాహన యోగాలు కలిసి వస్తుంటారు. కొన్ని శుభవార్తలు కూడా అందుకుంటారు. దుర్గా అమ్మవారి దర్శనం మేలు చేస్తోంది.
మిథున రాశి..
ఈరోజు వీరికి ఆర్థిక లావాదేవీలలో కొన్ని మిశ్రమ ఫలితాలు ఏర్పడుతాయి మాట విలువ కోల్పోవడం మంచిది కాదు. సూర్యనారాయం స్వామి అర్చన మేలు చేస్తుంది.
కర్కాటక రాశి..
ఈరోజు వీరికి ఆర్థిక సహాకరం అందుతుంది. సామాజిక కార్యకాలపాల్లో పాల్గోంటుంటారు. అష్టలక్ష్మీ స్త్రోత్ర పారాయణం మేలు చేస్తోంది.
సింహరాశి..
ఈరోజు వీరికి నూతనమైన ఉత్సాహం ఉంటుంది. ఆత్మస్థైర్యాన్ని పెంచుకుంటారు. ఆర్థికంగా నెమ్మదిగా నెమ్మదిగా మెరుగుపరుచుకుంటారు. ఈరోజు మహాలక్ష్మీ అమ్మవారి అర్చన మేలు చేస్తుంది.
కన్యరాశి..
ఈరోజు వీరు ఖర్చుల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అలాగే అనవసరమైన కొన్ని పాల్గోనడం కూడా మంచిది కాదు. ఈరోజు విష్ణు సహస్ర స్త్రోత్ర పారాయణం మేలు చేస్తుంది.
తులారాశి..
ఈరాశి వారికి ఆర్థిక , ఇతర ప్రయోజనాలు అందుతాయి. ఈరోజు వీరికి శివారాధన మేలు చేస్తుంది.
వృశ్చిక రాశి..
ఈరోజు వీరు వృద్ధి, వ్యాపారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. సామాజిక కార్యకాలపాల్లో పాల్గోంటుంటారు. ఈరోజు వీరికి ఆంజనేయ స్వామి అర్చన మరిన్ని శుభఫలితాలను ఇస్తుంది.
ధనుస్సు రాశి..
ఈరోజు వీరికి పుణ్యబలాన్నిపెంచుకునే ప్రయత్నాలు చేస్తుండాలి.పేదవారికి ఆర్థిక సహకరం, ధానదర్మాలు చేయడం మంచి ఫలితాలను కలిగిస్తాయి. అన్నధానం చేసుకోవడం, దేవాలయాల్లో అభిషేక సామాగ్రి సమర్పించుకోవడం మంచి ఫలితాలను ఇస్తుంది.
మకర రాశి..
ఈరోజు వీరికి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసరమైన ఇబ్బందులు ఎదుర్కోకుండా.. ముందు జాగ్రత్తగా ప్రణాళికలు వేసుకోవడం మంచిది. ఈరోజు వీరికి ఆదిత్యా హృదయ స్త్రోత్ర పారాయణం మేలు చేస్తోంది.
కుంభరాశి..
ఈరోజు వీరికి విందు, వినోదాలు ఉంటాయి. దంపతుల మధ్య అభిప్రాయా బేధాలు తొలగిపోతాయి. మహలక్ష్మీ అర్చన మేలు చేస్తుంది.
మీనరాశి..
ఈరోజు వీరికి సామాజిక గౌరవాలు అందుతుంటాయి. పోటీ తత్వాన్ని అధిగమించుకోగలుగుతారు. సుబ్రమణ్య స్వామి వారి అర్చన శుభఫలితాలను కలుగచేస్తుంది.
Also Read: SBI కస్టమర్లకు శుభవార్త… ఆ అకౌంట్ ఉంటే రూ. 2 లక్షలు మీ సొంతం.. అది ఎలానో తెలుసా..
Facebook: ఉద్యోగులకు షాక్ ఇవ్వనున్న ఫేస్బుక్.. ఆ ఎంప్లాయిస్ జీతాలను తగ్గించే యోచనలో సంస్థ..