Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్తలు.. 12 రాశుల వారికి రాశిఫలాలు
Today Horoscope (January 30, 2025): మేష రాశికి చెందిన ఉద్యోగులకు హోదా పెరిగే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పట్టే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి ఆదాయం అనుకూలంగా ఉంటుంది. దీంతో ఒకటి రెండు ముఖ్యమైన ఆర్థిక సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. మిథున రాశి వారి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల్లో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
![Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్తలు.. 12 రాశుల వారికి రాశిఫలాలు](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/01/horoscope-today-30th-january-2025.jpg?w=1280)
దిన ఫలాలు (జనవరి 30, 2025): మేష రాశికి చెందిన ఉద్యోగులకు హోదా పెరిగే అవకాశముండగా.. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పట్టే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి ఆదాయం అనుకూలంగా ఉండి.. ఒకటి రెండు ముఖ్యమైన ఆర్థిక సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. మిథున రాశి వారి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఉద్యోగులకు హోదా పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిపాటి మార్పులు చేసి లాభాలను పెంచుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పట్టే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాల్లో ఆశించిన శుభవార్తలు వింటారు. ఏ ప్రయత్నం తలపెట్టినా నెరవేరుతుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. అనుకోకుండా కొద్దిగా ఆస్తి లాభం కలిగే అవకాశం ఉంది. గృహ, వాహన ప్రయత్నాలు అనుకూలిస్తాయి.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఉద్యోగంలో మీ మీద అధికారులకు బాగా నమ్మకం పెరుగుతుంది. ప్రత్యేక బాధ్యతలతో ప్రోత్సహించడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా ముందుకు సాగుతాయి. ఆదాయం అనుకూలంగా ఉండడం వల్ల ఒకటి రెండు ముఖ్యమైన ఆర్థిక సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. కొందరు ప్రముఖులతో మంచి పరిచయాలు ఏర్పడతాయి. పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు అందుతాయి. ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
వృత్తి, వ్యాపారాలు ఎటువంటి సమస్యా లేకుండా పురోగమిస్తాయి. ఆశించిన స్థాయిలో రాబడి పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగాల్లో మీ సమర్థతకు మంచి గుర్తింపు లభిస్తుంది. అధికారులు మీ సలహాలు, సూచనలకు విలువనిస్తారు. కొద్ది ప్రయత్నంతో ఆదాయాన్ని వృద్ధి చేస్తారు. ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల్లో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాల్లో. శుభవార్త వింటారు.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఉద్యోగంలో అధికారులకు మీ పనితీరు పట్ల సంతృప్తి కలుగుతుంది. సహోద్యోగుల నుంచి ఆశిం చిన సహకారం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలకు అవకాశం ఉంది. నిరుద్యోగు లకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు సవ్యంగా పూర్తవు తాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. పిల్లలు చదువుల్లో పురోగతి సాధిస్తారు. పెళ్లి ప్రయ త్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆదాయం బాగానే వృద్ధి చెందుతుంది. ఆరోగ్యం నిలకడగాఉంటుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఆర్థిక పరిస్థితి కొద్దిగా మెరుగ్గా ఉంటుంది. ఎవరికీ ఎటువంటి వాగ్దానాలూ చేయకపోవడం మంచిది. వృత్తి, ఉద్యోగాల్లో పని భారం కాస్తంత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఓర్పు, సహనా లతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. వ్యాపారంలో కొన్ని మార్పులు చేపట్టడం జరుగుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. నష్టదాయక వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది. సొంత పనుల మీద శ్రద్ధ పెంచాల్సిన అవసరం ఉంది.
కన్య (ఉత్తర 2,3,4. హస్త, చిత్త 1,2)
ఉద్యోగ జీవితం ప్రోత్సాహకరంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు పెరిగే అవకాశం ఉంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు నిలకడగా కొనసాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు, పనుల్లో వ్యయప్రయాసలు ఎక్కువగా ఉంటాయి. కొందరు బంధువులతో అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. గృహ, వాహన ప్రయత్నాలు సఫలమవుతాయి. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. ఆర్థిక వ్యవహారాలు, లావాదేవీల్లో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఉద్యోగ జీవితంలో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. అధికారులు ప్రత్యేక బాధ్యతలతో బాగా ఆదరిస్తారు. వృత్తి, వ్యాపారాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతాయి. ఆర్థిక పరిస్థితి ఇదివరకటి కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఒకటి రెండు ముఖ్యమైన వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఇంటా బయటా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ఉద్యోగ జీవితంలో పని భారం, ఒత్తిడి కాస్తంత ఎక్కువగానే ఉంటాయి. ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలించకపోవచ్చు. నిరుద్యోగులకు ఒకటి రెండు అవకాశాలు అందుతాయి. వృత్తి జీవితంలో శ్రమాధిక్యత ఉన్నప్పటికీ ఫలితం ఉంటుంది. రాబడి కొద్దిగా పెరిగే అవకాశం కూడా ఉంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. కుటుంబ సమేతంగా ఆలయాలు సందర్శి స్తారు. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఉద్యోగంలో ఒకటి రెండు శుభవార్తలు వింటారు. అధికారుల ఆదరాభిమానాలు పొందుతారు. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. చేపట్టిన పనులు, వ్యవహారాలలో కార్యసిద్ధి ఉంటుంది. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. కొద్దిపాటి అనారోగ్యానికి అవకాశం ఉంది. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. కొందరు మిత్రులతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మీద ఖర్చు చేయడం జరుగుతుంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
వృత్తి, ఉద్యోగాలలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. లాభాలు బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. ఇంటా బయటా అనుకూలతలు పెరు గుతాయి. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ముఖ్య మైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. బంధుమిత్రులతో విందు కార్యక్రమంలో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల మీద ఖర్చులు పెరుగుతాయి. నిరుద్యోగులకు ఆశించిన శుభవార్త అందవచ్చు.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
వృత్తి, వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఎక్కువగా ఉంటుంది. లాభాలకు లోటుండకపోవచ్చు. ఉద్యోగంలో పనిభారం ఉంటుంది. తోటి ఉద్యోగుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. ఆదాయం నిలకడగా కొనసాగుతుంది. సొంత పనుల మీద శ్రద్ధ పెరుగుతుంది. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. ప్రయాణాల వల్ల మంచి లాభాలుంటాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
వృత్తి, ఉద్యోగాల్లో మీ సమర్థతను, పనితనాన్ని నిరూపించుకుంటారు. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ఉంటాయి. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు ఒకటి రెండు శుభవార్తలు అందుతాయి. కుటుంబ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. వ్యక్తిగత సమస్యల నుంచి కొద్దిగా ఉపశమనం పొందుతారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.